STOCKS

News


ఎనిమిదేళ్ల కనిష్టానికి ప్యాసింజర్‌ వాహనాల విక్రయాలు

Tuesday 14th May 2019
news_main1557815665.png-25730

- ఏప్రిల్‌ అమ్మకాల్లో 17% క్షీణత న్యూఢిల్లీ: గతనెల్లో దేశీ ప్యాసింజర్‌ వాహనాల (పీవీ) విక్రయాలు 2,47,541 యూనిట్లకు పరిమితమయ్యాయి. గతేడాది (2018) ఇదేకాలానికి నమోదైన 2,98,504 యూనిట్లతో పోల్చితే 17 శాతం క్షీణత ఉన్నట్లు భారత వాహన తయారీదార్ల సంఘం (సియామ్‌) తాజాగా విడుదలచేసిన గణాంకాల్లో వెల్లడైంది. ఇది 2011 అక్టోబర్‌ నాటి కనిష్టస్థాయి కాగా, వరుసగా ఆరవ నెల్లోనూ అమ్మకాల్లో తగ్గుదలను నమోదుచేశాయి. మరోవైపు అన్ని ప్రధాన విభాగాల్లోనూ విక్రయాలు తిరోగమన బాటలోనే ప్రయాణించాయి. దేశీ కార్ల అమ్మకాలు ఏప్రిల్‌లో 19.93 శాతం తగ్గి 1,60,279 యూనిట్లుగా నిలవగా.. మోటార్‌ సైకిళ్ల అమ్మకాలు 11.81 శాతం క్షీణించి 10,84,811 యూనిట్లు (క్రితం ఏడాది ఏప్రిల్‌లో 12,30,046 యూనిట్లు)గా నమోదయ్యాయి. మొత్తం ద్విచక్ర వాహన 16.36 శాతం తగ్గి 16,38,388 యూనిట్లుగా నిలిచాయి. వాణిజ్య వాహన విక్రయాలు 5.98 శాతం తగ్గి 68,680 యూనిట్లు కాగా.. అన్ని విభాగాల్లోని వాహన అమ్మకాలు 15.93 శాతం తగ్గి గతనెల్లో 20,01,096 యూనిట్లుగా సియామ్‌ వెల్లడించింది. 2018లో ఇవి 23,80,294 యూనిట్లుగా ఉన్నాయి. ఈ అంశంపై స్పందించిన సియామ్‌ డిప్యూటీ జనరల్‌ సుగతో సేన్‌.. ‘ఈ విధంగా అన్ని విభాగాల్లోనూ అమ్మకాలు తగ్గిపోవడం గడిచిన పదేళ్లలో ఎప్పుడూ చూడలేదు’ అని వ్యాఖ్యానించారు. విక్రయాలు తగ్గుదల నమోదుకావడం అనేది కేవలం ఒక్క వాహన రంగంలోనే కాకుండా, ఇదే పరిస్థితి ఎఫ్‌ఎంసీజీ రంగంలోనూ నెలకొంది. నూతన ప్రభుత్వం ఏర్పడిన తరువాత పరిస్థితులు గాడినపడే అవకాశం ఉందని సియామ్‌ డైరెక్టర్‌ జనరల్‌ విష్ణు మాథుర్‌ విశ్వాసం వ్యక్తంచేశారు. 



You may be interested

భారతే బెస్ట్‌!

Tuesday 14th May 2019

ట్రేడ్‌ టెన్షన్లను తప్పించుకోవాలంటే ఇండియానే శరణు ఎఫ్‌ఐఐల అంచనా ఎన్నికల ఫలితాల కోసం ఎదురుచూపులు అంతర్జాతీయంగా వాణిజ్య ఉద్రిక్తతలు ముదురుతున్న సమయాన పెట్టుబడులు సురక్షితంగా ఉండేందుకు భారత ఈక్విటీలే మంచివని ఎఫ్‌ఐఐలు భావిస్తున్నాయి. అయితే ఎన్నికలు పూర్తవుతున్నందున ఫలితాలను బట్టి ప్రణాళిక రచించుకోవాలని యోచిస్తున్నాయి. ఈ నెల్లో ఎఫ్‌ఐఐలు దేశీ ఈక్విటీల్లో దాదాపు 150 కోట్ల డాలర్ల మేర పెట్టుబడులు పెట్టాయి. గత మూడు నెలల్లో విదేశీ మదుపరులు 1000 కోట్ల డాలర్లను ఇండియాలోకి

బ్యాంకుల ఫలితాలు భేష్‌!!

Tuesday 14th May 2019

ఓబీసీకి రూ.201 కోట్ల లాభం ప్రభుత్వ రంగంలోని ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌ (ఓబీసీ) మార్చి క్వార్టర్‌కు రూ.201 కోట్ల లాభాన్ని ఆర్జించింది. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో రూ.1,650 కోట్ల నష్టాన్ని చవిచూసింది. బ్యాంకు ఆదాయం రూ.4,689 కోట్ల నుంచి రూ.5,711 కోట్లకు పెరగ్గా ఆస్తుల నాణ్యత సైతం మెరుగుపడింది. బ్యాంకు స్థూల ఎన్‌పీఏలు మొత్తం రుణాల్లో క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 17.63 శాతం నుంచి

Most from this category