STOCKS

News


వైద్య వ్యయాల తగ్గింపై కేంద్రం దృష్టి

Tuesday 22nd January 2019
Markets_main1548131031.png-23721

- కొన్ని వైద్య పరికరాలపై కస్టమ్స్‌ సుంకం కోత?
- బడ్జెట్‌ ప్రతిపాదనలకు కేంద్రం కసరత్తు

న్యూఢిల్లీ: రోగులకు వైద్య వ్యయాల తగ్గింపు లక్ష్యంగా రానున్న వార్షిక బడ్జెట్‌పై కసరత్తు జరుగుతోందని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. కొన్ని వైద్య పరికరాలపై దిగుమతి సుంకాల తగ్గింపును కేంద్రం పరిశీలిస్తోందని ఆ వర్గాలు వెల్లడించాయి. ముక్కుకు సంబంధించి ఆపరేషన్‌లో వినియోగించే పీడీఎస్‌ ప్లేట్స్‌పై కస్టమ్స్‌ సుంకాన్ని ప్రస్తుత 10 శాతం నుంచి 2.5 శాతానికి తగ్గించాలని ఇండస్ట్రీ చాంబర్‌ సీఐఐ తన బడ్జెట్‌ ముందస్తు మెమోరాండంలో ప్రభుత్వాన్ని కోరింది. వెన్నుముక పరికరాలు, జాయింట్‌ రిప్లేస్‌మెంట్‌ పరికరాలపై కస్టమ్స్‌ సుంకాన్ని తగ్గించాలని కూడా సీఐఐ కేంద్రాన్ని కోరింది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌ను ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఇది ఓట్‌-ఆన్‌-అకౌంట్‌ బడ్జెట్‌గా ఉంటుందని ప్రభుత్వం ఇప్పటికే పేర్కొంది.
ఇప్పటికే పలు చర్యలు..
దేశంలో వైద్య పరికరాల తయారీకి ఊపునివ్వడం, ఈ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ఆకర్షణ, వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ రంగంలో ఎగుమతులకు ప్రోత్సాహం వంటి లక్ష్యాల సాధనకు కేంద్రం ఇటీవల నేషనల్‌ మెడికల్‌ డివైజెస్‌ ప్రమోషన్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఎండీపీసీ)ను నెలకొల్పింది. ఫార్మా రంగం విషయంలో భారత్‌ ప్రపంచ దేశాల్లో ఒక ప్రత్యేక గుర్తింపు పొందింది. అయితే వైద్య పరికరాల పరిశ్రమ విషయంలో మాత్రం అంత పురోగతి సాధించలేదు. ఈ అంశంపైనా దృష్టి పెట్టిన కేంద్రం,  ఈ విభాగంలో ఎటువంటి ప్రభుత్వ అనుమతులూ లేకుండా 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఇప్పటికే అనుమతి ఇచ్చింది.



You may be interested

ఆవిష్కరణలకు మారుతి సుజుకి ప్రోత్సాహం

Tuesday 22nd January 2019

న్యూఢిల్లీ: ఆటోమొబైల్‌, రవాణాలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు మారుతి సుజుకి ఇండియా ముందుకు వచ్చింది. మొబిలిటీ అండ్‌ ఆటోమొబైల్‌ ఇన్నోవేషన్‌ ల్యాబ్‌ (ఎంఏఐఎల్‌) కార్యక్రమం కింద... భవిష్యత్తు కాలానికి, కస్టమర్ల అవసరాలకు అనుగుణమైన నవ్యత, కటింగ్‌ ఎడ్జ్‌ సొల్యూషన్లను గుర్తించనున్నట్టు కంపెనీ తెలిపింది. ఆటోమొబైల్‌, రవాణా రంగానికి సంబంధించి తమ ప్రతిభను జాతీయ స్థాయిలో నిరూపించుకునేందుకు తమ కార్యక్రమం వేదికగా ఉపయోగపడుతుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ‘‘ఎంఏఐఎల్‌ ద్వారా స్టార్టప్‌లు

పుంజుకోనున్న భారత్‌ ఆర్థిక వ్యవస్థ!

Tuesday 22nd January 2019

- 2019, 2020పై ఐఎంఎఫ్‌ నివేదిక - ద్రవ్యలోటుపై మాత్రం తీవ్ర ఆందోళన - తగ్గనున్న ప్రపంచ ఆర్థిక వృద్ధి రేటు - అవుట్‌లుక్‌ను విడుదల చేసిన ఆర్థికవేత్త గీతా గోపీనాథ్‌ న్యూఢిల్లీ/వాషింగ్టన్‌: భారత్‌ ఆర్థిక వ్యవస్థ 2019, 2020లో ఊపందుకోనున్నదని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) పేర్కొంది. ఈ రెండు సంవత్సరాల్లో వరుసగా 7.5 శాతం, 7.7 శాతం వృద్ధి నమోదవుతుందని విశ్లేషించింది. అంతకుముందు అంచనాలకన్నా ఇది 10 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు

Most from this category