STOCKS

News


బంధన్‌ బ్యాంక్‌ నికర లాభం 47 శాతం వృద్ధి

Wednesday 18th July 2018
news_main1531900894.png-18437

కోల్‌కతా కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ప్రైవేట్‌ రంగ బంధన్‌ బ్యాంక్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం క్యూ1 ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 47 శాతం వృద్ధితో రూ.482 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.327 కోట్లుగా ఉంది. వడ్డీ రేటు ఆదాయం ఎక్కువగా ఉండటం ఆదాయం దీనికి కారణం. బ్యాంక్‌ మొత్తం ఆదాయం ఈ క్యూ1లో 39 శాతం వృద్ధితో రూ.1,767 కోట్లుగా నమోదయ్యింది. గత ఆర్థిక సంవత్సరపు ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ ఆదాయం రూ.1,275 కోట్లు.  జూన్‌ క్వార్టర్‌ చివరి నాటికి బ్యాంక్‌ స్థూల మొండిబకాయిలు 1.26 శాతంగా ఉన్నాయి. గత త్రైమాసికంలో ఇవి 1.25 శాతంగా నమోదయ్యాయి. ఇక గత ఆర్థిక సంవత్సరపు ఇదే త్రైమాసికంలో స్థూల మొండిబకాయిలు 0.93 శాతంగా ఉన్నాయి. 


ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో బంధన్‌ బ్యాంక్‌ షేరు 1:27 సమయంలో ఎన్‌ఎస్‌ఈలో 3.76 శాతం వృద్ధితో రూ.583.9 వద్ద ట్రేడవుతోంది. 



You may be interested

2018-19లో 18 శాతం ఎర్నింగ్స్‌ వృద్ధి!

Wednesday 18th July 2018

ఆదిత్య బిర్లా సన్‌లైఫ్‌ ఏఎంసీ ఫండ్‌మేనేజర్‌ మహేశ్‌ పాటిల్‌ ఏడాది కనిష్ఠాల నుంచి నిఫ్టీ ఇప్పటికి దాదాపు 9 శాతం ర్యాలీ చేసింది. అయితే చిన్న, సన్నకారు స్టాకులు మాత్రం ఇంకా కోలుకోలేదు. మిడ్‌, స్మాల్‌ క్యాప్‌ సూచీలు ప్రస్తుతం రికార్డు గరిష్ఠాల కన్నా దాదాపు 15- 20 శాతం దిగువన ట్రేడవుతున్నాయి. నిఫ్టీ50, నిఫ్టీ నెక్ట్స్ 50 మధ్య కూడా దాదాపు 8 శాతం వ్యత్యాసం ఉంది. ఫండ్స్‌లో గతేడాది

ఓఎన్‌జీసీ షేరు 5శాతం అప్‌

Wednesday 18th July 2018

పవన్‌హన్స్‌లో వాటా విక్రయానికి ఓఎన్‌జీసీ ఓకే..! ముంబై:- పవన్‌హన్స్‌లో వాటా విక్రయానికి ఓఎన్‌జీసీ బోర్డు ఆమోదం తెలపడంతో ఓఎన్‌జీసీ షేర్లు బుధవారం బీఎస్‌ఈలో 5శాతం లాభపడ్డాయి. నేడు బీఎస్‌ఈలో ఓఎన్‌జీసీ షేర్లు రూ.157.50ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. పవన్‌హన్స్‌లో తనకున్న 49శాతం వాటా విక్రయించేందుకు ఓఎన్‌జీసీ బోర్డు ఆమోదం తెలిపినట్లు ఓఎన్‌జీసీ స్టాక్‌ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ఈ వార్తల నేపథ్యంలో ఓఎన్‌జీసీ షేర్ల కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపడంతో ఇంట్రాడేలో 5శాతానికి పైగా

Most from this category