STOCKS

News


మార్కెట్‌ పెరుగుతుందా? తగ్గుతుందా?

Tuesday 9th October 2018
news_main1539056592.png-20940

మంగళవారం మార్కెట్లను ప్రభావితం చేసే అంశాలను గమనిస్తే..

♦ అమెరికా మార్కెట్లు కూడా సోమవారం మిశ్రమంగా ముగిశాయి. డౌజోన్స్‌ ఇండస్ట్రీయల్‌ యావరేజ్‌ 40 పాయిం‍ట్ల లాభంతో 26,486 పాయింట్ల వద్ద ముగిసింది. ఎస్‌అండ్‌పీ 500.. 1 పాయింట్ల నష్టంతో 2,884 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఇక నాస్‌డాక్‌ కంపొసిట్‌ 52 పాయింట్ల నష్టంతో 7,736 పాయింట్ల వద్ద ముగిసింది. చైనా మార్కెట్‌లో అమ్మకాల ఒత్తిడి నేపథ్యంలో అంతర్జాతీయంగా ఆర్థిక వృద్ధి నెమ్మదించొచ్చనే భయాలు ప్రతికూల ప్రభావం చూపాయి. నాస్‌డాక్‌, ఎస్‌అండ్‌పీ 500 ఇండెక్స్‌లలో మైక్రోసాఫ్ట్‌ కార్ప్‌ 1.1 శాతం, అడోబ్‌ సిస్టమ్స్‌ 3.2 శాతంమేర క్షీణించాయి. 

♦ ఆసియా ప్రధాన సూచీలన్నీ మంగళవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి. జపాన్‌ నికాయ్‌ 225.. ఏకంగా 219 పాయింట్ల నష్టంతో 23,564 పాయింట్ల వద్ద,  హాంగ్‌ కాంగ్‌ ఇండెక్స్‌ హాంగ్‌ సెంగ్‌ 2 పాయింట్ల స్వల్ప లాభంతో 26,204 పాయింట్ల వద్ద, సింగపూర్‌ ఇండెక్స్‌ స్ట్రైట్స్‌ టైమ్స్‌ 7 పాయింట్ల నష్టంతో 3,174 పాయింట్ల వద్ద, తైవాన్‌ సూచీ తైవాన్‌ ఇండెక్స్‌ 13 పాయిం‍ట్ల లాభంతో 10,468 పాయింట్ల వద్ద, చైనా ఇండెక్స్‌ షాంఘై కంపొసిట్‌ 1 పాయింటు నష్టంతో 2,716 పాయింట్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇక దక్షిణ కొరియా మార్కెట్‌కు సెలవు. దక్షిణ కొరియా ఇండెక్స్‌ కొస్పి సోమవారం 14 పాయింట్ల నష్టంతో 2,254 పాయింట్ల వద్ద ముగిసింది.

♦ ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ఫ్లాట్‌ లేదా నెగటివ్‌ ఓపెనింగ్‌ను సూచిస్తోంది.

♦ ఐఎంఎఫ్‌.. 2018, 2019 ప్రపంచ ఆర్థిక వృద్ధి అంచనాలను 3.9 శాతం నుంచి 3.7 శాతానికి తగ్గించింది. ట్రేడ్‌ పాలసీ ఆందోళనలు, టారిఫ్‌ విధింపు వంటి వాటిని ఇందుకు కారణంగా పేర్కొంది. 

♦ క్రూడ్‌ ధరలు మంగళవారం స్థిరంగా ఉన్నాయి. బ్యారెల్‌కు 83.84 డాలర్లుగా ఉంది. అమెరికా క్రూడ్‌ ధర బ్యారెల్‌కు 74.28 డాలర్లుగా ఉంది. 

♦ రూపాయి సోమవారం కొత్త జీవిత కాల కనిష్ట స్థాయిలకు పతనమైంది. అమెరికా డాలర్‌తో పోలిస్తే 30 పైసలు నష్టపోయి 74.06 వద్ద ముగిసింది. 

♦ ఆగస్ట్‌ చివరి నాటికి పి-నోట్స్‌ పెట్టుబడులు రూ.84,647 కోట్లకు పెరిగాయి. 

♦ మ్యూచువల్‌ ఫండ్‌ పరిశ్రమలో సెప్టెంబర్‌ నెలో లిక్విడ్‌ ఫండ్స్‌ నుంచి ఏకంగా 2.3 లక్షల కోట్ల ఇన్వెస్ట్‌మెంట్లు వెనక్కు వెళ్లిపోయాయి.

♦ ఆస్క్‌ ఇన్వెస్ట్‌మెంట్‌, పురాణిక్‌ బిల్డర్స్‌, నిహిలెంట్‌, ముత్తూట్‌ మైక్రోఫిన్‌ సంస్థల ఐపీవోకు సెబీ ఆమోదం తెలిపింది. 
 
పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం చూస్తే.. నిఫ్టీ ఇండెక్స్‌కు 10,231, 10,115 వద్ద కీలక మద్దతు లభిస్తుందని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 10,431, 10,514 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు.
బ్యాంక్‌ నిఫ్టీ 24,618 పాయింట్ల వద్ద ముగిసింది. పివోట్‌ చార్ట్స్‌ ప్రకారం.. ఇండెక్స్‌కు 24,323, 24,029 కీలక మద్దతు స్థాయిలని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇక 24,829, 25,039 కీలక నిరోధ స్థాయిలని తెలిపారు. 
ఇండియా వీఐఎక్స్‌ 2.12 శాతం పెరుగుదలతో 20.15కి ఎగసింది. 



You may be interested

లాభాలతో ఆరంభం..

Tuesday 9th October 2018

ఇండియన్‌ స్టాక్‌ మార్కెట్‌ మంగళవారం లాభాలతో ప్రారంభమైంది. సెన్సెక్స్‌ తన మునపటి ముగింపు 34,474 పాయింట్లతో పోలిస్తే 147 పాయింట్ల లాభంతో 34,651 పాయింట్ల వద్ద గ్యాప్‌అప్‌తో ప్రారంభమైంది. ఇక నిఫ్టీ తన మునపటి ముగింపు 10,348 పాయింట్లతో పోలిస్తే 42 పాయింట్ల లాభంతో 10,390 పాయింట్ల వద్ద ప్రారంభమైంది.   అమెరికా మార్కెట్లు కూడా సోమవారం మిశ్రమంగా ముగియడం, ఆసియా ప్రధాన సూచీలన్నీ మంగళవారం మిశ్రమంగా ట్రేడవుతుండటం (దక్షిణ కొరియా

స్వల్ప లాభాల్లో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ..

Tuesday 9th October 2018

ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ విదేశీ మార్కెట్లో మంగళవారం స్వల్ప లాభాలతో ట్రేడవుతోంది. సింగపూర్‌ ఎక్స్చేంజ్‌లో తన మునపటి ముగింపుతో పోలిస్తే 3 పాయింట్ల లాభంతో 10,370 పాయింట్ల వద్ద ఉంది. ఇది నిఫ్టీ-50 ఫ్యూచర్స్‌ సోమవారం ముగింపు స్థాయి 10,379 పాయింట్లతో పోలిస్తే 9 పాయింట్లు నష్టంతో ఉందని గమనించాలి. అందువల్ల నిప్టీ మంగళవారం ఫ్లాట్‌గా లేదా నెగటివ్‌గా ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.  మిశ్రమంగా ఆసియా మార్కెట్లు.. ఆసియా ప్రధాన సూచీలన్నీ మంగళవారం మిశ్రమంగా ట్రేడవుతున్నాయి.

Most from this category