News


ఇన్ఫీvs టీసీఎస్‌: అంతలో ఎంత తేడా!

Monday 16th July 2018
news_main1531727823.png-18357

పదేళ్లలో తారుమారు 
సరిగ్గా దశాబ్ద కాలం ముందు అంటే 2008 ఆరంభంలో దేశీయ ఐటీ రంగంలో అతిపెద్ద కంపెనీ టీసీఎస్‌ కన్నా ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్‌ దాదాపు ఒకటిన్నర రెట్లు అధికంగా ఉంది. అప్పట్లో ఇండియన్‌ ఐటీ అంటే ఇన్ఫీ అనేంతగా కంపెనీ పేరు మారుమోగిపోయింది. అయితే అదంతా గతం. అప్పటి నుంచి క్రమంగా టీసీఎస్‌తో పోలిస్తే ఇన్ఫీ ప్రభ మసకబారుతూవచ్చింది. పదేళ్ల తర్వాత 2018లో ఇన్ఫోసిస్‌ మార్కెట్‌ క్యాప్‌(4172 కోట్ల డాలర్లు) కన్నా టీసీఎస్‌ మార్కెట్‌ క్యాప్‌(11100 కోట్ల డాలర్లు) దాదాపు రెండున్నర రెట్లు ఎక్కువ. 
ఈ పదేళ్లలో ఏం జరిగింది? ఎందుకు ఈ రెండు కంపెనీల ప్రదర్శనలో ఇంత తేడా వచ్చింది? వివరణ, విశ్లేషణ..
- 2004లో ఇన్ఫోసిస్‌ కన్నా టీసీఎస్‌ మార్కెట్‌ క్యాపిటల్‌ విలువ 15 శాతం ఎక్కువ. అయితే 2008-09 కాలంలో టీసీఎస్‌కు కరెన్సీ పరమైన ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. దీంతో టీసీఎస్‌ ఈపీఎస్‌ కేవలం 3 శాతం పెరిగింది. అదే సమయంలో కంపెనీ డాలర్‌ రెవెన్యూలో 6.8 శాతం క్షీణత నమోదయింది. దీంతో 2008 సమయానికి టీసీఎస్‌ షేరు కన్నా ఇన్ఫీ షేరు విలువ పెరిగి తదనుగుణంగా మార్కెట్‌ క్యాప్‌ పరంగా ఇన్ఫీకన్నా టీసీఎస్‌ వెనుకబడిపోయింది.
- అయితే 2009 తర్వాత నుంచి ఇరు కంపెనీల షేర్లు పెరిగిన క్రమంలో తేడాలు వచ్చాయి. ఈ పదేళ్లలో ఇన్ఫోసిస్‌ షేరు 236 శాతం దూసుకుపోగా, టీసీఎస్‌ షేరు ఏకంగా 930 శాతం పెరిగిపోయింది. దీంతో ఇరు కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ మధ్య వ్యత్యాసం అమాంతం విస్తరించింది. ప్రస్తుతం ఇన్ఫోసిస్‌తో పోలిస్తే టీసీఎస్‌ షేరు 35 శాతం ప్రీమియంతో ట్రేడవుతోంది. 
- ఈ పదేళ్లలో వివిధ విభాగాల్లోకి వేగంగా విస్తరించడం, వివిధ భౌగోళిక ప్రాంతాల్లో క్లయింట్లను పెంచుకోవడం, డీల్స్‌ ఎగ్జిక్యూషన్‌లో స్థిరత్వం కారణంగా టీసీఎస్‌ మంచి వృద్ధి సాధించింది. 
- ఇరు కంపెనీల మధ్య వ్యత్యాసం తాజా ఫలితాల్లో కూడా ప్రతిబింబిస్తోంది. టీసీఎస్‌ ఫలితాలు అంచనాలు మించి బలంగా ఉండగా, ఇన్ఫోసిస్‌ ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. You may be interested

ఈ టాటా షేర్లు కొనొచ్చు!!

Monday 16th July 2018

ఇండిట్రేడ్‌ గ్రూప్‌ చైర్మన్‌ సుదీప్‌ బందోపాధ్యాయ తాజాగా టాటా గ్రూప్‌కు చెందిన టైటాన్‌, వోల్టాస్‌ స్టాక్స్‌ కొనొచ్చని సిఫార్సు చేస్తున్నారు. ఆయన ఒక ఆంగ్ల చానల్‌తో మాట్లాడుతూ ఈ రికమెండేషన్లు చేశారు. టైటాన్‌ గురించి అందరికీ తెలుసన్నారు. ఈ స్టాక్ ధరలో కరెక‌్షన్‌ జరిగిందని తెలిపారు. ప్రస్తుతం కొనడానికి ఆకర్షణీయంగా ఉందని పేర్కొన్నారు. టైటాన్‌ ప్రధాన వ్యాపారం చాలా పటిష్టంగా ఉందని గుర్తుచేశారు. ఈ సంస్థ క్రమంగా మార్కెట్‌లో వాటాను

ఇలా చేస్తే మీ పొదుపు పండినట్టే  

Monday 16th July 2018

పెరిగే వేతనానికి అనుగుణంగా పెట్టుబడులు ఖర్చులకు, పెట్టుబడులకు వేర్వేరు ఖాతాలు పొదుపునకు రుణ వాయిదా కూడా తొలిమెట్టే దీర్ఘకాలిక సాధనాల్లో చేరడం మంచిదే ఖర్చులకు దీటుగా పొదుపు అవసరమైతే సన్నిహితులు లేదా నిపుణుల సాయం     ఎంత సంపాదించినా పొదుపు తెలియకపోతే నెల చివరికొచ్చేసరికి రూపాయి కనిపించదు. ఎంత సంపాదించామన్నది కాదు, ఎంత పొదుపు, మదుపు చేశామన్నదే వ్యక్తుల ఆర్థిక ప్రణాళికలో కీలకం. ఖర్చులను నియంత్రించుకుని, తగినంత ఇన్వెస్ట్‌ చేయడం ద్వారానే అన్ని ఆర్థిక పరమైన లక్ష్యాలను చేరడం

Most from this category