STOCKS

News


పీఎస్‌బీలకు దూరం దూరం!

Wednesday 19th September 2018
news_main1537350816.png-20391

దీపన్‌ మెహతా సలహా
ఎన్‌పీఏలకు సంబంధించి స్పష్టమైన పరిష్కారం కనుచూపుమేరలో కనిపించనంత వరకు పీఎస్‌యూ బ్యాంకు షేర్లకు దూరంగా ఉండడం మంచిదని ప్రముఖ మార్కెట్‌ విశ్లేషకుడు దీపన్‌ మెహతా సలహా ఇచ్చారు. ఇబ్బందుల్లో ఉన్న బ్యాంకులను బలమైన బ్యాంకులతో విలీనం చేయడంపై ఇప్పుడేమీ వ్యాఖ్యానించలేమన్నారు. అయితే ఇలాంటి విలీనాలు మంచి బ్యాంకులపై ఎంతోకొంత భారం మోపుతాయన్నారు. బలహీన బ్యాంకులకు మూలధన సాయం చేయకుండా ఉండేందుకే ప్రభుత్వం విలీనాలను తీసుకువస్తోందని అభిప్రాయపడ్డారు. దీర్ఘకాలంలో ఇలాంటి విలీనాలు పోటీతత్వాన్ని పెంచుతాయన్నారు. అయితే తక్షణం మాత్రం చాలా అనిశ్చితి ఉంటుందని చెప్పారు. పీఎస్‌యూ బ్యాంకు షేర్లలో పెట్టుబడి ఇన్వెస్టర్లకు మంచిది కాదని, కానీ ట్రేడర్లు మాత్రం అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చని సలహా ఇచ్చారు. దీర్ఘకాలానికి ఎన్‌పీఏ సమస్య తొలిగిపోతేనే ఇన్వెస్టర్లు పీఎస్‌బీలను పరిశీలించాలని సలహా ఇచ్చారు. 
రూపీ బలపడితేనే!
రూపాయి క్షీణత, క్రూడాయిల్‌ ధర పెరుగుదలతో మార్కెట్లు భారీగా పతనమవుతున్నాయని, ఈ నేపథ్యంలో రూపాయి కనీసం కొన్ని వారాలు స్థిరత్వం చూపితేనే సూచీల్లో బాటమ్‌ అవుట్‌ వస్తుందని దీపన్‌ అభిప్రాయపడ్డారు. రూపీ పతనం కొనసాగినకొద్దీ ఇన్వెస్టర్లు కొత్త కొనుగోళ్లకు దూరంగానే ఉంటారన్నారు. కాదంటే బడా బ్లూచిప్‌కంపెనీల్లో ఆకర్షణీయ వాల్యూషన్ల వద్ద ఉన్న కౌంటర్లలో కొంత మేర కొనుగోళ్లు ఉండొచ్చన్నారు. రిటైలర్లు మార్కెట్‌పై నమ్మకం ఉంచాలంటే రూపీ బలపడడం అత్యావశ్యకమన్నారు. దీంతో పాటు ప్రభుత్వ సెక్యూరిటీలు సైతం స్థిరపడాలని చెప్పారు. దీర్ఘకాలానికి ఎన్‌బీఎఫ్‌సీలు, ప్రైవేట్‌ బ్యాంకుల షేర్లను పరిశీలించవచ్చని సలహా ఇచ్చారు. చిన్న ఇన్వెస్టర్లు మార్కెట్లో ప్రవేశించేందుకు మరికొంత కాలం వేచిఉండాలని సూచించారు. 



You may be interested

రెండున్నర నెలల కనిష్టస్థాయికి సూచీలు

Wednesday 19th September 2018

ట్రేడింగ్‌ ఆద్యంతం ఒడిదుడుకుడుల నడుమ సాగిన సూచీలు... చివరి గంటలో వెల్లువెత్తిన అమ్మకాలతో మూడోరోజూ నష్టాలతో ముగిశాయి. ఫలితంగా బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 169 పాయింట్ల నష్టపోయి 37,121 వద్ద, నిఫ్టీ 44 పాయింట్ల నష్టపోయి 11,234 వద్ద ముగిశాయి. ఇంట్రాడేలో ట్రేడింగ్‌లో ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌, ఆర్థిక, అటో రంగాలకు చెందిన షేర్లు తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కోన్నాయి. ఎన్‌ఎస్‌ఈలో ఐటీ, మెటల్‌ రంగ సూచీలు తప్ప, అన్ని రంగాలకు చెందిన

అమ్మకాల ఒత్తిడిలో అడాగ్‌ షేర్లు..!

Wednesday 19th September 2018

ముంబై:- ఆటుపోట్ల మధ్య సాగుతున్న మార్కెట్‌లో అనిల్‌ అంబానీ ధీరూభాయ్‌ గ్రూప్‌(అడాగ్‌) షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. కంపెనీ 14వ వార్షిక సమావేశం మంగళవారం జరిగింది. ఏజీఎం సమావేశంలో సం‍స్థ అధినేత అనీల్‌ అంబానీ కొన్ని కీలక నిర్ణయాలు వెల్లడించారు. ప్రకటించిన నిర్ణయాలు మార్కెట్‌ వర్గాలను మెప్పించకపోవడంతో ఇన్వెస్టర్లు అడాగ్‌ గ్రూప్‌ షేర్ల అమ్మకాలు పూనుకున్నారు. ఫలితంగా ఆ కంపెనీ ప్రధాన షేర్లైన  రిలయన్స్‌ ఇన్ఫ్రా, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్‌, రిలయన్స్‌

Most from this category