STOCKS

News


వైకింగ్‌ బ్రాండ్‌ మళ్లీ తెస్తోన్న హీరో సైకిల్స్‌

Wednesday 11th July 2018
news_main1531328205.png-18223

న్యూఢిల్లీ: ప్రపంచపు అతిపెద్ద సైకిళ్ల తయారీ కంపెనీ ‘హీరో సైకిల్స్‌’ తాజాగా బ్రిటన్‌కు చెందిన 110 ఏళ్ల చరిత్ర కలిగిన  మోస్ట్‌ పాపులర్‌ సైకిల్‌ బ్రాండ్‌ ‘వైకింగ్‌’ను మళ్లీ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. వైకింగ్‌ బ్రాండ్‌ను కలిగిన అవోసెట్‌ సైకిల్స్‌ను 2015లో హీరో సైకిల్స్‌ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల తర్వాత యూకేలోని సైకిల్‌ షాప్స్‌లో వైకింగ్‌ బ్రాండ్‌ సైకిళ్లు అందుబాటులోకి రానున్నాయి. ‘‘యాజమాన్యం మార్పు సహా పలు అంశాల కారణంగా దశాబ్దాల నుంచి వైకింగ్‌ బ్రాండ్‌ నిర్లక్ష్యానికి గురవుతూ వస్తోంది. హీరో సైకిల్స్‌ మా సంస్థను కొనుగోలు చేసిన దగ్గరి నుంచి యూకే మార్కెట్‌పై ప్రభావం చూపించాలని ఎదురుచూస్తున్నాం. ఇప్పుడు అవకాశం వచ్చింది’’ అని ఎవోసెట్‌ సీఈవో శ్రీరామ్‌ వెంకటేశ్వరన్‌ తెలిపారు. 



You may be interested

ఎన్‌సీడీల ద్వారా రూ.700 కోట్లు సమీకరిస్తాం

Wednesday 11th July 2018

న్యూఢిల్లీ: రియల్టీ సంస్థ, శోభ లిమిటెడ్‌ డిబెంచర్ల జారీ ద్వారా రూ.700 కోట్లు సమీకరించనున్నది.  రియల్‌ ఎస్టేట్‌ ప్రాజెక్ట్‌ల అమలు కోసం అవసరమయ్యే నిధులను  నాన్‌-కన్వర్టబుల్‌ డిబెంచర్లు(ఎన్‌సీడీ)లను ప్రైవేట్‌ ప్లేస్‌మెంట్‌ ప్రాతిపదికన జారీ చేసి సమీకరించాలని ఈ కంపెనీ యోచిస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 7న నిర్వహించే ఏజీఎమ్‌(వార్షిక సాధారణ సమావేశం)లో వాటాదారుల ఆమోదం పొందుతామని కంపెనీ తెలిపింది. కాగా ప్రస్తుత ఏడాది తొలి మూడు నెలల కాలంలో

డెక్కన్‌ క్రానికల్‌ ఆస్తుల అమ్మకం?

Wednesday 11th July 2018

ఈ నెల 17న తేలనున్న భవితవ్యం అప్పులు రూ.10 వేల కోట్లపైమాటే హైదరాబాద్‌, బిజినెస్‌ బ్యూరో: అప్పుల ఊబిలో కూరుకుపోయిన డెక్కన్‌ క్రానికల్‌ హోల్డింగ్స్‌ ఆస్తుల వేలం తప్పదా? ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ఇదే జరిగేట్టుంది. కంపెనీ దివాళా ప్రక్రియలో భాగంగా శ్రేయి ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌కు చెందిన విజన్‌ ఇండియా ఫండ్‌ ప్రతిపాదించిన పరిష్కార ప్రణాళికకు (రిసొల్యూషన్‌ ప్లాన్‌) రుణదాతల నుంచి ఆమోద ముద్ర పడలేదు. శ్రేయి ప్రతిపాదనపై జరిగిన ఈ-ఓటింగ్‌లో

Most from this category