News


ఎంఎస్‌ఎంఈలకు ఇన్‌స్టామోజో రుణాలు

Friday 28th September 2018
news_main1538109249.png-20660

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో:
డిజిటల్‌ పేమెంట్స్‌ కంపెనీ ఇన్‌స్టామోజో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా కంపెనీలకు తక్షణ రుణాలను అందజేసేందుకు మోజో క్యాపిటల్‌ సేవలను ప్రారంభించింది. కంపెనీ కస్టమర్లకు రూ.2 లక్షల వరకు రుణం మంజూరు చేస్తారు. మూడు రోజుల్లో ఈ మొత్తాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుందని ఇన్‌స్టామోజో కో-ఫౌండర్‌ ఆకాశ్‌ గెహానీ  గురువారమిక్కడ మీడియాకు తెలిపారు. ‘24 గంటల్లో కస్టమర్‌ ఎప్పుడు కోరినా క్షణాల్లో లోన్‌ వారి ఖాతాలో చేరుతుంది. వడ్డీ కస్టమర్‌నుబట్టి, తీసుకున్న రుణం ఆధారంగా 24 శాతం వరకు ఉంటుంది. ఇప్పటి వరకు 2.5 లక్షల మంది కస్టమర్లు రుణాలను అందుకున్నారు. మొత్తం రూ.40 కోట్లు జారీ చేశాం. ఆరు బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీలతో మాకు భాగస్వామ్యం ఉంది. మరిన్ని సంస్థలతో చేతులు కలుపుతాం. ఇన్‌స్టామోజోకు 200 నగరాల్లో 5 లక్షల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు’ అని వివరించారు. సంస్థ వినియోగదారులకు రోజువారీ లాజిస్టిక్స్‌, డెలివరీ సేవల కోసం మోజో ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులను సైతం పరిచయం చేసింది. కంపెనీలో 100 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.

 You may be interested

ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ షేర్‌హోల్డర్లతో ఆర్‌బీఐ సమావేశం రద్దు

Friday 28th September 2018

ముంబై: ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్‌ అండ్ ఫైనాన్స్‌ సర్వీసెస్ (ఐఎల్‌అ౾ండ్‌ఎఫ్‌ఎస్‌) షేర్‌హోల్డర్లతో శుక్రవారం జరగాల్సిన సమావేశాన్ని రిజర్వ్ బ్యాంక్ రద్దయ్యింది. "శుక్రవారం జరగాల్సిన సమావేశం రద్దయ్యింది. ఒక నియంత్రణ సంస్థగా ఆ కంపెనీ భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఏంటన్నది ఆర్‌బీఐ తెలుసుకోవాలనుకుంటోంది. భవిష్యత్ ప్రణాళిక, తీసుకోబోయే దిద్దుబాటు చర్యల వివరాలు ఆర్‌బీఐకి కావాలి" అని సంబంధిత వర్గాలు తెలిపాయి. తదుపరి సమావేశం తేదీ ఇంకా ఖరారు కాలేదని

దివాల కేసుల పరిష్కారానికి 8 ప్రత్యేక కోర్టులు

Friday 28th September 2018

న్యూఢిల్లీ: దివాలా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వీటి సత్వర పరిష్కారానికి గాను జాతీయ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) పరిధిలో 8 ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలని కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ ప్రతిపాదించింది. హైదరాబాద్‌, ముంబై, ఢిల్లీ, చెన్నై, కోల్‌కతాలో వీటిని ఏర్పాటు చేయాలన్నది ప్రణాళిక. దేశవ్యాప్తంగా ఎన్‌సీఎల్‌టీకి 11 బెంచ్‌లు ఉన్నప్పటికీ కేసుల భారం పెరిగిపోవడంతో, దీన్ని తగ్గించేందుకే ఈ ప్రతిపాదన చేసినట్టు కార్పొరేట్‌ వ్యవహారాల శాఖ

Most from this category