STOCKS

News


ఐనాక్స్‌ లీజర్‌ మొత్తం ఆదాయం రూ.369 కోట్లు

Tuesday 23rd October 2018
news_main1540270338.png-21383

న్యూఢిల్లీ: మల్టీప్లెక్స్‌ల నిర్వహణ కంపెనీ ఐనాక్స్‌ లీజర్‌ మొత్తం ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.369 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.314 కోట్ల మొత్తం ఆదాయం వచ్చిందని, 17 శాతం వృద్ధి సాధించామని ఐనాక్స్‌ లీజర్‌ తెలిపింది. నికర లాభం రూ.11.68 కోట్ల నంచి 2 శాతం వృద్ధితో రూ.11.97 కోట్లకు పెరిగిందని పేర్కొంది. మొత్తం వ్యయాలు రూ.296 కోట్ల నుంచి 18 శాతం పెరిగి రూ.351 కోట్లకు పెరిగాయని వివరించింది. ప్రస్తుతానికి మొత్తం 19 రాష్ట్రాల్లో 66 నగరాల్లో 536 స్క్రీన్లను నిర్వహిస్తున్నామని తెలిపింది. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐనాక్స్‌ లీజర్‌ షేర​ 6.2 శాతం పతనమై రూ.217 వద్ద ముగిసింది. 


 



You may be interested

సీమాంతర దివాలా కేసులకు 'ఐరాస' తరహా చట్టాలు

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: సీమాంతర దివాలా కేసుల పరిష్కారం కోసం ఐక్యరాజ్య సమితిలో భాగమైన యూఎన్‌సిఐటీఆర్‌ఏఎల్‌ తరహా చట్టాలను అమల్లోకి తేవచ్చని కేంద్రానికి అత్యున్నత స్థాయి కమిటీ సిఫార్సు చేసింది. తద్వారా అభివృద్ధి చెందిన దేశాల ప్రమాణాలకు తగ్గ స్థాయిలో దేశీ దివాలా చట్టాలను మెరుగుపరచుకోవచ్చని పేర్కొంది. కార్పొరేట్ వ్యవహారాల శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ సారథ్యంలోని దివాలా చట్ట కమిటీ (ఐఎల్‌సీ) సోమవారం ఈ మేరకు కార్పొరేట్ వ్యవహారాల శాఖ మంత్రి

హిందుస్తాన్‌ జింక్‌ వెయ్యి శాతం స్పెషల్‌ డివిడెండ్‌

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: వేదాంత గ్రూప్‌నకు చెందిన హిందుస్తాన్‌ జింక్‌ కంపెనీ నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 30 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.2,584 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో రూ.1,815 కోట్లకు తగ్గిందని హిందుస్తాన్‌  జింక్‌ తెలిపింది. ఆదాయం తక్కువగా ఉండటం, ఇతర వ్యయాలు పెరగడంతో నికర లాభం ఈ స్థాయిలో తగ్గిందని కంపెనీ చైర్మన్‌ అగ్నివేశ్‌ అగర్వాల్‌

Most from this category