STOCKS

News


ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ లాభం @ 920 కోట్లు

Monday 15th October 2018
news_main1539596057.png-21169

ప్రైవేట్‌ రంగ ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు రెండో త్రైమాసిక (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. వార్షిక ప్రాతిపదికన బ్యాంక్‌ నికర లాభం 5 శాతం వృద్ధితో రూ.920 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో బ్యాంక్‌ నికర లాభం రూ.880 కోట్లు. కాగా మార్కెట్‌ నిపుణులు బ్యాంక్‌ నికర లాభం రూ.1,091 కోట్లుగా ఉండొచ్చని అంచనా వేశారు. అధిక కేటాయింపుల వల్ల నికర లాభం తక్కువగా పెరిగింది. 
ప్రస్తుత క్యూ2లో బ్యాంక్‌ నికర వడ్డీ ఆదాయం 21 శాతం వృద్ధితో రూ.2,203 కోట్లకు ఎగసింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో నికర వడ్డీ ఆదాయం రూ.1,820 కోట్లుగా ఉంది.
ఈ క్యూ2లో కేటాయింపులు రూ.590 కోట్లకు పెరిగాయి. క్యూ1లో కేటాయింపులు రూ.350 కోట్లుగా, గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో కేటాయింపులు రూ.293 కోట్లుగా ఉన్నాయి. 
రుణ నాణ్యత త్రైమాసికం పరంగా మెరుగుపడింది. ఈ క్యూ2లో స్థూల ఎన్‌పీఏలు 1.15 శాతం నుంచి 1.09 శాతానికి తగ్గాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో స్థూల ఎన్‌పీఏలు 1.08 శాతంగా ఉన్నాయి. క్వార్టర్‌ పరంగా చూస్తే ఈ క్యూ2లో నికర ఎన్‌పీఏలు 0.51 శాతం నుంచి 0.48 శాతానికి తగ్గాయి. 

క్యూ2 ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో మధ్యాహ్నాం 3 గంటల సమయంలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌ షేరు ధర ఎన్‌ఎస్‌ఈలో 1.97 శాతం క్షీణతతో రూ.1,620 వద్ద ట్రేడవుతోంది.  



You may be interested

టోకు ద్రవ్యోల్బణం 5.13 శాతం

Monday 15th October 2018

టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం సెప్టెంబర్‌లో పెరిగింది. 5.13 శాతంగా నమోదయ్యింది. ఆహార పదార్ధాలు, ఇంధన ధరల పెరుగుదల ఇందుకు కారణం. వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. ఆగస్ట్‌లో డబ్ల్యూపీఐ 4.53 శాతం ఉంది. గతేడాది సెప్టెంబర్‌లో ఇది కేవలం 2.6 శాతంగానే నమోదయ్యింది. 

వచ్చే 3-4 వారాల్లో లాభాలనిచ్చే పది షేర్లివే..!

Monday 15th October 2018

ఆసియా మార్కెట్ల నుంచి అందుతున్న ప్రతికూల పవనాలతో దేశీయమార్కెట్‌ సోమవారం నష్టాల బాట పట్టింది. డాలర్‌ మారకంలో రూపాయి బలహీనత కూడా ఇందుకు కారణమవుతోంది. అయితే ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో కూడా మంచి రాబడులు ఇచ్చే పది నాణ్యమైన స్టాకులను ప్రముఖ ఇన్వెస్టర్స్ రికమండ్‌ చేస్తున్నారు. వోల్టాస్‌:- టార్గెట్‌ ధర:- రూ.560, స్టాప్‌ లాస్:- రూ.480. ఈ షేరు ఇటీవల రూ.636 వద్ద కరెక‌్షన్‌కు లోనై రూ. 475 వద్ద మద్దతు

Most from this category