STOCKS

News


రూ. 150 కోట్ల డాలర్లు సమీకరించనున్న ఐఓసీ

Saturday 5th January 2019
news_main1546685414.png-23431

ముంబై: దేశీయ అతి పెద్ద ఆయిల్‌ మార్కెటింగ్‌, రిఫైనింగ్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐఓసీ) అంతర్జాతీయ బాండ్‌ మార్కెట్‌ నుంచి 150 కోట్ల డాలర్ల మేర నిధులు సమీకరించనుంది. ఈ కంపెనీ అమెరికా డాలర్‌ డినామినేషన్‌ నోట్ల ద్వారా 75 కోట్ల డాలర్ల నుంచి 150 కోట్ల డాలర్ల మేర నిధులు సమీకరించనున్నదని సంబంధిత వర్గాలు చెప్పాయి. ఈ బాండ్ల కాలపరిమితి వెల్లడి కాలేదు. అయితే ఈ బాండ్లకు మూడీస్‌ సంస్థ బీఏఏ2 రేటింగ్‌ను, ఫిచ్‌ రేటింగ్స్‌ సంస్థ ట్రిపుల్‌ బి మైనస్‌ రేటింగ్‌ను ఇచ్చాయి. వాటాదారుల రాబడులు, మూలధన పెట్టుబడులు అధికంగా ఉన్నా, ఫ్రీ క్యాష్‌ ఫ్లోస్‌ రుణాత్మకంగా ఉన్నప్పటికీ, ఐఓసీకి మంచి రేటింగే ఇచ్చామని మూడీస్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ వికాస్‌ హలన్‌ చెప్పారు. ఇటీవలే ఈ కంపెనీ రూ.12,300 కోట్ల షేర్ల బైబ్యాక్‌ను ప్రకటించిందని, నికర రుణాలను మరింతగా పెంచిందని ఆయన గుర్తు చేశారు. ఐఓసీకి ప్రభుత్వం నుంచి సబ్సిడీల రూపంలో తోడ్పాటు అందుతోందని ఫిచ్‌ రేటింగ్స్‌ సంస్థ పేర్కొంది. ఈ కంపెనీ రానున్న ఐదేళ్లలో ఏడాదికి సగటున రూ.25,000- 30,000 కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నదని, దీంతో ఈ కంపెనీ మార్జిన్లు మరింతగా మెరుగుపడుతాయని పేర్కొంది.



You may be interested

భారత ఫారెక్స్‌ నిల్వలు యట్‌ 393 బిలియన్‌ డాలర్లు

Saturday 5th January 2019

ముంబై: భారత్‌ విదేశీ మారకద్రవ్య నిల్వలు డిసెంబర్‌ 28తో ముగిసిన వారంలో 116.4 మిలియన్‌ డాలర్లు ఎగశాయి. దీనితో నిల్వలు మొత్తం విలువ 393.40 బిలియన్‌ డాలర్లకు చేరింది. విలువను డాలర్‌ రూపంలో పేర్కొనే విదేశీ కరెన్సీ (యూరో, పౌండ్‌, యన్‌ వంటివి) అసెట్స్‌ పెరగడం దీనికి ప్రధాన కారణమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ)  శుక్రవారం విడుదల చేసిన గణాంకాలు పేర్కొన్నాయి. 2018 ఏప్రిల్‌ 13న రికార్డు

రీడ్‌ అండ్‌ టేలర్‌ లిక్విడేషన్‌ నిలిపివేత

Saturday 5th January 2019

ముంబై: ఖరీదైన సూట్లు, జాకెట్లు విక్రయించే రీడ్‌ అండ్‌ టేలర్‌ కంపెనీ లిక్విడేషన్‌ను నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) నిలిపేసింది. రీడ్‌ అండ్‌ టేలర్‌ ఇండియా కంపెనీని నిర్వహిస్తామని, దానిని తమకు అప్పగించాలని ఉద్యోగుల సంఘం చేసిన అభ్యర్థనను ఎన్‌సీఎల్‌టీ ముంబై ధర్మాసనం మన్నించింది. దీనికి సంబంధించిన తదుపరి  విచారణను ఈ నెల 8కి వాయిదా వేసింది. ఈ కంపెనీ బకాయిలు రూ.4,100 కోట్ల మేర ఉన్నాయని, కానీ

Most from this category