STOCKS

News


లిస్టెడ్ ఎయిర్‌లైన్స్‌కు రేటింగ్‌ సెగ

Wednesday 24th October 2018
news_main1540360774.png-21431

న్యూఢిల్లీ: పెరిగిపోతున్న వ్యయాలు లిస్టెడ్ విమానయాన సంస్థలకు రేటింగ్‌పరమైన తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయి. ఇండిగో, జెట్ ఎయిర్‌వేస్‌, స్పైస్‌జెట్‌ సంస్థల రుణాలను వివిధ రేటింగ్ సంస్థలు అక్టోబర్‌లో కుదించాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ (ఇండిగో) పొందిన దాదాపు రూ. 8,000 కోట్ల విలువ చేసే బ్యాంక్ ఫెసిలిటీస్‌ దీర్ఘకాలిక రేటింగ్‌ను అక్టోబర్ 17న ఇక్రా కుదించింది. స్వల్పకాలిక రేటింగ్‌ను యథాతథంగానే కొనసాగించింది. అటు నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడం, ఇటు వాటిని తట్టుకునేందుకు విమాన చార్జీలను పెంచలేని పరిస్థితి ఉండటం వంటివి ఇండిగో సహా ఎయిర్‌లైన్స్‌ రేటింగ్స్‌పై ప్రతికూల ప్రభావం చూపుతున్నట్లు ఇక్రా పేర్కొంది. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న జెట్ ఎయిర్‌వేస్‌ రుణాల దీర్ఘకాలిక రేటింగ్‌ను కూడా ఇక్రా డౌన్‌గ్రేడ్ చేసింది. నిధుల సమీకరణలో జాప్యాలు కంపెనీ ఆర్థిక పరిస్థితులపై ఒత్తిళ్లు పెంచుతున్నాయని పేర్కొంది. మరోవైపు, మధ్యకాలికంగా నిర్వహణ పనితీరుపై ఒత్తిళ్లు కొనసాగుతాయనే కారణంతో స్పైస్‌జెట్ బ్యాంక్ ఫెసిలిటీస్ రేటింగ్స్‌ను అక్టోబర్ 9న క్రిసిల్ డౌన్‌గ్రేడ్ చేసింది. 2018 మార్చి ఆఖరు నాటికి స్పైస్‌జెట్ వద్ద రూ. 248 కోట్ల నగదు, బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ గణనీయంగా పడిపోవడం, విమాన ఇంధనం ధరలు (ఏటీఎఫ్‌) 34 శాతం మేర ఎగియడం మొదలైనవి ఈ ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఎయిర్‌లైన్స్ నిర్వహణ వ్యయాలు భారీగా పెరిగిపోవడానికి కారణమయ్యాయని ఇక్రా వివరించింది. విమానయాన సంస్థల నిర్వహణ వ్యయాల్లో దాదాపు 40 శాతం ఏటీఎఫ్‌దే ఉంటుంది.



You may be interested

ఎన్‌పీఏల నుంచి ఎన్‌బీఎఫ్‌సీల వరకూ...

Wednesday 24th October 2018

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా బోర్డ్‌ మంగళవారం పలు కీలక అంశాలను సమీక్షించింది. మొండిబకాయిలు (ఎన్‌పీఏ) సహా బ్యాంకింగ్‌ రంగం ఎదుర్కొంటున్న సవాళ్లను, ఐఎల్‌అండ్‌ఎఫ్‌ఎస్‌ గ్రూప్‌లో సంక్షోభం నేపథ్యంలో ఎన్‌బీఎఫ్‌సీలు ఎదుర్కొంటున్న లిక్విడిటీ సమస్యలను కూడా 18 మంది సభ్యుల బోర్డ్‌ సమావేశం చర్చించింది. గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌, ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి ఎస్‌సీ గార్గ్‌, ఆర్థిక సేవల కార్యదర్శి రాజీవ్‌కుమార్‌సహా  బోర్డ్‌లోని  పలువురు సమావేశంలో పాల్గొన్నారు. నవంబర్‌

ఎన్‌బీసీసీ-హెచ్‌ఎస్‌ఎస్‌సీ డీల్‌కు సీసీఐ పచ్చజెండా

Wednesday 24th October 2018

 న్యూఢిల్లీ: కన్సల్టెన్సీ సంస్థ హెచ్‌ఎస్‌సీసీలో నూరు శాతం వాటా కొనుగోలుకు సంబంధించి ప్రభుత్వరంగ నిర్మాణ సంస్థ ఎన్‌బీసీసీ ప్రతిపాదనకు కాంపిటిషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) అనుమతినిచ్చింది. అలాగే, హైదరాబాద్‌కు చెందిన జెమిని ఎడిబుల్స్‌ అండ్‌ ఫ్యాట్స్‌ ఇండియాలో  (జీఈఎఫ్‌ ఇండియా) 25 శాతం వాటా కొనుగోలు చేసేందుకు సింగపూర్‌కు చెందిన బ్లాక్‌ రివర్‌ ఫుడ్‌కు అనుమతి మంజూరు చేసింది. సీఎల్‌పీ ఇండియాలో వాటాలను సొంతం చేసుకునేందుకు సీడీపీక్యూ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌

Most from this category