STOCKS

News


ఇండస్‌ ఇండ్‌కు బీఎఫ్‌ఐఎల్‌ దన్ను

Saturday 13th July 2019
news_main1562991067.png-27029

  • నికర లాభం రూ.1,433 కోట్లు 
  • మొత్తం ఆదాయం రూ.8,625 కోట్లు 
  • 34 శాతం పెరిగిన నికర వడ్డీ ఆదాయం

ముంబై: ప్రైవేట్‌ రంగ ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసిక కాలంలో రూ.1,433 కోట్ల నికర లాభాన్ని (కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసిక కాలానికి రూ.1.036 కోట్ల నికర లాభం సాధించామని  ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ తెలిపింది. తమ బ్యాంక్‌లో విలీనమైన సూక్ష్మ రుణ సం‍స్థ, భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ పనితీరు బాగుండటంతో నికర లాభం ఈ స్థాయిలో పెరిగిందని బ్యాంక్‌ సీఎమ్‌డీ, సీఈఓ రమేశ్‌ సోబ్తి చెప్పారు. మొత్తం ఆదాయం రూ.6,370 కోట్ల నుంచి శాతం వృద్ధితో రూ.8,625 కోట్లకు పెరిగిందని పేర్కొన్నారు. భారత్‌ ఫైనాన్షియల్‌ ఇన్‌క్లూజన్‌ లిమిటెడ్‌ (బీఎఫ్‌ఐఎల్‌) విలీనం విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. ఈ క్యూ1 ఫలితాల్లో బీఎఫ్‌ఐఎల్‌ గణాంకాలు కూడా ఉన్నందున గత క్యూ1 ఫలితాలను, ఈ క్యూ1 ఫలితాలను పోల్చడానికి  లేదని వివరించారు. 
రుణ వృద్ధి 28 శాతం....
28 శాతం రుణ వృద్ధి సాధించామని బ్యాంక్‌ ఎమ్‌డీ, సీఈఓ రమేశ్‌ సోబ్తి చెప్పారు. నికర వడ్డీ ఆదాయం 34 శాతం వృద్ధితో రూ.2,844 కోట్లకు పెరిగిందని, 4.05 శాతం నికర వడ్డీ మార్జిన్‌ సాధించామని వివరించారు. ఈ ఏడాది జూన్‌లో మనీ మార్కెట్‌ రేట్లు భారీగా తగ్గాయని, ఫలితంగా నికర వడ్డీ మార్జిన్‌ పెరిగిందని పేర్కొన్నారు. వాహన విక్రయాల్లో మందగమనం చోటు చేసుకున్నా, వాహన రుణాలు 24 శాతం వృద్ధి చెందాయని తెలిపారు. 
మొండి బకాయిలు డబుల్‌...
గత క్యూ1లో 1.15 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ1లో దాదాపు రెట్టింపై 2.15 శాతానికి పెరిగాయని సోబ్తి పేర్కొన్నారు. ‘‘గత ఆర్థిక సంవత్సరం చివరి క్వార్టర్‌లో ఇది 2.10 శాతం. గత క్యూ1లో 0.51 శాతంగా ఉన్న నికర మొండి బకాయిలు ఈ క్యూ1లో 1.23 శాతానికి పెరిగాయి. కేటాయింపులు రూ.350 కోట్ల నుంచి రూ.430 కోట్లకు చేరుకున్నాయి. కానీ సీక్వెన్షియల్‌గా చూస్తే, కేటాయింపులు భారీగా తగ్గాయి.  గత క్యూ4లో కేటాయింపులు రూ.1,560 కోట్లు. క్యాపిటల్‌ అడెక్వసీ 14.16 శాతం నుంచి 14.90 శాతానికి పెరిగింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌నకు రుణాలిచ్చిన కారణంగా గత కొన్ని క్వార్టర్ల పాటు రుణ నాణ్యత ప్రభావితమైంది, ప్రస్తుతం ఈ రుణ నాణ్యత ఇబ్బందుల నుంచి బయటపడ్డాం’’ అని సోబ్తి వివరించారు. ఆరంభంలో భారీగా లాభపడిన ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ షేర్‌ చివరకు 2 శాతం నష్టంతో రూ.1,510 వద్ద ముగిసింది. 



You may be interested

మార్కెట్లోకి ‘ఇథనాల్‌’తో నడిచే టీవీఎస్‌ అపాచీ

Saturday 13th July 2019

ప్రారంభ ధర రూ.1.2 లక్షలు న్యూఢిల్లీ: ప్రముఖ వాహన తయారీ కంపెనీ ‘టీవీఎస్‌ మోటార్‌’.. తాజాగా తన పాపులర్‌ మోడల్‌ అపాచీలో ‘ఇథనాల్‌’ వెర్షన్‌ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ‘అపాచీ ఆర్‌టీఆర్ 200 ఫై ఈ100’ పేరిట శుక్రవారం విడుదలైన ఈ అధునాతన బైక్‌... ఇథనాల్‌ ఇంధనం ఆధారంగా నడుస్తుంది. ప్రారంభ ధర రూ.1.2 లక్షలు. దేశవ్యాప్తంగా ఇథనాల్‌ అందుబాటులో లేనందున ప్రస్తుతానికి చెరుకు పంటకు ప్రధాన రాష్ట్రాలైన మహారాష్ట్ర, ఉత్తర

మెప్పించిన ఇన్ఫీ!

Saturday 13th July 2019

- క్యూ1 లాభం రూ.3,802 కోట్లు; 5.2 శాతం వృద్ధి - ఆదాయం 13.9 శాతం అప్‌; రూ.21,803 కోట్లు - ఈ ఏడాది గైడెన్స్‌ పెంపు;  ఆదాయ వృద్ధి 8.5-10 శాతంగా అంచనా బెంగళూరు: దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీ ఇన్ఫోసిస్‌ ఆశావహ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో (2019-20, క్యూ1) కంపెనీ రూ.3,802 కోట్ల కన్సాలిడేటెడ్‌ (అనుబంధ సంస్థలన్నింటితో కలిపి) నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం

Most from this category