STOCKS

News


ఇప్కా ల్యాబ్స్‌ చేతికి అమెరికా ఫార్మా కంపెనీ

Thursday 4th October 2018
news_main1538626828.png-20840

న్యూఢిల్లీ: ఇప్కా ల్యాబొరేటరీస్‌ అమెరికాకు చెందిన ఫార్మా కంపెనీ బేషోర్‌ ఫార్మాస్యూటికల్స్‌ ఎల్‌ఎల్‌సీలో 80 శాతం వాటాను కొనుగోలు చేసింది. ఈ వాటాను అమెరికాలోని తమ అనుబంధ కంపెనీ ఇప్కా ఫార్మాస్యూటికల్స్‌ ఇన్‌కార్పొ  రూ.74.40 కోట్లకు (10.286 మిలియన్‌ డాలర్లకు) కొనుగోలు చేసిందని ఇప్కా ల్యాబొరేటరీస్‌ వెల్లడించింది. తమ జనరిక్స్‌ ఔషధాలను అమెరికాలో బేషోర్‌ ఫార్మా ద్వారా విక్రయిస్తామని పేర్కొంది. 2017, డిసెంబర్‌ 31తో ముగిసిన ఏడాది కాలానికి బేషోర్‌ ఫార్మా కంపెనీ 7.05 మిలియన్‌ డాలర్ల మొత్తం ఆదాయాన్ని ఆర్జించింది. 
 



You may be interested

స్మార్ట్‌ఫోన్‌ అమ్మకాల్లో ‘శాంసంగ్‌’ టాప్‌

Thursday 4th October 2018

న్యూఢిల్లీ: ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ విభాగ అమ్మకాల్లో దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ మొదటి స్థానంలో నిలిచింది. ప్రీమియం సెగ్మెంట్‌ ఆగస్టు విక్రయాల్లో ఈ సంస్థ విలువ పరంగా 60 శాతం మార్కెట్‌ వాటాను, సంఖ్య పరంగా 62.5 శాతం వాటాను సొంతం చేసుకున్నట్లు.. జర్మనీకి చెందిన మార్కెట్‌ పరిశోధన సంస్థ జీఎఫ్‌కే నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. మార్కెట్‌ వాటా ఆగస్టులో ఒక్కసారిగా పెరగడానికి ప్రధాన కారణం ‘శాంసంగ్‌ నోట్‌

విదేశాల్లో భారత్-22 ఈటీఎఫ్‌ లిస్టింగ్‌ !

Thursday 4th October 2018

న్యూఢిల్లీ: భారత్‌-22 ఈటీఎఫ్‌(ఎక్స్చేంజ్‌ ట్రేడేడ్‌ ఫండ్‌)ను ఏదైనా విదేశీ స్టాక్‌ ఎక్స్చేంజ్‌లో లిస్టింగ్‌ చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇలా చేయడం ద్వారా ఈ ఫండ్‌కు మరింత విలువ చేకూరుతుందని, విదేశీ నిధులను సమీకరించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే భారత్‌-22 ఈటీఎఫ్‌ ద్వారా రెండు అంచెల్లో రూ.22,900 కోట్లు సమీకరించింది.  విదేశీ మార్కెట్లో భారత్‌ -22 లిస్టింగ్‌ విషయమై ప్రాథమికంగా చర్చలు జరిగాయని ప్రభుత్వ ఉన్నతాధికారొకరు వెల్లడించారు. విదేశీ మార్కెట్లో

Most from this category