STOCKS

News


విదేశాల్లో భారత ‘వంటిల్లు’!

Tuesday 7th August 2018
news_main1533619294.png-19000

  •  భారత రెస్టారెంట్లకు విదేశాల్లో ఎర్ర తివాచీ...
  •  త్వరలోనే లండన్‌, న్యూయార్క్‌లలో సంజీవ్‌ కపూర్‌ హోటళ్లు
  •  అమెరికాలో లైట్ బైట్ పంజాబీ రుచులు

న్యూఢిల్లీ: పంజాబీ చికెన్‌ టిక్కా... రాజస్థానీ థాలీ... మహారాష్ట్ర వడాపావ్‌... తమిళనాడు సాంబార్‌ ఇడ్లీ... హైదరాబాద్‌ బిర్యానీ... చెబుతుంటేనే నోరూరుతోంది కదా..!! ఇప్పుడు ఈ భారతీయుల వంటకాల ఘుమఝుమలు విదేశీయులనూ ఆవురావురుమనేలా చేస్తున్నాయి. అదిరిపోయే భరతీయ వంటలతో మనోళ్లు ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతున్నారు. మన నలభీములకు విదేశీయులు ఎర్ర తివాచీ పరుస్తుండడంతో ఇక్కడి రెస్టారెంట్‌ చైన్లు అత్యంత వేగంగా ఇతర దేశాలకు విస్తరిస్తున్నాయి. లైట్ బైట్ ఫుడ్స్‌, జిగ్స్‌ అండ్‌  జోరవార్ కల్‌రా రెస్టారెంట్‌ చైన్లతో పాటు పారిశ్రామికవేత్త, ప్రముఖ చెఫ్ సంజీవ్‌ కపూర్‌కు చెందిన రెస్టారెంట్లు విదేశాల్లో పాగా వేస్తున్నాయి.

అనుమతులు, లైసెన్సులు సులువు...
కేఎఫ్‌సీ, మెక్‌డొనాల్డ్స్‌, డామినోస్‌ లాంటి విదేశీ రెస్టారెంట్‌ చైన్‌లకు దీటుగా అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సంస్థలు చొచ్చుకుపోతున్నాయి. ఇతర దేశాల్లో రెస్టారెంట్లను ప్రారంభించడం సులువుగా ఉండడం, బయట వంటకాలకు విదేశీయులు ఖర్చులు పెంచడం లాంటి సానుకూల అంశాలు హోటల్‌ వ్యాపార అభివృద్ధికి దోహదపడుతున్నాయని నిర్వహకులు చెబుతున్నారు. 'విదేశీ రెస్టారెంట్‌ వ్యాపారం విధానాలలో స్థిరత్వం ఉంటుంది. అనేక దేశాలలో హోటళ్లను ప్రారంభించడానికి బహుళ అనుమతులు, లైసెన్సుల అవసరం లేకపోవడం అనేది ప్రయోజనకరంగా ఉంది. లండన్‌, న్యూయార్క్‌, దుబాయ్‌ వంటి అభివృద్ధి చెందిన దేశాలలో బయట తిండికి వ్యయం గణనీయంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలోనే 150 మంది కూర్చుని భోజనం చేయడానికి సరిపడేంతటి రెస్టారెంట్‌ను ఈఏడాది సెప్టెంబరులోనే వాషింగ్టన్ డీసీలో ప్రారంభిస్తున్నాం' అని లైట్‌ బైట్‌ ఫుడ్స్‌ డైరెక్టర్‌ రోహిత్ అగర్వాల్ అన్నారు. పంజాబ్‌ గ్రిల్‌ పేరుతో ఈ రెస్టారెంట్‌ ప్రారంభం కానుందని, త్వరలోనే దుబాయ్, కువైట్, ఇతర గల్ఫ్ దేశాలలో సైతం సత్తా చాటనున్నామని వెల్లడించారు. 

విదేశాల్లో హోటల్‌ నడపడం చాలా సులభం...
దివ్యాని ఇంటర్‌నేషనల్‌ అమెరికా, లండన్‌, సింగపూర్‌, దుబాయ్‌ దేశాలలో విస్తరిస్తోంది. నోరు ఊరించే వంటకాలతో అదరగొట్టే సంజీవ్‌ కపూర్‌ సైతం విదేశీ రెస్టారెంట్ల విస్తరణలో వేగంగా దూసుకుపోతున్నారు. సంజీవ్‌ కపూర్‌ రెస్టారెంట్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో మొత్తం 70 స్టోర్లను నడుపుతుండగా, వీటిలో సగం వరకు విదేశాల్లోనే కొనసాగిస్తున్నారు. విదేశాల్లో హోటల్‌ వ్యాపారం చాలా సులువుగా నడపవచ్చని వెల్లడించిన ఆయన త్వరలోనే లండన్‌, న్యూయార్క్‌, టొరంటో, సౌదీ అరేబియాలలో రెస్టారెంట్లను ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. 

మానవ వనరుల పరంగా ఇబ్బందే...
ఇబ్బందుల విషయానికి వస్తే.. మానవవనరుల కొరత, వీసా సమస్యలు ఉన్నట్లు తెలిపారు. భారత్‌లో మార్జిన్లు చూడలేకపోతున్న అనేక రెస్టారెంట్‌ చైన్లు విదేశాల్లో మంచి లాభాలను గడిస్తున్నాయని నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) వ్యాఖ్యానించింది. ఇతర దేశాలలో రిటర్న్‌ ఆన్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ చాలా ఎక్కువగా ఉందని ఎన్‌ఆర్‌ఏఐ అధ్యక్షుడు రాహుల్ సింగ్ వెల్లడించారు. గతేడాది అమెరికన్లు ఆహారంపై చేస్తున్న ఖర్చులలో ఏకంగా 48 శాతం రెస్టారెంట్లలోనే జరుగుతున్నట్లు తెలిపారు.
 You may be interested

ఎఫ్‌బీ, వాట్సాప్‌ బ్లాక్‌పై అభిప్రాయాలు చెప్పండి

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: ప్రత్యేక సందర్భాలైన జాతీయ భద్రత, ప్రజా జీవనం ప్రమాదంలో పడినప్పుడు ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, టెలిగ్రామ్‌ తరహా యాప్స్‌ను బ్లాక్‌ చేసేందుకు అనుసరించాల్సిన సాంకేతిక చర్యల విషయమై పరిశ్రమ అభిప్రాయాల్ని టెలికం శాఖ కోరింది. టెలికం ఆపరేటర్లు, ఇంటర్నెట్‌ సర్వీసు ప్రొడైవర్ల అసోసియేషన్‌ (ఐఎస్‌పీఏఐ), సీవోఏఐలకు టెలికం శాఖ జూలై 18నే లేఖలు రాసింది. ఐటీ చట్టంలోని సెక్షన్‌ 69ఏ కింద మొబైల్‌ అప్లికేషన్లను బ్లాక్‌ చేయడంపై తమ

వేదాంత రీసోర్సెస్‌ ఎబిటాలో 26 శాతం వృద్ధి

Tuesday 7th August 2018

న్యూఢిల్లీ: వేదాంత రీసోర్సెస్‌ ఎబిటా జూన్‌ క్వార్టర్లో 26 శాతం పెరిగి 983 మిలిన్‌ డాలర్లుగా నమోదైంది. గతేడాది ఇదే కాలంలో ఇది 778 మిలియన్‌ డాలర్లు కావడం గమనార్హం. త్రైమాసిక ఫలితాలను కంపెనీ లండన్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌కు సమర్పించింది. వేదాంత లిమిటెడ్‌కు ఇది మాతృ సంస్థ. కమోడిటీ ధరలు అధికంగా ఉండడం, అధిక విక్రయాలతో ఎబిటా వృద్ధి చెందినట్టు కంపెనీ తెలిపింది. గ్రూపు ఆదాయం 14.9 శాతం పెరిగి

Most from this category