STOCKS

News


కుటుంబ వ్యాపారాల్లో భారత్‌ మేటి

Saturday 15th September 2018
news_main1536987246.png-20271

న్యూఢిల్లీ: కుటుంబాల ఆధ్వర్యంలో నడిచే వ్యాపార సంస్థలు ఆయా రంగాల్లోని ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే పనితీరులో మెరుగ్గా ఉండడంతోపాటు, వాటాదారులకు అధిక రాబడులు పంచిపెడుతున్నాయి. కుటుంబాల ఆధ్వర్యంలోని కంపెనీలు సంఖ్యా పరంగా చైనా, అమెరికా తర్వాత భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయి. ఈ వివరాలను ‘క్రెడిట్‌ సూసే ఫ్యామిలీ 1000, 2018’ నివేదిక పేరుతో క్రెడిట్‌ సూసే రీసెర్చ్‌ ఇనిస్టిట్యూట్‌ విడుదల చేసింది. భారత్‌లో 111 వ్యాపార సంస్థలు కుటుంబాల ఆధ్వర్యంలో నడుస్తున్నాయి. వీటి ఉమ్మడి మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ (మార్కెట్‌ విలువ) 839 బిలియన్‌ డాలర్లు. చైనాలో 159 సంస్థలు, అమెరికాలో 121 సంస్థలు ఇలా కుటుంబ వ్యాపారాలుగా కొనసాగుతున్నాయి. ఇవి మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జపాన్‌ మినహా ఆసియా ప్రాంతంలో చైనా, భారత్‌, హాంగ్‌కాంగ్‌ కుటుంబ వ్యాపారాల విషయంలో ముందున్నాయి. ఈ మూడు దేశాలే 65 శాతం వాటా ఆక్రమించాయి. ఈ మూడు దేశాల్లోని కుటుంబ వ్యాపారాల మార్కెట్‌ విలువ రూ.2.85 లక్షల కోట్ల డాలర్లు. 43 కంపెనీలతో (మార్కెట్‌ క్యాప్‌ 434 బిలియన్‌ డాలర్లు) దక్షిణ కొరియా నాలుగో స్థానంలో ఉంది. ఆ తర్వాత ఇండోనేషియా, మలేషియా, ఫిలిప్సీన్స్‌, థాయిలాండ్‌ 26 కంపెనీల చొప్పున కలిగి ఉన్నాయి. జపాన్‌ మినహా ఆసియా ప్రాంతంలో 11 దేశాలను ఈ నివేదిక కవర్‌ చేసింది. ఈ 11 దేశాలు మొత్తం విశ్వంలోని కుటుంబ వ్యాపారాల్లో 53 శాతం వాటాను ఆక్రమించాయి. మొత్తం మార్కెట్‌ క్యాప్‌ 4 లక్షల కోట్ల డాలర్లు. 
పోటీ సంస్థల కంటే అధిక రాబడులు...
‘‘ఈ ఏడాది ప్రతీ ప్రాంతంలోనూ, ప్రతీ రంగంలోనూ కుటుంబాల నిర్వహణలోని వ్యాపారాలు చక్కని పనితీరుతో పోటీ సంస్థల కంటే ముందున్నట్టు గుర్తించాం. కుటుంబ వ్యాపారాలు బయటి నిధులపై తక్కువ ఆధారపడతాయని, పరిశోధన, అభివృద్ధిపై మరిన్ని నిధులు వెచ్చిస్తాయన్న దీర్ఘకాలిక దృక్పథాన్ని ఇది తగ్గిస్తుందని భావిస్తున్నాం’’ అని క్రెడిట్‌ సూసే నివేదిక ముఖ్య రచయిత యూజీన్‌ క్లెర్క్‌ పేర్కొన్నారు. మన దేశంలోని కుటుంబ వ్యాపార కంపెనీల షేర్ల రాబడి 2006 నుంచి ఏటా సగటున 13.9 శాతంగా ఉన్నాయి. ఇదే కాలంలో వీటికి పోటీనిచ్చే స్థానంలో ఉన్న కుటుంబేతర వ్యాపార కంపెనీల షేర్లపై రాబడులు వార్షికంగా 6 శాతం వరకే ఉండడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక లాభాలను ఆర్జించే 50 కంపెనీల్లో 24 ఆసియా నుంచి ఉన్నాయి. వీటి ఉమ్మడి మార్కెట్‌ విలువ 748 బిలియన్‌ డాలర్లు. వీటిల్లోనూ 12 భారత కుటుంబ వ్యాపార కంపెనీలు (192.2 బిలియన్‌ డాలర్లు) ఉన్నాయి. జపాన్‌ మినహా ఆసియాలో 30 అత్యుత్తమ పనితీరు కలిగిన కంపెనీల్లో సగానికి పైగా మన దేశానివే ఉన్నట్టు క్రెడిట్‌ సూసే నివేదిక తెలియజేసింది. 



You may be interested

భారత్‌లో మరిన్ని పెట్టుబడులు

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: నూతన ఆవిష్కరణలకు తోడ్పాటునిచ్చే దిశగా రెండో విడత 'కంట్రీ డిజిటల్ యాక్సిలరేషన్' (సీడీఏ) కార్యక్రమం కింద భారత్‌లో మరిన్ని పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెరికా టెక్ దిగ్గజం సిస్కో సీఈవో చక్ రాబిన్స్ తెలిపారు. దీంతో సీడీఏ కింద రెండో విడత ఇన్వెస్ట్‌మెంట్స్ అందుకున్న అతి కొద్ది దేశాల్లో భారత్‌ కూడా ఒకటిగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పౌరులకు మెరుగైన సర్వీసులు అందించడంలో 5జీ టెక్నాలజీని మరింతగా వినియోగంలోకి తేవడంపైనా

మాల్యా కేసులో మెతగ్గా వ్యవహరించలేదు: ఎస్‌బీఐ

Saturday 15th September 2018

న్యూఢిల్లీ: కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ రుణ ఎగవేత ఖాతా వ్యవహారంలో మెతగ్గా వ్యవహరించలేదని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ అధిపతి విజయ్‌మాల్యా 2016 మార్చి 2న భారత్‌ నుంచి వెళ్లిపోయారు. అయితే, అతన్ని నిలువరించేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని 2016 ఫిబ్రవరిలోనే లీడ్‌ బ్యాంకుగా ఉన్న ఎస్‌బీఐ సూచించినప్పటికీ... ఆయన పరారైన నాలుగు రోజుల తర్వాత 13 బ్యాంకుల కన్సార్షియం సుప్రీం కోర్టును ఆశ్రయించిందంటూ వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఎస్‌బీఐ

Most from this category