STOCKS

News


ఢిల్లీ-ఇస్తాంబుల్ మధ్య ఇండిగో సర్వీస్‌

Friday 22nd March 2019
news_main1553238793.png-24750

- 222 సీట్లతో ఏ321నియో విమానం

ఇస్తాంబుల్: చౌక ధరల విమానయాన సంస్థ ఇండిగో.. ఢిల్లీ-ఇస్తాంబుల్ మధ్య నూతన సర్వీసును ప్రారంభించింది. టర్కీలోని ఈ నగరానికి 222 సీట్లు కలిగిన ఏ321నియో విమానాన్ని కేటాయించింది. ఢిల్లీ నుంచి ఇస్తాంబుల్ చేరుకోవడానికి సాధారణంగా ఏడు గంటల సమయం పట్టనుండగా.. పాకిస్తాన్‌ ఎయిర్‌స్పేస్‌ మూసివేసిన కారణంగా ప్రస్తుతానికి పదకొండు గంటల సమయం పడుతుందని సంస్థ ఇండిగో చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియమ్ బౌల్టర్ తెలిపారు. ఇంధనం నింపుకునేందుకు దోహాలో ఆగినందున ప్రయాణ సమయం పెరిగినట్లు వెల్లడించారు. ఇక ఆరు నూతన సర్వీసులను ప్రారంభించేందుకు తమకు ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని.. వచ్చే కొద్దివారాల్లోనే మిగిలిన రూట్లను ప్రకటిస్తామని చెప్పారయన. ఆగ్నేయ ఆసియా, చైనా సర్వీసులపై మరింత దృష్టిసారించినట్లు వెల్లడించారు. విమానయాన సేవల్లో 40 శాతం మార్కెట్‌ వాటాను కలిగిన ఈ సంస్థ.. మరో 125 ఏ321నియో విమానాలను జోడించాలని భావిస్తోంది. ఈ ఏడాదిలోనే ఎయిర్‌బస్‌ నుంచి 20 నుంచి 25 వరకు విమానాలను పొందేవీలుంది.



You may be interested

‘కేటీఎమ్‌’లో వాటా విక్రయించనున్న బజాజ్‌ ఆటో

Friday 22nd March 2019

జూన్‌ కల్లా లావాదేవీ పూర్తి !  న్యూఢిల్లీ: ఆస్ట్రియా మోటార్‌ సైకిల్‌ కంపెనీ, కేటీఎమ్‌ ఏజీలో బజాజ్‌ ఆటోకు ఉన్న 48 శాతం వాటా చేతులు మారనున్నది. ఈ వాటాను కేటీఎమ్‌ ఏజీ మాతృ కంపెనీ, కేటీఎమ్‌ ఇండస్ట్రీస్‌లో అధిక (62 శాతం)వాటా ఉన్న పియరర్‌ ఇండస్ట్రీ ఏజీకి బజాజ్‌ ఆటో విక్రయించనున్నది. ఈ మేరకు పియరర్‌ ఇండస్ట్రీ ఏజీకి, బజాజ్‌ ఆటో కంపెనీల మధ్య సంప్రదింపులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించిన

ఈ నెల 26న మైండ్‌ ట్రీ బోర్డ్‌ సమావేశం

Friday 22nd March 2019

న్యూఢిల్లీ: మైండ్‌ ట్రీ కంపెనీ డైరెక్టర్ల బోర్డ్‌ సమావేశం ఈ నెల 26న మరోసారి జరగనున్నది. బుధవారం జరిగిన సమావేశంలో షేర్ల బైబ్యాక్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోయిన డైరెక్టర్ల బోర్డ్‌ ఈ నెల 26న మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ కంపెనీని ఎల్‌ అంట్‌టీ బలవంతంగా టేకోవర్‌ చేయాలని ప్రయత్నాలు చేస్తోన్న విషయం తెలిసిందే. మైండ్‌ ట్రీ కంపెనీలో 66 శాతం వాటాను రూ.10,800 కోట్లకు కొనుగోలు చేయడానికి

Most from this category