STOCKS

News


2022 నాటికి రూ.7,00,000 కోట్లు

Saturday 8th September 2018
news_main1536381042.png-20079

హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: భారత్‌లో ఈ-కామర్స్‌ వ్యాపారం 2022 నాటికి రూ.7,00,000 కోట్లకు చేరుతుందని నాస్కాం-పీడబ్ల్యుసీ నివేదిక చెబుతోంది. ‘ప్రపంచ నాయకత్వం దిశగా భారత ఈ-కామర్స్‌’ పేరుతో రూపొందించిన ఈ నివేదిక ప్రకారం... ‘‘ప్రస్తుతం దేశంలో ఈ-కామర్స్‌ మార్కెట్‌ పరిమాణం రూ.2,45,000 కోట్లు. వచ్చే అయిదేళ్లు పరిశ్రమ ఏటా 25 శాతం వృద్ధి చెందుతుంది. ఈ-టైల్‌, ఈ-ట్రావెల్‌ వాటా 90 శాతం పైగా ఉంటుంది. ఆన్‌లైన్‌ ఫైనాన్సియల్‌ సర్వీసులు వేగంగా వృద్ధి చెందుతాయి. 2 కోట్ల చిన్న, మధ్యతరహా కంపెనీలు, వర్తకులకు ఈ-కామర్స్‌ రంగం వెన్నుదన్నుగా ఉంటుంది. 2023 నాటికి ఈ-కామర్స్‌ విపణి 10 లక్షల ఉద్యోగాలను సృష్టిస్తుంది. లాజిస్టిక్స్‌, వేర్‌హౌస్‌ తదితర విభాగాల్లో ఈ ఉద్యోగాలు ఉంటాయి’’ అని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేవయాని ఘోష్‌ తెలిపారు.
చిన్న పట్టణాల నుంచే..
2022 కల్లా ఇంటర్నెట్‌ వినియోగదారుల సంఖ్య ప్రస్తుతమున్న 45 కోట్ల నుంచి 85 కోట్లకు చేరుతుందని నివేదిక తెలియజేసింది. యువ కస్టమర్లు, చవక ధరలో డేటా, ఆన్‌లైన్‌ కస్టమర్ల సంఖ్య పెరుగుతుండడంతో ఈ-కామర్స్‌ రంగంలో అనూహ్య వృద్ధి ఉంటుందని కూడా వెల్లడించింది. కస్టమర్‌ ఎక్స్‌పీరియెన్స్‌పై కంపెనీలు ఎక్కువగా ఫోకస్‌ చేస్తున్నట్లు పీడబ్ల్యుసీ పార్ట్‌నర్‌ సందీప్‌ లడ్డా వ్యాఖ్యానించారు.



You may be interested

ఎస్‌ఎంఎల్‌ ఇసుజు నుంచి గ్లోబల్ సిరీస్ ట్రక్కులు

Saturday 8th September 2018

బెంగళూరు: వాణిజ్య వాహనాల తయారీ సంస్థ ఎస్‌ఎంఎల్‌ ఇసుజు దక్షిణ భారతదేశ మార్కెట్‌లో అత్యంత అధునాతన టెక్నాలజీతో రూపొందించిన లారీలను శుక్రవారం విడుదల చేసింది. ప్రస్తుత భాతర లారీ పరిశ్రమకు సరిగ్గా సరిపడే విధంగా గ్లోబల్ సిరీస్ (జీఎస్‌) టక్కులను ప్రవేశపెట్టినట్లు వెల్లడించిన ఈ సంస్థ.. తమ నూతన టెక్నాలజీ ద్వారా రియల్-టైమ్ వాహన ట్రాకింగ్, వ్యయ నియంత్రణ, ఉత్తమ లోడింగ్‌ సామర్థ్యం వంటి ప్రయోజనాలు ఉన్నట్లు వివరించింది. ఈ

భారత డిఫెన్స్‌లో చెక్‌ రిపబ్లిక్‌ పెట్టుబడులు..!

Saturday 8th September 2018

ప్రాగ్యూ: భారత రక్షణ తయారీ రంగంలో చెక్‌ రిపబ్లిక్‌ భారీ జాయింట్‌ వెంచర్ల ఏర్పాటుకు అవకాశం ఉందని రాష్ట్రపతి రామ్‌ నాథ్‌ కోవింద్‌ చెప్పారు. మూడు రోజుల యూరప్‌ పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. భారత డిఫెన్స్‌లో చెక్‌ రిపబ్లిక్‌ పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉందని వెల్లడించారు. ‘అధునాతన టెక్నాలజీ అందించడం, రక్షణ రంగ తయారీని బలపరిచడం వంటి అంశాలలో భారత్‌తో కలిసి పనిచేసేందుకు ఆదేశం ఆసక్తి చూపుతోంది.

Most from this category