ఇన్ఫీలో అమెరికన్లకు పెద్దపీట
By Sakshi

న్యూఢిల్లీ: దేశీయ రెండవ అతిపెద్ద ఐటీ సేవల సంస్థ ఇన్ఫోసిస్ భారీస్థాయిలో అమెరికా పౌరులకు ఉద్యోగాలను కల్పించింది. 2017 మార్చి నుంచి ఇప్పటి వరకు తమ సంస్థలో 4,700 మంది యూఎస్ పౌరులను నియమించుకున్నట్లు ప్రకటించింది. వీరిలో 500 మంది ఉత్తర కరొలినా రాజధాని రాలీగ్‌లో ఉన్నటువంటి ప్రాంతీయ సాంకేతిక కేంద్రంలో నియమితులైనట్లు తెలిపింది. కృత్రిమ మేధ (ఏఐ), మెషీన్ లెర్నింగ్ (ఎంఎల్), క్లౌడ్, బిగ్ డేటా, డిజిటల్ టెక్నాలజీస్, యూజర్ అనుభవం, అభివృద్ధి చెందుతున్న డిజిటల్ టెక్నాలజీలపై మరింత దృష్టిసారించడంలో భాగంగా బహుళ సాంకేతికత, ఆవిష్కరణ కేంద్రాలను అమెరికాలో ఏర్పాటుచేస్తున్న ఇన్ఫోసిస్.. ప్రత్యేకించి ఈ కార్యచరణ కోసమే అక్కడి ఉద్యోగుల సంఖ్యను పెంచుతోంది. ఇందుకోసం 10,000 మంది అమెరికన్లను నియమించుకుంటున్నట్లు కిందటి ఏడాదిలోనే అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.
మెరుగైన విద్య కోసం గ్రాంట్స్
అమెరికాలో క్లాస్రూమ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ట్రైనింగ్ నిమిత్తం పలు గ్రాంట్లను అందిస్తున్న యూఎస్ఏ ఇన్ఫోసిస్ ఫౌండేషన్, తమ సేవల ద్వారా అనేక మంది అమెరికన్లు లబ్థిపొందినట్లు తెలిపింది. 3,938 విద్యార్థులు, 102 ఉపాధ్యాయులు, 94 పాఠశాలలు ప్రయోజనం పొందినట్లు ఇన్ఫోసిస్ సీఈఓ సలిల్ పరేఖ్ వెల్లడించారు.
You may be interested
రూ. 133 కోట్లు డిఫాల్ట్ అయిన ఆర్ఇన్ఫ్రా
Friday 24th August 2018న్యూఢిల్లీ: దాదాపు రూ.133.38 కోట్ల నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లకు (ఎన్సీడీ) సంబంధించిన చెల్లింపులు జరపడంలో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ (ఆర్ఇన్ఫ్రా) విఫలమైంది. ఆగస్టు 20న ఈ చెల్లింపులు జరపాల్సి ఉంది. అయితే, తమ ముంబై విద్యుత్ వ్యాపార విభాగాన్ని అదానీ ట్రాన్స్మిషన్కి విక్రయించగా వచ్చే రూ.18,800 కోట్ల నుంచి మరికొద్ది రోజుల్లో ఈ చెల్లింపులు జరుపుతామని సంస్థ పేర్కొంది. అదానీ డీల్ ద్వారా వచ్చే మొత్తం నిధులను ఈ తరహా రుణాల చెల్లింపు
అసోచామ్ సెక్రటరీ జనరల్‌గా యూకే వర్మ!
Friday 24th August 2018న్యూఢిల్లీ: ఇండస్ట్రీ చాంబర్- అసోచామ్ సెక్రటరీ జనరల్‌గా వీకే వర్మ నియమితులయ్యారు. దాదాపు 14 సంవత్సరాలు బాధ్యతలు నిర్వహించిన డీఎస్ రావత్ స్థానంలో వర్మ నియమితులయ్యారు. అసోచామ్ ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వశాఖ కార్యదర్శి హోదాలో వర్మ 2013 జూన్ 30న పదవీ విరమణ చేశారు. కేంద్ర, రాష్ట్ర పాలనా వ్యవహారాల్లో వర్మకు విశేష అనుభవం ఉంది. ఈ సందర్భంగా అసోచామ్