STOCKS

News


'ఇండిగో'కు ఇంధన ధరల సెగ..

Thursday 24th January 2019
news_main1548303923.png-23767

- క్యూ3లో లాభం 75 శాతం డౌన్‌

న్యూఢిల్లీ: ఇంధన ధరలు పెరిగిపోవడం, కరెన్సీ మారకం విలువ తగ్గడం విమానయాన సంస్థ ఇండిగో లాభాలపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇండిగో మాతృసంస్థ ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్ నికర లాభం ఏకంగా 75 శాతం క్షీణించి రూ.191 కోట్లకు పడిపోయింది. 2017-18 క్యూ3లో ఇండిగో రూ.762 కోట్ల లాభాన్ని నమోదు చేసింది. సమీక్షా కాలంలో ఇండిగో మొత్తం ఆదాయం మాత్రం 28 శాతం పెరిగి రూ.6,409 కోట్ల నుంచి రూ.8,229 కోట్లకు చేరుకుంది. అధిక ఇంధన ధరలు, కరెన్సీ పతనం తదితర అంశాలు లాభదాయకతపై ప్రతికూల ప్రభావం చూపాయని కంపెనీ పేర్కొంది. క్లిష్ట పరిస్థితుల్లోనూ లాభాలు సాధించగలిగామని, మూడో త్రైమాసికంలో వారానికో విమానాన్ని సమకూర్చుకున్నామని ఇండిగో సహ వ్యవస్థాపకుడు, తాత్కాలిక సీఈవో రాహుల్ భాటియా తెలిపారు.



You may be interested

‘ఇంటి’ని చక్కదిద్దరూ..!

Thursday 24th January 2019

- ఎన్నో రియల్టీ ప్రాజెక్టులు నిలిచిపోయాయి - పూర్తి చేయటంలో జోక్యం చేసుకోండి - రూ.2,000 కోట్లతో నిధిని ఏర్పాటు చేయండి - ఈ బడ్జెట్‌లో ఇళ్ల నిర్మాణానికి ప్రాధాన్యమివ్వండి - కేంద్రాన్ని కోరిన ‘నారెడ్కో’ న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌లో తమ డిమాండ్లకు చోటు కల్పించాలని పలు రంగాల నుంచి కేంద్ర ప్రభుత్వానికి అభ్యర్థనలు వస్తున్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ఎన్నో ప్రాజెక్టులు నిలిచిపోయిన పరిస్థితి ఉంది. మరోవైపు ఈఎంఐలు చెల్లిస్తూ ఇంటి స్వాధీనం కోసం కొనుగోలుదారులు

మార్కెట్లోకి నూతన ‘వ్యాగన్‌ఆర్‌’

Thursday 24th January 2019

న్యూఢిల్లీ: మారుతీ సుజుకీ ఇండియా (ఎంఎస్ఐ).. తన వ్యాగన్‌-ఆర్‌ శ్రేణిలో నూతన వెర్షన్‌ను బుధవారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఈ కారును ‘బిగ్ న్యూ వ్యాగన్ఆర్’గా అభివర్ణించిన సంస్థ.. 1.2 లీటర్ల పెట్రోల్‌ ఇంజిన్‌తో పాటు మరో ఆప్షన్లో భాగంగా 1-లీటర్ ఇంజిన్‌ను కూడా అందుబాటులో ఉంచింది. 1.2 లీటర్‌ ఇంజిన్‌ కారు ధరల శ్రేణి రూ.4.89లక్షలు–రూ.5.69 లక్షలు. 1-లీటర్ ఇంజిన్‌ ధరల శ్రేణి రూ.4.19 లక్షలు–రూ.4.69 లక్షలు కాగా, ఈ

Most from this category