STOCKS

News


1.2 లక్షల కోట్ల డాలర్లకు ఈ-కామర్స్‌

Wednesday 27th February 2019
Markets_main1551241383.png-24351

  • 2021 నాటికి దేశీ మార్కెట్‌పై అంచనాలు
  • డెలాయిట్ ఇండియా, రిటైలర్స్ అసోసియేషన్ నివేదిక

ముంబై: దేశీ ఈ-కామర్స్ మార్కెట్ 2021 నాటికి 1.2 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి చేరనుంది. అప్పటికి ప్రపంచంలోనే మూడో అతి పెద్ద వినియోగదారుల మార్కెట్‌గా మారనుంది. డెలాయిట్ ఇండియా, రిటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ప్రస్తుతం 200 బిలియన్ డాలర్లుగా ఉన్న ఈ-కామర్స్ మార్కెట్... కొనుగోలుదారులు ఆన్‌లైన్ వైపు మళ్లుతున్న నేపథ్యంలో 2021 నాటికి 1.2 ట్రిలియన్ డాలర్లకు చేరగలదని నివేదిక పేర్కొంది. దేశీ కరెన్సీ రూపాయి మారకం విలువపై ఒత్తిడి, క్రూడాయిల్ దిగుమతుల భారం పెరుగుతున్నప్పటికీ.. 2021-2026 మధ్య భారత రిటైల్ మార్కెట్ వార్షిక ప్రాతిపదికన 7.8 శాతం మేర వృద్ధి నమోదు చేసే అవకాశం ఉందని వివరించింది. ప్రస్తుతం 32 శాతం వార్షిక వృద్ధి సాధిస్తున్న భారత ఈ-కామర్స్ మార్కెట్‌ మరికొన్నాళ్ల పాటు మరింత అధిక వృద్ధి నమోదు చేయనుందని నివేదిక తెలిపింది. 


మారుతున్న కొనుగోలుదారుల ధోరణులు..
ఇంటర్నెట్ వినియోగం, ఆన్‌లైన్‌లో కొనుగోలు జరిపేవారి సంఖ్య పెరుగుతుండటం, వినియోగదారుల కొనుగోలు ధోరణులు మారుతుండటం తదితర అంశాలు ఈ-కామర్స్ మార్కెట్ వృద్ధికి దోహదపడనున్నాయని డెలాయిట్ నివేదిక పేర్కొంది. అటు ఎం-కామర్స్ (మొబైల్ ద్వారా కొనుగోళ్లు) కూడా భారీగా పెరుగుతోందని వివరించింది. 2016 ఆర్థిక సంవత్సరంలో రూ. 20,000 కోట్లుగా ఉన్న ఎం-కామర్స్ లావాదేవీల పరిమాణం 2018 ఆర్థిక సంవత్సరం నాటికి రూ. 3,00,000 కోట్లకు చేరినట్లు తెలిపింది. సెమీ-అర్బన్‌, గ్రామీణ ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగం పెరుగుతుండటం, మారుతున్న షాపింగ్ ధోరణులు, స్మార్ట్‌ఫోన్స్ వినియోగంలో వృద్ధి వంటివి ఆన్‌లైన్ అమ్మకాల పెరుగుదలకు తోడ్పడ్డాయి. ఇక, ప్రథమ..ద్వితీయ..తృతీయ శ్రేణి మార్కెట్స్‌లో మిలీనియల్స్ (1980-1996 మధ్య పుట్టినవారు) అత్యధికంగా కొనుగోళ్లు జరుపుతున్నారు. ఆహారం, దుస్తులు, ఫుట్‌వేర్‌, యాక్సెసరీలు మొదలైన వాటి కొనుగోళ్లు అత్యధికంగా ఉంటున్నాయి. 


సోషల్ కామర్స్ ప్రభావం...
ఆన్‌లైన్ కొనుగోళ్లకు సంబంధించి సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటోందని నివేదిక పేర్కొంది. 28 శాతం మిలీనియల్స్‌.. సోషల్ మీడియా సిఫార్సుల మేరకు కొనుగోళ్లు జరపగా, 63 శాతం మంది మిలీనియల్స్‌ తమకిష్టమైన బ్రాండ్స్‌ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు సోషల్ మీడియాని ఉపయోగిస్తున్నారు. దేశీ ఈ-కామర్స్ రంగంలో కన్సాలిడేషన్ కూడా పెరుగుతోందని, 2017, 2018లో విలీన... కొనుగోళ్ల డీల్స్ 25 శాతం మేర పెరగడమే ఇందుకు నిదర్శనమని నివేదిక వివరించింది. 



You may be interested

మరో రెండు బ్యాంకులు పీసీఏ నుంచి బైటికి

Wednesday 27th February 2019

వాచ్ లిస్ట్ నుంచి బైటపడ్డ అలహాబాద్ బ్యాంక్‌, కార్పొరేషన్ బ్యాంక్‌ ముంబై: మొండిబాకీల భారం కారణంగా ఆంక్షలు ఎదుర్కొంటున్న మరో రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులు.. రిజర్వ్ బ్యాంక్ నిర్దేశిత సత్వర దిద్దుబాటు చర్యల (పీసీఏ) పరిధి నుంచి బైటికొచ్చాయి. అలహాబాద్‌ బ్యాంక్‌, కార్పొరేషన్ బ్యాంక్‌లపై ఆంక్షలు ఎత్తివేస్తూ ఆర్‌బీఐ మంగళవారం నిర్ణయం తీసుకుంది. అలాగే ప్రైవేట్ రంగానికి చెందిన ధన్‌లక్ష్మి బ్యాంక్‌ కూడా పీసీఏ నుంచి బైటికొచ్చింది. ఆయా బ్యాంకుల

అమెజాన్‌ డైరెక్టర్‌గా ఇంద్రా నూయి

Wednesday 27th February 2019

అమెజాన్‌కు రెండో మహిళ డైరెక్టర్‌  వాషింగ్టన్‌: పెప్సికో కంపెనీకి సీఈఓగా పనిచేసిన  భారత సంతతి ఇంద్రా నూయి(63) అమెజాన్‌ కంపెనీ డైరెక్టర్‌ అయ్యారు. ఆన్‌లైన్‌ రిటైల్‌ దిగ్గజం, అమెజాన్‌లో డైరెక్టర్‌ అయిన రెండో మహిళ ఇంద్రా నూయి. ఈ నెలారంభంలోనే స్టార్‌బక్స్‌ ఎగ్జిక్యూటివ్‌​ రోసలిండ్‌ బ్రెవర్‌ అమెజాన్‌లో డైరెక్టర్‌గా చేరారు. ఒక్క నెలలోనే ఇద్దరిని కొత్త డైరెక్టర్లుగా నియమించామని, వీరిద్దరికీ స్వాగతమని అమెజాన్‌ పేర్కొంది. ఇంద్రా నూయి ఆడిట్‌ కమిటీ సభ్యురాలిగా

Most from this category