STOCKS

News


టెమాసెక్‌తో ఇన్ఫోసిస్ జట్టు

Saturday 8th September 2018
news_main1536381310.png-20082

న్యూఢిల్లీ: ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్ తాజాగా ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ టెమసెక్‌తో జాయింట్ వెంచర్ (జేవీ) ఏర్పాటు చేసింది. ఈ జేవీ కింద టెమసెక్‌తో పాటు దాని క్లయింట్లకు ఇన్ఫోసిస్ డిజిటల్ సర్వీసులు అందించనుంది. ఇందుకోసం టెమసెక్‌ సింగపూర్ విభాగమైన ట్రస్టెడ్ సోర్స్‌తో ఇన్ఫీ టీమ్ జతకట్టనుంది. ఒప్పందం ప్రకారం జాయింట్ వెంచర్‌లో ఇన్ఫోసిస్‌కు 60 శాతం, టెమసెక్‌కు 40 శాతం వాటాలుంటాయి. సింగపూర్ కేంద్రంగా పనిచేసే టెమసెక్‌ ప్రస్తుతం 235 బిలియన్ డాలర్ల నిధులను నిర్వహిస్తోంది. ఈ వెంచర్‌లో దాదాపు 12 మిలియన్ డాలర్ల మేర ఇన్వెస్ట్ చేసే అవకాశం ఉందని ఇన్ఫోసిస్‌ వెల్లడించింది. ఆగ్నేయాసియా మార్కెట్లో స్థానం మరింత పటిష్టం చేసుకునేందుకు తమకు, డిజిటల్ సామర్ధ్యాలు మెరుగుపర్చుకునేందుకు టెమసెక్‌ సంస్థకు ఈ డీల్ తోడ్పడగలదని పేర్కొంది. 



You may be interested

జోరుగా డిజిన్వెస్ట్‌మెంట్‌

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాల విక్రయ (డిజిన్వెస్ట్‌మెంట్‌) ప్రక్రియపై కేంద్రం మరింతగా దృష్టి సారించింది. సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో (సీఈఎల్‌) పూర్తిగా 100 శాతం వాటాలను విక్రయించేందుకు శుక్రవారం బిడ్లను ఆహ్వానించింది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) ఈ మేరకు బిడ్డర్లు ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు (ఈవోఐ) పంపాలంటూ ప్రకటించింది. ఈవోఐలు దాఖలు చేసేందుకు అక్టోబర్ 21 ఆఖరు తేదీ. 2018 మార్చి 31 నాటికి

మీ వ్యాపార విధానమేంటో చెప్పండి

Saturday 8th September 2018

న్యూఢిల్లీ: భారత్‌లో అనుసరించబోయే వ్యాపార విధానాన్ని గురించి వివరించాలంటూ అమెరికా రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్‌, దేశీ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లను నేషనల్ కంపెనీ లా అపీలేట్ ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌ఏటీ) ఆదేశించింది. సెప్టెంబర్ 29లోగా దీనిపై తగు వివరణనివ్వాలంటూ వాల్‌మార్ట్ ఇంటర్నేషనల్ హోల్డింగ్స్‌కు సూచించింది. ఇక ఫ్లిప్‌కార్ట్‌ను వాల్‌మార్ట్ కొనుగోలు చేసేందుకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) అనుమతినివ్వడాన్ని సవాలు చేస్తు అపీల్ వేసిన వ్యాపార సంస్థల సమాఖ్య సీఏఐటీకి

Most from this category