STOCKS

News


భారత్‌ ఎగుమతులు బాగున్నాయి

Thursday 27th December 2018
news_main1545884071.png-23254

 అయితే పూర్తి సంతృప్తి లేదు
 - వాణిజ్య మంత్రి సురేశ్‌ ప్రభు వ్యాఖ్య

న్యూఢిల్లీ: భారత్‌ ఎగుమతులు గడచిన 14 నెలల్లో చాలా బాగున్నాయని వాణిజ్యశాఖ మంత్రి సురేశ్‌ ప్రభు బుధవారం చెప్పారు. అయితే పూర్తి సంతృప్తి మాత్రం లేదన్నారు. ఎగుమతుల పెంపునకు భారత్‌ ప్రత్యేక వ్యూహాన్ని సిద్ధం చేస్తోందని మంత్రి తెలిపారు. 2019లో పటిష్ఠ వృద్ధి సాధించడానికి ఎగుమతులే ప్రధాన వనరుగా ఉండాలన్నది ఈ వ్యూహం లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా లాటిన్‌ అమెరికా, ఆఫ్రికా ఖండంపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. రక్షణాత్మకవాదం, మందగమనం, వాణిజ్య యుద్ధం, దిగుమతి సుంకాలుసహా ప్రపంచవ్యాప్తంగా పలు ప్రతికూలతలు నెలకొన్నప్పటికీ,  దేశ ఎగుమతులు పెరుగుతుండడం గమనార్హమని మంత్రి పేర్కొన్నారు. 2011-12 నుంచి భారత్‌ ఎగుమతుల విలువ దాదాపు 300 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2017-18లో 10 శాతం వృద్ధితో 303 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఇటీవల ప్రకటించిన వ్యవసాయ ఆధారిత ఎగుమతుల విధానం భవిష్యత్తులో మంచి ప్రయోజనాలను చేకూర్చుతుందన్న విశ్వాసాన్ని మంత్రి వ్యక్తం చేశారు. దీనివల్ల వచ్చే ఐదేళ్లలో ఈ రంగం నుంచి ఎగుమతులు 60 బిలియన్‌ డాలర్లకు, పదేళ్లలో 100 బిలియన్‌ డాలర్లకు పెరుగుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ విలువ దాదాపు 30 బిలియన్‌ డాలర్లు.
అల్యూమినియంపై దిగుమతి సుంకం పెంపు!
అల్యూమినియంపై దిగుమతి సుంకాల పెంపునకు కేంద్రం సానుకూలంగా ఉంది. దేశయ పరిశ్రమ, తయారీ ప్రయోజనాల పరిరక్షణే లక్ష్యంగా ఈ ఆలోచన చేస్తున్నట్లు వాణిజ్యశాఖ మంత్రి  పేర్కొన్నారు. ఈ కమోడిటీ భారీ దిగుమతులపై అల్యూమినియం పరిశ్రమ నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం అల్యూమినియం స్ర్కాప్‌పై బేసిక్‌ కస్టమ్స్‌ సుంకం 2.5 శాతంగా ఉంది, ప్రైమరీ అల్యూమినియంపై 7.5 శాతంగా ఉంది. రెండింటిపై ఈ సుంకాన్ని 10 శాతానికి పెంచాలని పరిశ్రమ నుంచి డిమాండ్‌ వస్తోంది. దీనితోపాటు ఈ కమెడిటీ దిగుమతిపై కనీస దిగుమతి ధర, దిగుమతులపై కోటా నిర్దేశం వంటి మరికొన్ని పరిమితులూ విధించాలని దేశీయ పరిశ్రమ డిమాండ్‌ చేస్తోంది. భారత్‌లో అల్యూమినియం వార్షిక ఉత్పత్తి  4 మిలియన్‌ టన్నులు. వినియోగం 3.6 మిలియన్‌ టన్నులు. కాగా ముడి ఇనుముపై ఎగుమతి సుంకం కోత ప్రతిపాదనపై సురేశ్‌ ప్రభు స్పందిస్తూ, దీనిపై స్టీల్‌, మైన్స్‌ మంత్రిత్వ శాఖల అభిప్రాయాన్ని వాణిజ్య మంత్రిత్వ శాఖ కోరినట్లు తెలిపారు. దేశీయ పరిశ్రమ వృద్ధికి ప్రభుత్వం తగిన చర్యలన్నింటినీ తీసుకుంటుందని మంత్రి తెలిపారు.You may be interested

బ్యాంకుల్లో మోసాల నివారణకు సీవీసీ చర్యలు

Thursday 27th December 2018

ఆడిట్‌ నివేదికల తనిఖీ దిద్దుబాటు చర్యల సూచన న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు, బీమా కంపెనీల్లో మోసాల నివారణకు కేంద్ర స్థాయిలో అవినీతి నిరోధక సంస్థ సెంట్రల్‌ విజిలెన్స్‌ కమిషన్‌ (సీవీసీ) రంగంలోకి దిగింది. ఆయా సంస్థల ఆడిట్‌ నివేదికలను తనిఖీ చేయడంతోపాటు మోసాల నివారణకు దిద్దుబాటు చర్యలను కూడా సూచించనుంది. ప్రభుత్వ రంగ బ్యాంకులు పెద్ద ఎత్తున మోసాల ఘటనలను రిపోర్ట్‌ చేస్తుండడం, మొండి బకాయిలు భారీ స్థాయిలో ఉన్న నేపథ్యంలో సీవీసీ

31 రాత్రి విడిది రూ.11 లక్షలు

Thursday 27th December 2018

న్యూఢిల్లీ: కొత్త సంవత్సర సంబరాల నేపథ్యంలో హోటళ్లు, రిసార్ట్‌లలో ఛార్జీలకు రెక్కలొచ్చేశాయి. ముఖ్యంగా రాజస్థాన్‌లోని హోటళ్లు టారిఫ్‌ల పండుగ చేసుకుంటున్నాయి. ఈ నెల 31వ తేదీ కోసం రాజస్థాన్‌లోని లగ్జరీ హోటళ్లు రూ.11 లక్షల వరకు వసూలు చేస్తుండడం డిమాండ్‌ను తెలియజేస్తోంది. సంపన్నులు ఖరీదైన హోటళ్లలో వేడుకలకు ఆసక్తి చూపిస్తుండడం హోటళ్లకు కలిసొస్తోంది. జోధ్‌పూర్‌లోని ఉమైద్‌ భవన్‌ డిసెంబర్‌ 31న సూట్‌ కోసం రూ.11,03 లక్షలను చార్జ్‌ చేస్తోంది. ఉదయ్‌పూర్‌లోని

Most from this category