STOCKS

News


ఇన్ఫోసిస్‌ చేతికి ఫ్లూయిడో కంపెనీ

Saturday 15th September 2018
news_main1536987671.png-20276

న్యూఢిల్లీ: ఫిన్లాండ్‌కు చెందిన ఫ్లూయిడో కంపెనీని భారత ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌ రూ.545 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి ఈ లావాదేవీ పూర్తవుతుందని ఇన్ఫోసిస్‌ తెలిపింది. ఈ కంపెనీ కొనుగోలుతో నార్డిక్‌ ప్రాంతంలో మరింత శక్తివంతమవుతామని పేర్కొంది. ఫిన్లాండ్‌లోని ఈస్‌పూ కేంద్రంగా ఫ్లూయిడో కంపెనీ కార్యకలాపాలు నిర్వహిస్తోంది. 2010లో ఆరంభమైన ఈ కంపెనీ ఫిన్లాండ్‌, డెన్మార్క్‌, స్వీడన్‌, నార్వే, స్లోవేకియా దేశాల్లో క్లయింట్లకు సాఫ్ట్‌వేర్‌ సర్వీసులందిస్తోంది. కాగా ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్‌ క్వార్టర్‌ ఫలితాల కోసం డైరెక్టర్ల బోర్డ్‌ వచ్చే నెల 15, 16 తేదీల్లో సమావేశం కానున్నదని తెలిపింది. వచ్చే నెల 16న క్యూ2 ఫలితాలను వెల్లడిస్తామని పేర్కొంది.



You may be interested

మార్కెట్లోకి వెర్నా వార్షికోత్సవ ఎడిషన్

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: దక్షిణ కొరియాకు చెందిన కార్ల కంపెనీ హ్యుందాయ్‌ మోటార్ ఇండియా లిమిటెడ్‌ (హెచ్‌ఎంఐఎల్‌) మిడ్‌-సైజ్‌ సెడాన్‌ వెర్నా వార్షికోత్సవ ఎడిషన్‌ను శుక్రవారం మార్కెట్‌లోకి విడుదలచేసింది. మాన్యువల్‌, ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌... పెట్రోల్‌, డీజిల్‌ ఇంజిన్‌ వేరియంట్లలో లభ్యమయ్యే ఈ కారు ధరల శ్రేణి రూ.11.69 లక్షల నుంచి రూ.13.03 లక్షలుగా నిర్ణయించినట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం 1,000 యూనిట్లను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. వైర్‌ లెస్‌ ఫోన్‌ చార్జింగ్‌,

ఐఫోన్ 10ఎస్ @ రూ. 1.45 లక్షలు

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం యాపిల్ కొత్తగా ఐఫోన్‌ సిరీస్‌లో ప్రవేశపెట్టిన 10ఎస్‌ హ్యాండ్‌సెట్స్‌ ప్రారంభ ధర భారత్‌లో రూ.1 లక్ష పైగానే ఉండనుంది. భారత్‌లో ఐఫోన్ 10ఎస్‌ ధర రూ. 99,000 నుంచి (64 జీబీ వేరియంట్) ఉంటుంది. 256 జీబీ వేరియంట్ రేటు రూ.1,14,900 గాను 512 జీబీ రేటు రూ.1,34,900గాను ఉంటుంది. ఇక 6.5 అంగుళాల పెద్ద స్క్రీన్‌తో లభించే 10ఎస్ మ్యాక్స్ రేటు రూ.1,09,900 (64

Most from this category