STOCKS

News


12శాతం తగ్గిన ఐఓసీ లాభం

Saturday 3rd November 2018
Markets_main1541230455.png-21682

  • రూ.3,246 కోట్లకు పరిమితం
  •  కరెన్సీ మారక నష్టాలు, రిఫైనరీ మార్జిన్ల తగ్గుదల

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ చమురు మార్కెటింగ్‌ కంపెనీ ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (ఐవోసీ) సెప్టెంబర్‌తో ముగిసిన మూడు నెలల కాలంలో రూ.3,246 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో వచ్చిన రూ.3,696 కోట్లతో పోలిస్తే 12.6 శాతం తగ్గిపోయింది. విదేశీ మారక నష్టాలు, చమురు రిఫైనరీ మార్జిన్లు తగ్గుదల నికర లాభానికి చిల్లు పెట్టాయి. షేరు వారీ ఆర్జన రూ.3.90గా ఉంది. అమ్మకాలపై ఆదాయం ఏకంగా 48 శాతం పెరిగి రూ.1,32,357 కోట్లకు చేరుకుంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.89,499 కోట్లుగా ఉంది.
ఫారెక్స్‌ నష్టాలు రూ.2,600 కోట్లు
రూపాయి విలువ పడిపోవడం వల్ల ఈ త్రైమాసికంలో తాము రూ.2,600 కోట్లను విదేశీ ఎక్సేంజ్‌ రూపంలో నష్టపోయినట్టు ఐవోసీ చైర్మన్‌ సంజీవ్‌ సింగ్‌ మీడియాకు తెలిపారు. చమురు ధరలు పెరగడం, రుణాలను తిరిగి చెల్లించడం కూడా దీనికి తోడయ్యాయని చెప్పారు. విదేశీ ఎక్సేంజ్‌ నష్టం అన్నది... ఓ కంపెనీ తాను ఒక డాలర్‌ను రుణంగా తీసుకున్నప్పుడు రూపాయి మారకం విలువ రూ.70 ఉందనుకుంటే, తిరిగి చెల్లించే సమయానికి అంతకంటే దిగజారితే అధికంగా చెల్లించడం వల్ల ఎదురయ్యే నష్టం. అలాగే, ముడి చమురును కొనుగోలు చేసి, ఆ తర్వాత 15-30 రోజులకు చెల్లింపులు చేసే సమయానికి కరెన్సీ విలువ దిగజారినీ గానీ నష్టం ఎదురవుతుంది.
రిఫైనరీ మార్జిన్‌ 6.79 డాలర్లు
ప్రతీ బ్యారెల్‌ ముడి చమురు శుద్ధి చేసి ఇంధనంగా మార్చడంపై 6.79 డాలర్ల మార్జిన్‌ను కంపెనీ సెప్టెంబర్‌ కార్టర్లో ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఈ మార్జిన్‌ 7.98 డాలర్లుగా ఉంది. ఇన్వెంటరీ రూపంలో రూ.4,408 కోట్ల లాభం రావడంతో ఫారెక్స్‌ నష్టాలను కంపెనీ అధిగమించగలిగింది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఇన్వెంటరీ లాభాలు కేవలం రూ.1,056 కోట్లుగానే ఉన్నాయి. ఇన్వెంటరీ లాభాలు అంటే... ముడి చమురును కొన్న ధర నుంచి... దాన్ని ఇంధనంగా మార్చి విక్రయించే ధర ఎక్కువ ఉంటే వచ్చే లాభం. అయితే, క్వార్టర్‌ వారీగా (క్రితం క్వార్టర్‌తో) చూసుకుంటే ఇన్వెంటరీ లాభాలు 44 శాతం తగ్గడం గమనార్హం. క్యూ2లో బ్రెంట్‌ క్రూడ్‌ సగటున 75.89 డాలర్లుగా ఉంది. క్రితం క్వార్టర్‌తో పోలిస్తే ఒక శాతం ఎక్కువ.
ఆరు నెలల్లో రూ.10,078 కోట్లు
ఇక ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్‌ నుంచి సెప్టెంబర్‌ వరకు అర్ధ సంవత్సరంలో చూసుకుంటే ఐవోసీ నికర లాభం రూ.10,078 కోట్లు, ఆదాయం రూ.3,01,313 కోట్లుగా ఉన్నాయి. స్థూల రిఫైనరీ మార్జిన్‌ 8.45 డాలర్లు కాగా, క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.08 డాలర్లే. ఉద్యోగులకు సంబంధించి చేసిన ఏకీకృత చెల్లింపులతో ఉద్యోగులపై వ్యయాలు 56 శాతం పెరిగి రూ.3,706 కోట్లకు చేరినట్టు కంపెనీ తెలిపింది.


IOC

You may be interested

83శాతం తగ్గిన యాక్సిస్‌ లాభం

Saturday 3rd November 2018

మెరుగుపడిన రుణ నాణ్యత తగ్గిన కేటాయింపులు న్యూఢిల్లీ: ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్‌ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 83 శాతం పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.432 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.790 కోట్లకు పెరిగిందని యాక్సిస్‌ బ్యాంక్‌ తెలిపింది. వడ్డీ ఆదాయం అధికంగా ఉండటం, రుణ నాణ్యత మెరుగుపడటంతో మొండి బకాయిలకు కేటాయింపులు తగ్గాయని, దీంతో

సెయిల్‌కు రూ.554 ​కోట్ల లాభం

Saturday 3rd November 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగంలోని స్టీల్‌ కంపెనీ సెయిల్‌ సెప్టెంబర్‌ క్వార్టర్‌కు రూ.553.69 కోట్ల స్టాండలోన్‌ లాభాన్ని ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే కాలంలో రూ.539 కోట్ల నష్టంతో పోలిస్తే మంచి పనితీరు చూపించింది. ఆదాయం క్రితం ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.13,666 కోట్లతో పోలిస్తే 23 శాతం పెరిగి రూ.16,832 కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయాలు సైతం రూ.15,950 కోట్లకు పెరిగాయి. ఎబిట్డా 156 శాతం వృద్ధితో రూ.2,473 కోట్లుగా

Most from this category