STOCKS

News


కోటక్‌ బ్యాంక్‌లో ఐఎన్‌జీ గ్రూప్‌ వాటా విక్రయం !

Friday 16th November 2018
news_main1542346911.png-22069

న్యూఢిల్లీ: కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో తన కున్న వాటాను డచ్‌ ఆర్థిక దిగ్గజం ఐఎన్‌జీ గ్రూప్‌ విక్రయించనుంది. కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో ఈ గ్రూప్‌కు 3.73 శాతం వాటా ఉంది. ఈ వాటా మొత్తాన్ని ఈ వారంలో బహిరంగ మార్కెట్‌ లావాదేవీల ద్వారా ఐఎన్‌జీ గ్రూప్‌ విక్రయించనున్నదని సమాచారం. ఒక్కో షేర్‌ను రూ.1,070 ధర చొప్పున విక్రయించడానికి ఐఎన్‌జీ గ్రూప్‌ రెండు, మూడు సంస్థలతో డీల్‌ కుదుర్చుకున్నదని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ డీల్‌ విలువ రూ.7,600 కోట్లని, కెనడా పెన్షన్‌ ప్లాన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బోర్డ్‌ కొనుగోలు సంస్థల్లో ఒకటని సమాచారం. అయితే  ఈ రెండు సంస్థలు ఈ వార్తలపై వ్యాఖ్యానించడానికి నిరాకరించాయి. 2016 మొదట్లోనే కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌లో 2.5 శాతం వాటాను ఐఎన్‌జీ గ్రూప్‌ రూ.3,653 కోట్లకు విక్రయించింది. ఈ వార్తల నేపథ్యంలో బీఎస్‌ఈలో కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్‌ 3 శాతం లాభంతో రూ.1,163 వద్ద ముగిసింది. 



You may be interested

రెండో రోజూ జెట్‌ ఎయిర్‌వేస్‌ ర్యాలీ

Friday 16th November 2018

టాటా సన్స్‌ కంపెనీ టేకోవర్‌ వార్తల నేపథ్యంలో జెట్‌ ఎయిర్‌ షేర్ల ర్యాలీ రెండో రోజూ కొనసాగుతోంది. నేటి బీఎస్‌ఈ ట్రేడింగ్‌లోనూ జెట్‌ ఎయిర్‌వేస్‌ షేరు మరో 11శాతం ర్యాలీ చేసింది. తీవ్ర ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్న జెట్‌ ఎయిర్‌వేస్‌ను టాటా గ్రూప్‌ కొనుగోలుకు మొగ్గుచూపుతుందనే వార్తల నేపథ్యంలో క్రితం ట్రేడింగ్‌ సెషన్‌లో 25శాతం లాభంతో రూ.321 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. జెట్‌ ఎయిర్‌వేస్‌ను కొనుగోలు చేసుకునేందుకు టాటా

త్వరలోనే 3 ప్రభుత్వ రంగ సంస్థల వాటాల విక్రయం..!

Friday 16th November 2018

రూ.16,500 కోట్ల పెట్టుబడుల ఉపసంహరణకు అవకాశం ముంబై: పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా త్వరలోనే కేంద్ర ప్రభుత్వం ఓఎన్‌జీసీ, ఐఓసీ, ఆయిల్‌ ఇండియాలో వాటాలను విక్రయించనుందనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ ఏడాది డిజిన్వెస్ట్‌మెంట్‌ లక్ష్యాన్ని అందుకోవడంలో భాగంగా మరోనెల రోజుల్లోనే ప్రభుత్వ రంగ ఆయిల్‌ కంపెనీలలో వాటాలను ఆఫర్‌ ఫర్‌ సేల్‌ మార్గంలో విక్రయించడం, బైబ్యాక్‌ రూపంలో వాటాలను తగ్గించుకోవడం వంటి నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంటోందని విశ్వసనీయ వర్గాల సమాచారం ద్వారా వెల్లడైంది. నిర్థేశిత

Most from this category