STOCKS

News


రూ.1,212కే విమాన టికెట్‌: ఇండిగో

Tuesday 10th July 2018
news_main1531239102.png-18180

ముంబై: ప్రముఖ విమానయాన సంస్థ ‘ఇండిగో’ తాజాగా ‘మెగా వార్షికోత్సవ సేల్‌’ పేరుతో టికెట్‌ ధరల డిస్కౌంట్‌ ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా టికెట్లను రూ.1,212 ధర నుంచి అందిస్తోంది. మంగళవారం నుంచి మూడు రోజులపాటు (జూలై 10 నుంచి 13 వరకు) అందుబాటులో ఉండనున్న ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లను బుక్‌ చేసుకున్నవారు ఈ ఏడాది జూలై 25 నుంచి వచ్చే ఏడాది మార్చి 30 మధ్య ఎప్పుడైనా ప్రయాణించ్చొని కంపెనీ తెలిపింది. మెగా వార్షికోత్సవ సేల్‌లో భాగంగా ప్రయాణికుల కోసం 12 లక్షల సీట్లను అందుబాటులో ఉంచుతున్నట్లు పేర్కొంది. ‘ఆగస్ట్‌ 4న సంస్థ కార్యకలాపాలు ప్రారంభించి 12 సంవత్సరాలు అవుతుంది. అందుకే 12 లక్షల సీట్లతో మెగా సేల్‌ను ప్రకటించాం’ అని ఇండిగో చీఫ్‌ స్ట్రాటజీ ఆఫీసర్‌ విలియమ్‌ బౌల్టర్‌ తెలిపారు. 



You may be interested

భార్య, కుమార్తెలకు బహమతులపై పన్ను వద్దు

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: భార్య, కుమార్తెలకు ఇచ్చే బహుమతులపై గిఫ్ట్‌ ట్యాక్స్‌ వేయవద్దని కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖా మంత్రి మేనకాగాంధీ కోరారు. ఇందుకు సంబంధించి చట్ట సవరణలు చేసే అంశాన్ని పరిశీలించాలని కేంద్ర ఆర్థిక మంత్రి పీయూష్‌ గోయల్‌కు సూచించారు. ‘‘ఓ సమాజంగా మహిళల ఆర్థిక సాధికారతకు భరోసానివ్వాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 64ను తగిన విధంగా సవరించడాన్ని పరిశీలించాలని ఆర్థిక మంత్రిని కోరుతున్నాను’’ అని

ఐడీబీఐ బ్యాంకులో వాటా వద్దు

Tuesday 10th July 2018

న్యూఢిల్లీ: ఆర్థిక సమస్యల్లో ఉన్న ప్రభుత్వరంగ ఐడీబీఐ బ్యాంకులో 51 శాతం వాటా కొనుగోలుకు ఎల్‌ఐసీ తీసుకున్న నిర్ణయాన్ని ఆ సంస్థ ఉద్యోగులు వ్యతిరేకించారు. ఇది పాలసీదారుల ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో గతంలో ఎల్‌ఐసీ పెట్టుబడుల పనితీరును ఉదహరిస్తూ... ఈ బ్యాంకుల విలువ చెప్పుకోతగ్గ స్థాయిలో తుడిచిపెట్టుకు పోయిందని, అది తమ లాభాలపైనా ప్రభావం చూపుతుందని ఎల్‌ఐసీ క్లాస్‌-1

Most from this category