STOCKS

News


ఐవోసీ లాభం 50 శాతం అప్‌

Monday 13th August 2018
news_main1534136526.png-19203

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద ఆయిల్‌ మార్కెటింగ్‌ సంస్థ ఐవోసీ జూన్‌ త్రైమాసికంలో 50 శాతం అధికంగా లాభాన్ని ఆర్జించింది. కన్సాలిడేటెడ్‌ నికర లాభం రూ.6,831 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.4,549 కోట్లుగా ఉంది. ఇన్వెంటరీ లాభాలు (దిగుమతి చేసుకున్న ముడి చమురు, విక్రయానికి వచ్చే సరికి రేట్ల పెరుగుదలతో కలిగే ప్రయోజనం) రూ.7,866 కోట్లుగా ఉండడమే ఈ స్థాయి పనితీరుకు దోహదపడింది. రిఫైనరీ మార్జిన్లు తక్కువగా ఉండడం, కరెన్సీ మారకం నష్టాలు ఉన్నప్పటికీ ఇన్వెంటరీ లాభాల కారణంగా ఐవోసీ అధిక లాభాలను నమోదు చేయగలిగింది. ఆదాయం రూ.1,49,747 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది ఇదే కాలంలో ఆదాయం రూ.1,28,183 కోట్లు కావడం గమనార్హం. ప్రతీ బ్యారెల్‌ ముడి చమురును, ఇంధనంగా మార్చినందుకు 10.21 డాలర్లను ఆర్జించింది. ఇన్వెంటరీ లాభాలను తీసేసి చూస్తే ప్రతీ బ్యారెల్‌పై రిఫైనింగ్‌ మార్జిన్‌ 5.18 డాలర్లుగా ఉండగా, క్రితం ఏడాది ఇదే కాలంలో ఇది 6.44 డాలర్లు కావడం గమనార్హం. జూన్‌ నాటికి కంపెనీ రుణ భారం రూ.44,797 కోట్లుగా ఉంది. 


IOC

You may be interested

రాఫెల్‌ కాంట్రాక్టు రక్షణ శాఖ ఇవ్వలేదు

Monday 13th August 2018

న్యూఢిల్లీ: రాఫెల్‌ యుద్ధ విమానాల సరఫరా కాంట్రాక్టు విషయంలో అనిల్‌ అంబానీ గ్రూపు పాత్రపై రాజకీయ దుమారం రేగిన నేపథ్యంలో... దీనిపై అనిల్‌ అంబానీ గ్రూపు వివరణ ఇచ్చింది. రక్షణ శాఖ నుంచి ఎటువంటి కాంట్రాక్టు తమకు రాలేదని, ఇది తప్పు అని, ప్రజలను తప్పుదోవ పట్టించే ఆరోపణలుగా పేర్కొంది. 36 యుద్ధ విమానాలను సరఫరా చేయాల్సిన ఫ్రెంచ్‌ సంస్థ దసాల్ట్‌ గ్రూపు, ఒప్పందం మేరకు విమానాల సరఫరాకు రిలయన్స్‌

19 బిలియన్ డాలర్లకు ఫార్మా ఎగుమతులు

Monday 13th August 2018

హైదరాబాద్‌: కీలకమైన ఉత్తర అమెరికా మార్కెట్లో ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఫార్మా ఎగుమతులు 19 -20 బిలియన్ డాలర్ల స్థాయిని దాటవచ్చని ఫార్మా ఎగుమతి ప్రోత్సాహక మండలి (ఫార్మాక్సిల్) అంచనా వేస్తోంది. గత ఆర్థిక సంవత్సరం ఫార్మా ఎగుమతులు 2.92 శాతం వృద్ధితో 17.27 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఫార్మాక్సిల్ డైరెక్టర్ జనరల్ ఉదయ్ భాస్కర్ ఈ విషయాలు వెల్లడించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి

Most from this category