STOCKS

News


జీపీఎఫ్‌ వడ్డీరేటు 0.4 శాతం పెంపు

Wednesday 17th October 2018
news_main1539749783.png-21217

న్యూఢిల్లీ: జనరల్‌ ప్రావిడెండ్‌ ఫండ్‌ (జీపీఎఫ్‌), సంబంధిత ఇతర స్కీమ్‌ల వడ్డీరేటును అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికానికి సంబంధించి ప్రభుత్వం 40 బేసిస్‌ పాయింట్లు (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) పెంచింది. పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌) రేటుకు అనుగుణంగా ఈ రేట్లలో మార్పు చేసినట్లు ఆర్థిక వ్యవహారాల శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.  ఈ పెంపు నిర్ణయంతో జీపీఎఫ్‌పై వడ్డీరేటు 7.6 శాతం (జూలై-సెప్టెంబర్‌ త్రైమాసికంలో) నుంచి 8 శాతానికి ఎగసింది. ప్రావిడెంట్‌ ఫండ్స్‌పై వడ్డీరేటు పెంపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రైల్వేలు, డిఫెన్స్‌ దళాలకు వర్తిస్తుంది. అక్టోబర్‌-డిసెంబర్‌ త్రైమాసికానికి ఎన్‌ఎస్‌సీ, పీపీఎఫ్‌సహా పొదుపు పథకాలపై వడ్డీరేటును గత నెల్లో ప్రభుత్వం 0.4 శాతం పెంచిన సంగతి తెలిసిందే. బ్యాంకుల్లో పెరిగిన డిపాజిట్‌ రేట్లకు అనుగుణంగా ఈ రేట్లు పెరిగాయి. You may be interested

తొమ్మిదేళ్ల కనిష్టానికి పీనోట్స్‌ పెట్టుబడులు

Wednesday 17th October 2018

న్యూఢిల్లీ: మన క్యాపిటల్‌ మార్కెట్లలో పార్టిసిపేటరీ నోట్స్‌ (పీ నోట్స్‌)  పెట్టుబడులు తొమ్మిదిన్నరేళ్ల కనిష్ట స్థాయికి తగ్గాయి. సెప్టెంబర్‌ చివరికి రూ.79,548 కోట్లుగా ఉన్నాయి. పీ నోట్స్‌ను సెబీ వద్ద నమోదు చేసుకున్న విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు జారీ చేస్తుంటారు. తమ పేర్లను నేరుగా నమోదు చేసుకోకుండా మన మార్కెట్లలో పెట్టుబడి పెట్టాలనుకునే విదేశీ ఇన్వెస్టర్లు వీటిని తీసుకుంటుంటారు. సెబీ గణాంకాల ప్రకారం మన మార్కెట్లలో ఈక్విటీ, డెట్‌, డెరివేటివ్స్‌లో

రెండు వారాల గరిష్టంలో రూపీ

Wednesday 17th October 2018

ఇండియన్‌ రూపాయి బుధవారం రెండు వారాల గరిష్ట స్థాయిని తాకింది. ఉదయం 9:10 సమయంలో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 73.42 వద్ద ట్రేడవుతోంది. రూపాయి తన మంగళవారం ముగింపు 73.47తో పోలిస్తే 0.1 శాతం లాభపడింది. రూపాయి బుధవారం 73.34 వద్ద ప్రారంభమైంది.   భారత్‌లో పదేళ్ల బాండ్‌ ఈల్డ్స్‌ 7.885 శాతంగా ఉన్నాయి. బాండ్‌ ఈల్డ్స్‌ మునపటి ముగింపు 7.873 శాతంగా ఉంది. బాండ్‌ ఈల్డ్స్‌, రూపాయి విలువ

Most from this category