News


ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌ నష్టాలు రూ.487 కోట్లు

Saturday 27th October 2018
news_main1540610696.png-21521

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఇండియన్‌ ఓవర్సీస్‌ బ్యాంక్‌కు (ఐఓబీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.487 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత క్యూ2లో, ఈ క్యూ1లో వచ్చిన నష్టాలను పరిగణనలోకి తీసుకున్నా, ఈ బ్యాంక్‌ నష్టాలు బాగా తగ్గాయి. గత క్యూ2లో ఈ బ్యాంక్‌కు రూ.1,223 కోట్లు, ఈ క్యూ1లో రూ.919 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. మొండి బకాయిలు, ఇన్వెస్ట్‌మెంట్స్‌ కోసం కేటాయింపుల కారణంగానే నికర నష్టాలు వచ్చాయని, కార్యకలాపాల వల్ల కాదని ఐఓబీ తెలిపింది. గత క్యూ2లో రూ.5,610 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం ఈ క్యూ2లో రూ.5,348 కోట్లకు తగ్గిందని పేర్కొంది. బ్యాంక్‌ రుణ నాణ్యత తగ్గింది. స్థూల మొండి బకాయిలు 22.73 శాతం నుంచి 24.73 శాతానికి పెరిగాయి. సీక్వెన్షియల్‌గా చూస్తే, మాత్రం స్థూల మొండి బకాయిలు తగ్గాయి. ఈ క్యూ1లో స్థూల మొండి బకాయిలు 25.64 శాతంగా ఉన్నాయి. నికర మొండి బకాయిలు 13.86 శాతం నుంచి 14.34 శాతానికి పెరిగాయి. ఈ క్యూ1లో మాత్రం నికర మొండి బకాయిలు 15.10 శాతంగా ఉన్నాయి. మొండి బకాయిలకు, ఇతరాలకు కేటాయింపులు రూ.2,238 కోట్ల నుంచి రూ.2,017 కోట్లకు తగ్గాయని బ్యాంక్‌ తెలిపింది. 

ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఐఓబీ షేర్‌ 7 శాతం లాభపడి రూ.14 వద్ద ముగిసింది. 



You may be interested

సానుకూల బ్యాంకింగ్‌ రుణ వృద్ధి

Saturday 27th October 2018

ముంబై: బ్యాంకింగ్‌ రుణ వృద్ధి  2018 అక్టోబర్‌ 12వ తేదీతో ముగిసిన పక్షం రోజుల కాలానికి గత ఏడాది ఇదే కాలంతో పోల్చిచూస్తే, 14.35 శాతం పెరిగింది. రూ.89.93 లక్షల కోట్లుగా నమోదయ్యింది. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంకింగ్‌ రుణాలు రూ.78.65 లక్షల కోట్లు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాల ప్రకారం-  ♦ తాజా సమీక్షా కాలంలో డిపాజిట్ల వృద్ధి రేటు 8.86 శాతం

ఐటీసీ లాభం రూ.2,955 కోట్లు

Saturday 27th October 2018

న్యూఢిల్లీ: ఐటీసీ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన రూ.2,955 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం రూ.2,640 కోట్లతో పోలిస్తే 12 శాతం వృద్ధి సాధించామని ఐటీసీ తెలిపింది. ఎఫ్‌ఎమ్‌సీజీ, సిగరెట్లు, వ్యవసాయ, పేపర్‌ విభాగాలు మంచి వృద్ధి సాధించాయని కంపెనీ తెలియజేసింది. స్టాండ్‌ అలోన్‌ ప్రాతిపదికన గత క్యూ2లో రూ.10,258

Most from this category