STOCKS

News


తొలి దేశీ ఎలక్ట్రానిక్ చిప్!!

Friday 28th December 2018
news_main1545970365.png-23272

  • పృథ్వీ 3ని రూపొందించిన సాంఖ్య ల్యాబ్స్‌
  • 5జీ కనెక్షన్లకు, కాల్‌ డ్రాప్స్‌ నియంత్రణలో ఉపయోగం

హైదరాబాద్‌: కాల్‌ డ్రాప్స్‌ను నియంత్రించడంతో పాటు 5జీ కనెక్షన్స్‌కు ఉపయోగపడేలా దేశీయంగా తొలి ఎలక్ట్రానిక్ చిప్‌సెట్‌ పృథ్వీ 3ని బెంగళూరుకు చెందిన సాంఖ్య ల్యాబ్స్ రూపొందించింది. మొబైల్ ఫోన్స్‌లో నేరుగా టీవీ ప్రసారాలకు కూడా ఇది ఉపయోగపడుతుంది. దీని డిజైనింగ్‌, అభివృద్ధి పూర్తిగా దేశీయంగానే జరిగినట్లు చిప్‌సెట్‌ను ఆవిష్కరించిన సందర్భంగా టెలికం శాఖ మంత్రి మనోజ్ సిన్హా తెలిపారు. ఇది ప్రపంచంలోని మొట్టమొదటి, అధునాతన టీవీ వ్యవస్థ గల చిప్‌ అని ఆయన పేర్కొన్నారు. టెలికం ఆపరేటర్లు ఎదుర్కొంటున్న కాల్స్ నాణ్యతాపరమైన సమస్యలను పరిష్కరించేందుకు కూడా ఇది ఉపయోగపడుతుందని మంత్రి వివరించారు. వీడియో కంటెంట్‌ను మొబైల్ నెట్‌వర్క్‌ నుంచి వేరు చేయడం ద్వారా స్పెక్ట్రంపై ఎక్కువ భారం పడకుండా కాల్ నాణ్యతను పెంచేందుకు ఈ చిప్ తోడ్పడుతుందని సాంఖ్య ల్యాబ్స్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో పరాగ్ నాయక్ చెప్పారు. దీనితో.. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌ను శాటిలైట్ ఫోన్‌లా ఉపయోగించుకోవచ్చన్నారు. ఎలక్ట్రానిక్ డివైజ్‌లలో ఉపయోగించే ఎలక్ట్రానిక్ చిప్‌సెట్స్‌ను ప్రస్తుతం విదేశీ కంపెనీలే తయారు చేస్తున్నాయి. దేశీయంగా అధునాతన సెమీకండక్టర్ తయారీ ప్లాంటు లేకపోవడంతో భారత్‌లో వీటిని ఉత్పత్తి చేయడం లేదు. సాంఖ్య ల్యాబ్స్ ఎలక్ట్రానిక్ చిప్‌సెట్స్‌.. దక్షిణ కొరియాలోని శాంసంగ్ ప్లాంటులో తయారవుతున్నాయి.



You may be interested

మార్కెట్లోకి కొత్త సుజుకీ హయబుసా

Friday 28th December 2018

ధర రూ.13.74 లక్షలు న్యూఢిల్లీ: సుజుకీ మోటార్‌ సైకిల్‌ దేశీ మార్కెట్లో హయబుసా 2019 ఎడిషన్‌ స్పోర్ట్‌‍్స బైక్‌ను గురువారం విడుదల చేసింది. నూతన ఎడిషన్‌లో భారత పరిస్థితులకు అనుగుణంగా సైడ్ రిఫ్లెక్టర్లను అమర్చినట్లు కంపెనీ తెలిపింది. 1,340 సీసీ ఇంజిన్‌ కలిగిన ఈ బైక్‌ ధర రూ.13.74 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూం). విడుదల సందర్భంగా ఎస్‌ఎంఐపీఎల్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సతోషి ఉచితా మాట్లాడుతూ.. ‘గడిచిన 20 ఏళ్లుగా స్పోర్ట్స్‌

ప్రభుత్వరంగ బ్యాంకులకు అతిత్వరలో రూ.28,615 కోట్లు

Friday 28th December 2018

న్యూఢిల్లీ: అతి త్వరలోనే ఏడు ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం రూ.28,615 కోట్ల మేర ఆర్థిక సాయాన్ని అందించనుంది. ఈ నెలాఖరులోపు రీక్యాపిటలైజేషన్‌ బాండ్ల జారీ ద్వారా దీన్ని పూర్తి చేయనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. దీనివల్ల బ్యాంకులు నియంత్రణపరమైన అవసరాలను చేరుకునేందుకు వీలుంటుందని పేర్కొన్నాయి. అత్యధికంగా బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాకు రూ.10,086 కోట్ల సాయం లభించనుంది. ఆ తర్వాత ఓరియంటల్‌ బ్యాంకు ఆఫ్‌ కామర్స్‌కు రూ.5,500 కోట్లు, బ్యాంకు ఆఫ్‌

Most from this category