STOCKS

News


ఐవోసీకి నిల్వల సెగ..

Thursday 31st January 2019
Markets_main1548907227.png-23911

  • క్యూ3లో లాభం 91 శాతం క్షీణత
  • రూ. 717 కోట్లకు డౌన్‌

న్యూఢిల్లీ: చమురు రేట్లు క్షీణించడం, అధిక ధరలకు ఖరీదు చేసిన ఇంధన నిల్వల విలువ పడిపోవడం తదితర కారణాలు ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ (ఐవోసీ) ఆర్థిక పనితీరుపై ప్రతికూల ప్రభావం చూపాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో సంస్థ లాభం ఏకంగా 91 శాతం క్షీణించి రూ. 717 కోట్లకు పడిపోయింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో లాభం రూ. 7,883 కోట్లు. మరోవైపు టర్నోవరు రూ. 1.32 లక్షల కోట్ల నుంచి రూ. 1.6 లక్షల కోట్లకు చేరింది. నాలుగేళ్ల గరిష్ట స్థాయి నుంచి చమురు ధరలు క్షీణించడంతో.. అప్పటికే నిల్వ చేసి పెట్టుకున్న ఇంధన విలువ గణనీయంగా పడిపోయిందని, ఇది ఆర్థిక ఫలితాలపై ప్రతికూల ప్రభావం చూపిందని ఐవోసీ పేర్కొంది. ఇక దేశీయంగా ఇంధన అమ్మకాలు 3 శాతం పెరిగి 21.5 మిలియన్ టన్నులకు చేరాయని వివరించింది.



You may be interested

ప్రభుత్వం వైపు చూస్తున్న బ్యాంకింగ్‌ పరిశ్రమ

Thursday 31st January 2019

బడ్జెట్‌లో అధిక నిధులపై పీఎస్‌బీల ఆశ- బ్యాంకు ఖాతాలపై జీఎస్టీ హేతుబద్ధీకరణ దేశవ్యాప్తంగా ఒకే స్టాంప్‌ డ్యూటీ 80సీ కింద డిపాజిట్‌ కాల వ్యవధి తగ్గించాలి- వడ్డీ ఆదాయంపై టీడీఎస్‌ మినహాయింపును రూ.30వేలు చేయాలి- బడ్జెట్‌ఫై బ్యాంకింగ్‌ రంగం ఆకాంక్షలు న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన బ్యాంకింగ్‌ రంగం... వచ్చే బడ్జెట్‌పై భారీ ఆశలు కాకపోయినా కనీసం కొన్ని కీలకమైన చర్యలు అయినా ఉంటాయని ఆశిస్తోంది. భారీ ఎన్‌పీఏలు, ఎన్‌పీఏ కేసుల దివాలా

గ్యాప్‌అప్‌ ఓపెనింగ్‌

Thursday 31st January 2019

సెన్సెక్స్‌ 250 పాయింట్లు, నిఫ్టీ 50 పాయింట్లు అప్‌ అమెరికా కేంద్ర బ్యాంక్‌ ఫెడరల్‌ రిజర్వ్‌ వడ్డీ రేట్ల పెంపుపై వెనకడుగువేసిన కారణంగా ప్రపంచ మార్కెట్లు సానుకూలంగా ట్రేడవుతున్న నేపథ్యంలో గురువారం స్టాక్‌ సూచీలు గ్యాప్‌అప్‌తో ప్రారంభమయ్యాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 250 పాయింట్ల జంప్‌చేసి 35,840 పాయింట్ల వద్ద ప్రారంభంకాగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 56 పాయింట్ల లాభంతో 10,708 పాయింట్ల వద్ద మొదలయ్యింది. ఐసీఐసీఐ బ్యాంక్‌, ఎస్‌బీఐ, టాటా స్టీల్‌, టెక్‌

Most from this category