STOCKS

News


భారత్‌కు పెట్టుబడులు, వినియోగం దన్ను!

Tuesday 9th April 2019
news_main1554792762.png-25025

- 2019-20లో వృద్ధి 7.5 శాతం
-  ప్రపంచబ్యాంక్‌ నివేదిక

వాషింగ్టన్‌: భారత్‌ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) 7.5 శాతంగా నమోదవుతుందని ప్రపంచబ్యాంక్‌ తాజా నివేదిక ఒకటి పేర్కొంది. దేశంలో పెట్టుబడుల పరిస్థితి పటిష్టం అవుతోందని,  ఎగుమతులు మెరుగుపడుతున్నాయని, వినియోగ పరిస్థితులు బాగున్నాయని ప్రపంచబ్యాంక్‌ ఈ నివేదికలో పేర్కొంది. రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాసహా పలు ఆర్థిక సంస్థలతో అంచనాలతో పోల్చితే, ప్రపంచబ్యాంక్‌ ప్రస్తుత వృద్ధి అంచనాలు అధికంగా ఉండడం గమనార్హం. త్వరలో జరగనున్న ప్రపంచబ్యాంక్‌, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) స్పింగ్‌ సమావేశాల నేపథ్యంలో విడుదలైన తాజా నివేదికలో  ముఖ్యాంశాలు చూస్తే...

- 2018-2019లో భారత్‌ వృద్ధి రేటు 7.2 శాతంగా అంచనా. ఇది మరింత మెరుగుపడుతుందనడానికి స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి. 
- 2018-19 మొదటి మూడు త్రైమాసిక గణాంకాలను (ఏప్రిల్‌-డిసెంబర్‌) పరిశీలిస్తే, వృద్ధి ఏ ఒక్క రంగానికే పరిమితం కాకుండా, విస్తృత ప్రాతిపదికన ఉంది. సేవల రంగం కొంత తగ్గినా, పారిశ్రామిక వృద్ధిరేటు మాత్రం 7.9 శాతంగా ఉంది. 
 - వ్యవసాయ రంగం 4 శాతం వృద్ధి మంచి ఫలితమే.
- డిమాండ్‌ కోణంలో చూస్తే, దేశీయ వినియోగం వృద్ధి పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తోంది. పెట్టుబడులు, ఎగుమతుల వృద్ధి ధోరణి కూడా బాగుంది. మూడవ త్రైమాసికంలో చూస్తే, పలు రంగాల్లో సమతౌల్యమైన డిమాండ్‌, వృద్ధి పరిస్థితులు కనిపించాయి. 
- గడచిన ఆర్థిక సంవత్సరం (2018-19) ద్రవ్యోల్బణం పరిస్థితులు పూర్తి సానుకూలంగా ఉన్నాయి. ఆహార ఉత్పత్తుల ధరలు అందుబాటులో ఉన్నాయి. ద్రవ్యోల్బణం రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) నిర్దేశిత లక్ష్యాలకు అనుగుణంగా 4 శాతంలోపే ఉంటుందని భావించడం జరుగుతోంది. 
- దేశంలోకి వచ్చీ-పోయే విదేశీ మారకద్రవ్య మధ్య నికర వ్యత్యాసం- కరెంట్‌ అకౌంట్‌లోటు, అలాగే ప్రభుత్వ ఆదాయాలు-వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం- ద్రవ్యలోటు అదుపులోనే ఉన్నాయి. ఎగుమతులు పెరుగుతుండడం, తక్కువ చమురు దిగుమతుల వల్ల దేశానికి తగ్గే చమురు బిల్లు భారం కరెంట్‌ అకౌంట్‌ లోటును 1.9 శాతానికి (2019-20 జీడీపీ విలువలో) కట్టడిచేసే అవకాశంఉంది. అలాగే ద్రవ్యలోటు 3.4 శాతానికి దాటకపోవచ్చు. 
- అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగే అవకాశాలు లేకపోవడం,  దేశానికి వస్తున్న భారీ విదేశీ మారకద్రవ్యం వెరసి డాలర్‌ మారకంలో రూపాయి విలువను పెంచుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణాన్ని కూడా కట్టడి చేసే అంశం. ఆయా అంశాలు వృద్ధి క్రియాశీలతకు తోడ్పోటునిచ్చేలా ఆర్‌బీఐ రెపో రేటు కోత (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు- ప్రస్తుతం 6.25 శాతం)కు తోడ్పాటునిస్తోంది. 
-----------
2019-20 వృద్ధి రేటుపై అంచనా (శాతాల్లో)
--------
ఆర్‌బీఐ         7.2 
ఏడీబీ         7.2 
ప్రపంచబ్యాంక్‌     7.5 
ఐఎంఎఫ్‌        6.8 
ఫిచ్‌         6.8 

 



You may be interested

ఇక షేర్లన్నీ డీమ్యాట్‌లోనే..!!

Tuesday 9th April 2019

ఇక షేర్లన్నీ డీమ్యాట్‌లోనే..!! లిస్టెడ్‌ కంపెనీల్లో ఇంకా భారీగానే ఫిజికల్‌ షేర్లు 98.6 శాతం కంపెనీల్లో ఈ రకమైన వాటాదారులు ఫిజికల్‌ రూపంలో వాటాలను బదిలీ చేసుకోవడం ఇక అసాధ్యం మరొకరికి బదిలీ చేసుకోవాలంటే డీమ్యాట్‌లోనే న్యూఢిల్లీ: కాగితం రూపంలో ఉన్న ఫిజికల్‌ షేర్ల పట్ల వాటాదారుల్లో ఇప్పటికీ మమకారం పోలేదు.! లిస్టెడ్‌ కంపెనీల్లో 98.6 శాతం కంపెనీలకు ఫిజికల్‌ షేర్‌ సర్టిఫికెట్‌ కలిగిన వాటాదారులు ఉన్నట్టు గణాంకాలను పరిశీలిస్తే తెలుస్తోంది. డిజిటల్‌ రూపంలోకి షేర్లను మార్చుకునే

జెట్ విక్రయం షురూ!!

Tuesday 9th April 2019

- బిడ్స్‌ ఆహ్వానిస్తూ ఎస్‌బీఐ ప్రకటన - సమర్పించడానికి ఆఖరు తేది ఏప్రిల్‌ 10 - 31.2 శాతం - 75 శాతం దాకా వాటాల విక్రయం - లుఫ్తాన్సా, సింగపూర్‌ ఎయిర్‌లైన్స్‌ ఆసక్తి ముంబై, న్యూఢిల్లీ: తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న ప్రైవేట్‌ రంగ జెట్‌ ఎయిర్‌వేస్‌ విక్రయ ప్రక్రియ ప్రారంభమైంది. ఇందుకు సంబంధించి జెట్‌ ఎయిర్‌వేస్‌కు రుణాలిచ్చిన బ్యాంకుల కన్సార్షియం తరఫున బిడ్లను ఆహ్వానిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌

Most from this category