News


భారీ విస్తరణ దిశగా ఐవోసీ అడుగులు

Thursday 13th September 2018
news_main1536777995.png-20207

ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీ ఐవోసీ తన ఫ్యూయల్‌ రిటైల్‌ అవుట్‌లెట్ల సంఖ్యను రానున్న మూడేళ్లలో రెట్టింపు చేయాలన్న లక్ష్యాన్ని నిర్ధేశించుకుంది. ప్రస్తుతం 27,000 ఉండగా, మూడేళ్లలో 52,000 పెంచాలనుకుంటోంది. దేశంలో అత్యధిక రిటైల్‌ ఫ్యూయల్‌ స్టేషన్లు ఐవోసీకే ఉన్నాయి. ప్రైవేటు సంస్థలు ఈ విభాగంలోకి ప్రవేశించినప్పటికీ 44 శాతం వాటా ఈ సంస్థ చేతుల్లోనే ఉంది. ‘‘ఐవోసీ రిటైల్‌ విభాగంలోనూ ఇన్వెస్ట్‌ చేయనుంది. రానున్న కొన్ని సంవత్సరాల్లో కొత్తగా 50,000 నూతన ఫ్యూయల్‌ స్టేషన్లు, ఎల్‌పీజీ డీలర్‌షిప్‌లు రానున్నాయి. ఇంధనేతర వ్యాపారాల ద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జించే అవకాశాలను చమురు మార్కెటింగ్‌ కంపెనీలు పరిశీలించడం మంచి ఆలోచన అవుతుంది’’అని ఐవోసీ చైర్మన్‌ సంజీవ్‌సింగ్‌ తెలిపారు. 

 

ప్రభుత్వ రంగంలో మూడు ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు ఉమ్మడిగా వచ్చే మూడేళ్లలో 50,000 నూతన ఫ్యూయల్‌ రిటైల్‌ అవుట్‌లెట్లను ప్రారంభించనుండగా, ఇందులో 25,000 ఐవోసీ నుంచే ఉంటాయని కంపెనీ అధికారులు తెలిపారు. మిగిలినవి బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌ ఆధ్వర్యంలో రానున్నాయి. ‘‘కంపెనీ రిఫైనింగ్‌ సామర్థ్యాన్ని వార్షికంగా 140 మిలియన్‌ టన్నులకు 2030 నాటికి చేర్చనున్నాం. చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ వద్ద విస్తరణ చేపట్టడంతోపాటు, నాగపట్టణంలో 9 మిలియన్‌ టన్నుల వార్షిక సామర్థ్యంతో ప్లాంట్‌ ఏర్పాటు చేయనున్నాం’’అని సింగ్‌ తమ విస్తరణ ప్రణాళికలను వివరించారు. రానున్న ఐదేళ్లలో గ్యాస్‌ డిస్ట్రిబ్యూషన్‌ విభాగంపై రూ.20,000 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనున్నట్టు చెప్పారు. ఐవోసీ అధిక శాతం చమురును ఇరాన్‌ నుంచి సమకూర్చుకుంటోంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా నడుచుకోనున్నట్టు సింగ్‌ చెప్పారు. నిబంధనలు, షరతలు పరంగా ఇరాన్‌ దిగుమతులు అనకూలంగా ఉంటాయని, అయితే ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా అది మంచిదేనన్నారు.You may be interested

200డీఎంఏకు దిగువన 344 స్టాక్స్‌

Thursday 13th September 2018

మార్కెట్‌ కరెక్షన్లలో చాలా స్టాక్స్‌ ధరలు కనిష్ట స్థాయిలకు దిగి వస్తుంటాయి. ఈ క్రమంలో అవి 200 రోజుల చలన సగటు (డీఎంఏ)ను కోల్పోవడం సాంకేతికంగా కీలకమైనదిగా అనలిస్టులు పరిగణిస్తుంటారు. మరి ఇలా చూసినప్పుడు నిఫ్టీ-50 బాస్కెట్‌లోనే 20 స్టాక్స్‌ 200డీఏంఏకు కిందకు వెళ్లిపోయాయి. వాటిలో అదానీ పోర్ట్స్‌, బజాజ్‌ ఆటో, బీపీసీఎల్‌, ఐవోసీ, హెచ్‌పీసీఎల్‌, మారుతి సుజుకి, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, వేదాంత, భారతీ ఎయిర్‌టెల్‌, భారతీ ఇన్‌ఫ్రాటెల్‌,

‘ఐఎల్‌ఎఫ్‌ఎస్‌’ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసిన ఎంఎఫ్‌ ఫథకాలు

Thursday 13th September 2018

ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు సంస్థల డెట్‌ సెక్యూరిటీల రేటింగ్‌లను రేటింగ్‌ ఏజెన్సీలు తగ్గించడం... ఈ కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేసిన మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాల రాబడులను దెబ్బతీసే ప్రమాదం ఏర్పడింది. దీంతో డెట్‌ మ్యూచువల్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసేవారు తమ పథకాలు ఐఎల్‌ఎఫ్‌ఎస్‌ గ్రూపు కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో పెట్టుబడులు పెట్టాయా, లేదా అన్నది తెలుసుకోవడం అవసరం. మ్యూచువల్‌ ఫండ్స్‌ సంస్థలు కార్పొరేట్‌ కంపెనీల డెట్‌ సెక్యూరిటీల్లో ఇన్వెస్ట్‌ చేయడం

Most from this category