STOCKS

News


జమ్మూ-హైదరాబాద్‌ మధ్య ఇండిగో విమానాలు రద్దు!

Thursday 6th September 2018
news_main1536209742.png-20005

జమ్మూ: విమానయాన సంస్థ ఇండిగో జమ్మూ నుంచి పలు ప్రాంతాలకు నడిచే మూడు విమానాలను ఉపసంహరించుకుంది. రెండింటిని ఇటీవలే ఉపసంహరించుకోగా, ఒకటి వేసవిలో ఉంటుందని జమ్మూ ఎయిర్‌పోర్ట్‌ డైరెక్టర్‌ వీకే గౌతం తెలిపారు. ఈ కారణంగా జమ్మూ నుంచి హైదరాబాద్‌, ఢిల్లీ, బెంగళూరు, అమృత్‌సర్‌, జైపూర్‌కు ఇండిగో విమాన సేవలు నిలిచిపోయినట్టయింది. అయితే, ఉపసంహరణకు కారణాన్ని కంపెనీ తెలియజేయలేదని గౌతం చెప్పారు. జమ్మూ ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ జరుగుతున్న సమయంలో ఇండిగో ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. 



You may be interested

ఐపీఓకు ఇది సరైన సమయం కాదు

Thursday 6th September 2018

న్యూఢిల్లీ: ఓఎన్‌జీసీ విదేశ్‌ లిమిటెడ్‌(ఓవీఎల్‌)ను స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌ చేయడానికి ఇది సరైన సమయం కాదని ఓవీఎల్‌ ఉన్నతాధికారొకరు పేర్కొన్నారు. మొజాంబిక్‌, ఇరాన్‌ల్లోని భారీ చమురు క్షేత్రాల్లో 2022 నుంచి ఉత్పత్తి చేయడం ఆరంభిస్తామని, అప్పుడైతే, మంచి విలువ వస్తుందని, స్టాక్‌ మార్కెట్లో లిస్టింగ్‌కు అదే సరైన సమయమని ఆయన వివరించారు.  ఈ విషయాన్ని ఇంకా ప్రభుత్వానికి నివేదించలేదని, థర్డ్‌ పార్టీ ఎనాలసిస్‌ పూర్తయిన తర్వాత ప్రభుత్వానికి అన్ని విషయాలు

ఐపీఓకు ఏంజెల్‌ బ్రోకింగ్‌ !

Thursday 6th September 2018

న్యూఢిల్లీ: ప్రముఖ షేర్‌ బ్రోకరేజ్‌ కంపెనీ, ఏంజెల్‌ బ్రోకింగ్‌ త్వరలో ఐపీఓ(ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌)కు రానున్నది. ఐపీఓ సంబంధిత పత్రాలను ఈ కంపెనీ ఇటీవలనే మార్కెట్‌ నియంత్రణ సంస్థ, సెబీకి సమర్పించింది. ఈ ఐపీఓలో భాగంగా రూ.300 కోట్ల విలువైన తాజా ఈక్విటీ షేర్లను జారీ చేస్తారు. వీటితో పాటు ఇంతే విలువ గల ప్రమోటర్ల షేర్లను ఆఫర్‌ ఫర్‌ సేల్‌(ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ఆఫర్‌ చేస్తారు. మొత్తం మీద ఈ

Most from this category