STOCKS

News


మౌలిక రంగం నిరాశ

Friday 1st March 2019
Markets_main1551436343.png-24390

- జనవరిలో కేవలం 1.8 శాతం వృద్ధి 
-  19 నెలల కనిష్ట స్థాయి
న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్‌ జనవరి వృద్ధి ధోరణి నిరాశ కలిగించింది. వృద్ధి రేటు కేవలం 1.8 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 జనవరితో (6.2 శాతం వృద్ధి) పోల్చిచూస్తే, 2019 జనవరిలో ఎనిమిది పరిశ్రమల బాస్కెట్‌  వృద్ధి కేవలం 1.8 శాతంగా నమోదయ్యిందన్నమాట. గడచిన 19 నెలల్లో (2017 జూన్‌లో కేవలం 1 శాతం) ఇంత తక్కువ స్థాయి వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. 2018 డిసెంబర్‌లో కూడా ఈ గ్రూప్‌ వృద్ధి రేటు 2.7 శాతంగా నమోదయ్యింది.  గురువారం విడుదలైన అధికారిక గణాంకాల ప్రకారం గ్రూప్‌లో పరిశ్రమలను వేర్వేరుగా పరిశీలిస్తే...
- క్రూడ్‌ ఆయిల్‌ (-4.3 శాతం), రిఫైనరీ ప్రొడక్టులు (-2.6 శాతం), విద్యుత్‌ (-0.4 శాతం) రంగాల్లో అసలు వృద్ధిలేకపోగా క్షీణత నమోదయ్యింది. 2013 ఫిబ్రవరి తరువాత విద్యుత్‌ రంగంలో ఇలాంటి ప్రతికూల స్థితి నెలకొనడం ఇదే తొలిసారని ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రిసెర్చ్‌ పేర్కొంది.
- బొగ్గు (1.7 శాతం), సిమెంట్‌ (11 శాతం) రంగాల స్పీడ్‌ తగ్గింది. 2018 జనవరిలో ఈ వృద్ధి రేట్లు వరుసగా 3.8 శాతం, 19.6 శాతంగా నమోదయ్యాయి.
- కాగా సహజవాయువులు (6.2 శాతం), ఎరువులు (10.5 శాతం), స్టీల్‌ (8.2 శాతం) మెరుగైన పురోగతిని నమోదుచేశాయి. 
- మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ)లో ఈ ఎమినిది రంగాల వాటా దాదాపు 41 శాతం. జనవరి ఐఐపీ గణాంకాలు మార్చి రెండవ వారంలో వెలువడనున్నాయి. ఎనిమిది పరిశ్రమల పేలవ పనితీరు మొత్తం జనవరి ఐఐపీ గణాంకాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందన్నది విశ్లేషకుల అంచనా. 

ఏప్రిల్‌ నుంచి జనవరి వరకూ...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2018 ఏప్రిల్‌ నుంచి 2019 మార్చి) జనవరి వరకూ చూస్తే, ఎనిమిది పరిశ్రమల గ్రూప్‌ వృద్ధి రేటు 4.1 శాతం నుంచి 4.5 శాతానికి పెరిగాయని వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ గణాంకాలు వెల్లడించాయి. 



You may be interested

ఫేమ్‌ పథకానికి రూ. 10,000 కోట్లు

Friday 1st March 2019

- జాతీయ సాఫ్ట్‌వేర్ ఉత్పత్తుల విధానానికి ఓకే - ఆధార్ ఆర్డినెన్స్‌కు ఆమోదముద్ర - వొడాఫోన్‌ ఐడియా రైట్స్ ఇష్యూకి ఆమోదం - కేంద్ర క్యాబినెట్ నిర్ణయాలు న్యూఢిల్లీ: సబ్సిడీలివ్వడం ద్వారా విద్యుత్, హైబ్రీడ్‌ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన రెండో విడత ఫేమ్ పథకానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీనికి రూ. 10,000 కోట్లు కేటాయించింది. 2019 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ పథకం మూడేళ్ల పాటు కొనసాగుతుంది. దీని

వృద్ధి రేటు 6 శాతమే

Friday 1st March 2019

- అక్టోబర్‌-డిసెంబర్‌   వృద్ధి గణాంకాలు విడుదల - ఐదు త్రైమాసికాల కనిష్ట రేటు - అయినా ప్రపంచంలో ఏ దేశంలోనూ ఈ స్థాయి వృద్ధి స్పీడ్‌ లేదు - వ్యవసాయం, తయారీ రంగాల పేలవం - వినియోగ డిమాండ్‌ కూడా బలహీనమే! - ఆర్థిక సంవత్సరంలో వృద్ధి అంచనాలు 7.2 శాతం నుంచి 7 శాతానికి కుదింపు - ఇదే జరిగితే ఐదేళ్లలో ఇదే తక్కువస్థాయి న్యూఢిల్లీ: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధికి సంబంధించి  ప్రస్తుత ఆర్థిక సంతవ్సరం (2018 ఏప్రిల్‌ 2019

Most from this category