STOCKS

News


ఇండిగో నష్టాలు రూ.652 కోట్లు

Thursday 25th October 2018
news_main1540445454.png-21464

న్యూఢిల్లీ: విమానయాన సంస్థ,  ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ (ఇండిగో) కంపెనీకి ఈ ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.652 కోట్ల నికర నష్టాలొచ్చాయి. వ్యయాలు అధికం కావడం, పోటీ తీవ్రమవడం, డాలర్‌తో రూపాయి మారకం భారీగా క్షీణించడం తదితర కారణాల వల్ల ఈ స్థాయిలో నికర నష్టాలొచ్చాయని ఇంటర్‌గ్లోబ్‌ ఏవియేషన్‌ తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో రూ.552 కోట్ల నికర లాభం వచ్చిందని ఇండిగో వ్యవస్థాపకుల్లో ఒకరు, తాత్కాలిక సీఈఓగా కూడా వ్యవహరిస్తున్న రాహుల్‌ భాటియా తెలిపారు.  కాగా ఈ కంపెనీ స్టాక్‌మార్కెట్లో లిస్టయినప్పటినుంచి (2015, నవంబర్‌) చూస్తే, నష్టాలు రావడం ఇదే తొలిసారి.
గత క్యూ2లో రూ.5,506 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో 18 శాతం పెరిగి రూ.6,514 కోట్లకు చేరుకుంది. మొత్తం వ్యయాలు 58 శాతం పెరిగి రూ.7,502 కోట్లకు చేరాయి. ఇంధన వ్యయాలు రూ.1,647 కోట్ల నుంచి ఏకంగా 84 శాతం ఎగసి రూ.3,036 కోట్లకు చేరుకున్నట్లు భాటియా తెలియజేశారు. ఎబిటా రూ.1,581 కోట్ల నుంచి 86 శాతం తగ్గి రూ.220 కోట్లకు తగ్గింది. ఎబిటా మార్జిన్‌ 29.9 శాతం నుంచి 3.6 శాతానికి పడిపోయింది. పలు సమస్యలున్నప్పటికీ, మంచి స్థాయిలోనే ఉన్నామని భాటియా పేర్కొన్నారు. కంపెనీ ఆస్తి అప్పుల పట్టీ పటిష్టంగా ఉందని, తమ కంపెనీ చౌక ధరల విధానం దీనికి కారణమని వెల్లడించారు. 



You may be interested

పెరిగిన వ్యాపార విశ్వసనీయత

Thursday 25th October 2018

న్యూఢిల్లీ: భారత వ్యాపార విశ్వసనీయత అక్టోబర్‌–డిసెంబర్‌ కాలానికి స్వల్పంగా పెరిగింది. ఈకాలంలో డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్ కాంపోజిట్ బిజినెస్‌ ఆప్టిమిసమ్‌ ఇండెక్స్‌ 3.6 శాతం వృద్ధి చెంది 79.5 శాతానికి చేరింది. ప్రస్తుతం కొనసాగుతున్నది పండుగల సీజన్‌ కావడం, కరీఫ్‌ పంటకు కనీస మద్ధతు ధర పెరగడం, 7వ వేతన సంఘం సిఫార్సులు అమలుకావడం వంటి సానుకూల అంశాల నేపథ్యంలో వ్యాపారంపై విశ్వసనీయత పెరిగినట్లు డన్‌ అండ్‌ బ్రాడ్‌స్ట్రీట్ ఇండియా

జైడస్‌ చేతికి హెంజ్‌ ఇండియా

Thursday 25th October 2018

న్యూఢిల్లీ: కన్జూమర్ ఉత్పత్తుల సంస్థ జైడస్ వెల్‌నెస్ తాజాగా హెంజ్‌ ఇండియాను కొనుగోలు చేయనుంది. క్యాడిలా హెల్త్‌కేర్‌తో కలిసి ఈ డీల్‌ కుదుర్చుకోనున్నట్లు బుధవారం ప్రకటించింది. ఈ ఒప్పందం విలువ సుమారు రూ. 4,595 కోట్లు. హెంజ్‌ ఇండియా కొనుగోలుతో ఎనర్జీ డ్రింక్ గ్లూకోన్‌-డీ, టాల్కం పౌడర్ బ్రాండ్ నైసిల్‌, నెయ్యి బ్రాండ్‌ సంప్రీతి మొదలైనవి తమ పోర్ట్‌ఫోలియోలోకి చేరనున్నట్లు జైడస్‌, క్యాడిలా సంస్థలు విడివిడిగా స్టాక్‌ ఎక్స్చేంజీలకు తెలియజేశాయి.

Most from this category