STOCKS

News


ఆరిజోనాలో ఇన్ఫీ టెక్నాలజీ హబ్‌

Saturday 22nd September 2018
news_main1537592589.png-20465

న్యూఢిల్లీ: దేశీ ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌.. అమెరికాలో కొత్తగా మరో టెక్నాలజీ, ఇన్నోవేషన్ హబ్‌ను ఏర్పాటు చేయబోతోంది. ఆరిజోనాలో దీన్ని ప్రారంభించనున్నట్లు సంస్థ తెలిపింది. 2023 నాటికి 1,000 మంది అమెరికన్ ఉద్యోగులను ఇందులో నియమించుకోనున్నట్లు వివరించింది. ఆరిజోనా కళాశాలల్లో చదివిన తాజా గ్రాడ్యుయేట్స్‌, స్థానిక నిపుణులు వీరిలో ఉండనున్నట్లు పేర్కొంది. రెండేళ్ల వ్యవధిలో ఇలాంటి నాలుగు హబ్‌లు ఏర్పాటు చేస్తామని, 10,000 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని గతేడాదే ఇన్ఫీ ప్రకటించింది. ఈ ప్రణాళిక ప్రకారం రెండు హబ్‌లు ఏర్పాటు చేసిన ఇన్ఫోసిస్‌.. ఇప్పటిదాకా 5,874 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించింది.



You may be interested

వచ్చే వారం 3 ఐపీఓలు..

Saturday 22nd September 2018

ముంబై:- వచ్చే వారం మూడు కంపెనీలు ఐపీఓ (ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్)కు రానున్నాయి. ప్రభుత్వ రంగ గార్డెన్‌ రీచ్‌ షిప్‌బిల్డర్స్‌ అండ్‌ ఇంజనీర్స్‌ కంపెనీ, నాన్-బ్యాకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీ అవాస్‌ ఫైనాన్షియర్స్‌, దినేష్‌ ఇంజనీర్స్‌లు ఐపీఓ ద్వారా రూ.2,264 కోట్ల నిధుల సమీకరణకు సిద్ధమయ్యాయి. అయితే ఐపీఓలు ఎంతవరకు విజయవంతమవుతాయనే అంశంపై అనుమానాలు నెలకొన్నాయి. ఇందుకు ప్రస్తుతం మార్కెట్లో నెలకొన్న ప్రతికూల పరిస్థితులు కారణమవుతున్నాయి. స్టాక్‌మార్కెట్‌ ఈ సెప్టెంబర్‌లో మూడు

త్వరలో ఇన్వెన్షియా హెల్త్‌కేర్‌ ఐపీఓ

Saturday 22nd September 2018

న్యూఢిల్లీ: ఇన్వెన్షియా హెల్త్‌కేర్‌ కంపెనీ త్వరలో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు వస్తోంది. ఐపీఓ సంబంధిత పత్రాలను ఈ కంపెనీ ఇటీవలనే మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓలో భాగంగా ఈ కంపెనీ రూ.125 కోట్ల విలువైన తాజా షేర్లను విక్రయించనున్నది. ఈ తాజా షేర్లతో పాటు ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) కింద 31.64 లక్షల షేర్లను కూడా ప్రమోటర్లు, ఇతర వాటాదారులు ఆఫర్‌ చేస్తున్నారు. ప్రమోటర్లు-జనక్‌ షా,

Most from this category