STOCKS

News


ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభం రూ. 985 కోట్లు

Wednesday 9th January 2019
news_main1547027193.png-23486

మూడోత్రైమాసికంలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌ లాభం 5 శాతం పెరిగి రూ. 985 కోట్లకు చేరింది. ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌కు సంబంధించిన అధిక కేటాయింపులు బ్యాంకు లాభాలను దెబ్బతీశాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో బ్యాంకు 936 కోట్ల రూపాయల నికరలాభం నమోదు చేసింది. ప్రస్తుత త్రైమాసికంలో బ్యాంకు లాభం ర. 811 కోట్లు ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేశాయి. తాజా త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం 21 శాతం పెరిగి రూ.2288 కోట్లను చేరింది. సమీక్షాకాలంలో 607 కోట్ల రూపాయల మొండి పద్దులకు కేటాయింపులు(ప్రొవిజన్స్‌ అండ్‌ కంటింజెన్సీస్‌) జరిపినట్లు బ్యాంకు తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ మొత్తం 157 శాతం అధికం. ప్రస్తుత సమీక్షా కాలంలో బ్యాంకు అసెట్‌ క్వాలటీ మరింత బలహీనపడింది. జీఎన్‌పీఏలు 1.09 శాతం నుంచి 1.13 శాతానికి పెరిగాయి. నికర ఎన్‌పీఏలు 0.48 నుంచి 0.59 శాతానికి పెరిగాయి. బుధవారం మధ్యాహ్న ట్రేడింగ్‌లో బ్యాంకు షేరు దాదాపు 1 శాతం నష్టంతో కొనసాగుతోంది. 



You may be interested

యస్‌ బ్యాంకు షేర్లకు బ్లాక్‌డీల్‌ షాక్‌

Wednesday 9th January 2019

6శాతం పతనమైన బ్యాంకు షేర్లు భారీ మొత్తంలో జరిగిన బ్లాక్‌డీల్స్‌ యస్‌ బ్యాంక్‌ షేర్లకు షాక్‌నిచ్చాయి. ఒక ప్రైవేట్‌ కంపెనీ రెండు బ్లాక్‌డీల్‌ ద్వారా సుమారు 25లక్షల ఈక్విటీ షేర్లు కొనుగోలు చేసినట్లు వార్తలు వెలువడంతో బుధవారం యస్‌ బ్యాంక్‌ షేర్లు 6శాతం క్షీణించాయి. నేడు బీఎస్‌ఈలో యస్‌ బ్యాంక్‌ షేరు రూ.193.75ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఇంట్రాడేలో బ్లాక్‌డీల్స్‌ అంశం వెలుగులోకి రావడంతో షేరు 6శాతం నష్టపోయి 181.55ల కనిష్టానికి

టీసీఎస్‌ ఫలితాలపై బ్రోకరేజ్‌ల అంచనాలు

Wednesday 9th January 2019

దేశంలో అతిపెద్ద ఐటీ కంపెనీ టీసీఎస్‌ జనవరి 10న మూడో త్రైమాసిక ఫలితాలు ప్రకటించనుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా కంపెనీ  బలమైన ఫలితాలనే ప్రకటించవచ్చని బ్రోకరింగ్‌ సంస్థలు భావిస్తున్నాయి. కంపెనీ మొత్తం ఆర్థిక సంవత్సరానికి రెండంకెల వృద్దిని నమోదు చేయవచ్చని, రెవెన్యూ గ్రోత్‌ 1.4- 2.2 శాతం(స్థిర కరెన్సీలెక్కల్లో) ఉండొచ్చని అంచనా వేస్తున్నాయి.  - గత త్రైమాసికంతో పోలిస్తే రెవెన్యూలో 1.8 శాతం వృద్ది ఉంటుంది- జెఫర్రీస్‌ - ఈ త్రైమాసికంలో ఆర్థిక

Most from this category