STOCKS

News


70 విదేశీ శాఖల మూసివేతకు పీఎస్‌బీల ప్రణాళిక

Monday 27th August 2018
news_main1535346755.png-19667

న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ బ్యాంకులు (పీఎస్‌బీలు) నిధుల సంరక్షణ చర్యల్లో భాగంగా 70 విదేశీ శాఖల మూసివేత లేదా క్రమబద్ధీకరణకు రంగం సిద్ధం చేశాయి. లాభదాయకం కాని విదేశీ కార్యకలాపాలను మూసివేయడం, అలాగే ఒకే పట్టణం లేదా సమీప ప్రాంతాల్లో ఒకటికి మించి ఉన్న శాఖలను క్రమబద్ధీకరించడం పీఎస్‌బీల ప్రణాళికలో భాగంగా ఉన్నాయి. ఇందులో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరంలో 70 విదేశీ శాఖల్ని మూసేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. పీఎస్‌బీలు గతేడాది 35 విదేశీ శాఖల్ని మూసేశాయి. 41 విదేశీ శాఖలు 2016-17లో నష్టాల్ని ప్రకటించాయి. నష్టాల శాఖల్లో 9 ఎస్‌బీఐకి చెందినవి ఉన్నాయి. బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 8 శాఖలు, బ్యాంకు ఆఫ్‌ బరోడా 7 శాఖలు నష్టాల్లో ఉన్నాయి. ఈ ఏడాది జనవరికి ఉన్న గణాంకాల ప్రకారం చూస్తే పీఎస్‌బీలకు విదేశాల్లో శాఖలు, రిప్రజెంటేటివ్‌ కార్యాలయాలు కలిపి 165 వరకు ఉన్నాయి.



You may be interested

కీలక అవరోధం 38,500

Monday 27th August 2018

ఇతర వర్థమాన సూచీలు దిగువస్థాయిలో ట్రేడవుతున్నా, ఇండియా మార్కెట్‌ వరుసగా మరోవారం రికార్డుల్ని సృష్టించింది. అమెరికా-చైనా మధ్య కొనసాగుతున్న ట్రేడ్‌వార్‌తో చాలావరకూ ప్రయోజనం పొం‍దనున్నందున అమెరికా సూచీలు రికార్డు గరిష్టం వద్ద కదులుతుండగా, వర్థమాన దేశాల్లో ప్రస్తుతానికి సురక్షితమైన స్థానంగా ఇండియాను ఇన్వెస్టర్లు పరిగణిస్తున్న నేపథ‍్యంలో మన మార్కెట్‌ పెరుగుతున్నది. గత వారాంతంలో భారత్‌ సూచీలు గరిష్టస్థాయి నుంచి స్వల్పంగా తగ్గినప్పటికీ, సూచీల్ని నడిపిస్తున్న ఐదారు హెవీవెయిట్‌ షేర్లలో రెండు...రిలయన్స్‌

ఏ విభాగాన్నీ విస్మరించం

Monday 27th August 2018

న్యూఢిల్లీ: వినియోగదారుల అభిరుచులకనుగుణంగా వివిధ సెగ్మెంట్లలో కార్లను అందిస్తామని మారుతీ సుజుకీ తెలిపింది. వివిధ ఆదాయ వర్గాలవారికి అందుబాటులో ఉండేలా వివిధ మోడళ్ల కార్లను అందిస్తామని కంపెనీ సీనియర్‌ ఈడీ(సేల్స్‌, మార్కెటింగ్‌) ఆర్‌.ఎస్‌. కల్సి చెప్పారు. హ్యాచ్‌బాక్‌, సెడాన్‌, ఎస్‌యూవీ... ఏ సెగ్మెంట్‌నూ విస్మరించబోమని, అన్ని సెగ్మెంట్లలోనూ కార్లను అందిస్తామని పేర్కొన్నారు. గతంలో తక్కువ ధరకు కార్లను అందించాలని చూసేవాళ్లమని, ఇప్పుడు ఈ పరిస్థితి లేదని తెలిపారు. వినియోగదారుల ఆదాయ

Most from this category