News


బన్సల్‌ కేసులో ఇన్ఫీకి ఎదురుదెబ్బ

Wednesday 19th September 2018
Markets_main1537339169.png-20377

  • మాజీ సీఎఫ్‌వోకి పరిహారం
  • ఇవ్వాల్సిందేనని ఆర్బిట్రేషన్‌ ఉత్తర్వులు

న్యూఢిల్లీ: మాజీ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌ (సీఎఫ్‌వో) రాజీవ్ ‍బన్సల్‌కి పరిహారం వివాదంపై ఆర్బిట్రేషన్ కేసులో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్‌కు ఎదురుదెబ్బ తగిలింది. ఆయనకు రూ. 12.17 కోట్ల బకాయిని వడ్డీతో పాటు చెల్లించాల్సిందేనని ఆర్బిట్రేషన్ పానెల్ స్పష్టం చేసింది. బన్సల్‌ ఇప్పటికే తీసుకున్న రూ. 5.2 కోట్ల మొత్తాన్ని వాపసు చేయాలన్న సంస్థ అభ్యర్ధనను పానెల్ తిరస్కరించిందని బీఎస్‌ఈకి ఇన్ఫీ తెలియజేసింది. దీనిపై న్యాయ నిపుణులను సంప్రతించి, తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు వివరించింది. ఇన్ఫోసిస్ గత యాజమాన్యం, వ్యవస్థాపకుల మధ్య చిచ్చు రేపిన అంశాల్లో బన్సల్‌ పరిహారం కూడా ఒకటి కావడం గమనార్హం. 2015లో రాజీవ్ బన్సల్ ఇన్ఫోసిస్‌ నుంచి వైదొలిగినప్పుడు.. ఆయనకు పరిహారం కింద 24 నెలల జీతం లేదా రూ. 17.38 కోట్లు ఇచ్చేందుకు ఇన్ఫీ అంగీకరించింది. దీని ప్రకారం ముందుగా రూ. 5 కోట్లు చెల్లించింది. అయితే, ఈ డీల్‌పై సంస్థ సహ వ్యవస్థాపకుడు ఎన్‌ఆర్ ‍నారాయణ మూర్తి తదితరులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో.. మిగతాది చెల్లించకుండా నిలిపివేసింది. ఈ వివాదంతో ఇన్ఫోసిస్‌పై బన్సల్ ఆర్బిట్రేషన్ పానెల్‌ను ఆశ్రయించగా.. తాజా ఆదేశాలు వెలువడ్డాయి.



You may be interested

ఇక మూడు రోజుల్లోనే లిస్టింగ్‌

Wednesday 19th September 2018

ఎఫ్‌పీఐలకు కొత్త కేవైసీ నిబంధనలు మ్యూచువల్‌ ఫండ్‌ వ్యయాలు తగ్గింపు కమోడిటీ డెరివేటివ్స్‌లోకి విదేశీ ఇన్వెస్టర్లకు అనుమతి పలు కీలక ప్రతిపాదనలకు సెబీ ఆమోదం ముంబై: మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీ మంగళవారం పలు కీలక ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. మంగళవారం జరిగిన బోర్డ్‌ సమావేశంలో సెబీ పలు ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు సంబంధించిన సవరించిన కొత్త కేవైసీ (నో యువర్‌ కస్టమర్‌)నిబంధనలకు ఆమోదం తెలిపామని, త్వరలో మార్గదర్శకాలు జారీ చేస్తామని

లాంగ్‌టర్మ్‌ కోసం పది సిఫార్సులు

Wednesday 19th September 2018

వచ్చే ఒకటి రెండు సంవత్సరాల్లో మంచి రాబడినిచ్చే బలమైన స్టాకులను ప్రముఖ బ్రోకరేజ్‌లు రికమండ్‌ చేస్తున్నాయి. ఎస్‌ఎంసీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ రికమండేషన్లు-  1. డా. రెడ్డీస్‌ ల్యాబ్‌: తొలి త్రైమాసికంలో మంచి ఫలితాలు ప్రకటించింది. నిర్వాహక సామర్ధ్య మెరుగుదలకు చేపట్టిన చర్యలు ఫలితాలు ఇస్తున్నాయని మేనేజ్‌మెంట్‌ పేర్కొంది. రాబోయే కాలంలో బయోసిమిలర్స్‌పై ఎక్కువ శ్రద్ధ పెడతామని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరం కంపెనీ నుంచి కొత్తగా 20 ఉత్పత్తుల లాంచింగ్‌ ఉండవచ్చు. కంపెనీ వ్యాపారం

Most from this category