STOCKS

News


మాల్యా కేసులో బ్యాంకులకు కొంత ఊరట

Saturday 1st December 2018
news_main1543644533.png-22553

లండన్‌:  రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన విజయ్ మాల్యా నుంచి బాకీలు రాబట్టుకునేందుకు ప్రయత్నిస్తున్న దేశీ బ్యాంకులకు బ్రిటన్ హైకోర్టు కొంత ఊరటనిచ్చింది. మాల్యా విహార నౌక వేలం ద్వారా వచ్చిన నిధుల్లో ఎంతో కొంత బ్యాంకులకు కూడా దఖలుపడేలా ఉత్తర్వులిచ్చింది. వివరాల్లోకి వెడితే.. మాల్యాకు మాల్టా ద్వీప దేశంలో 'ఇండియన్ ఎంప్రెస్‌' అనే విహార నౌక ఉండేది. దీన్ని నిర్వహించే సిబ్బందికి జీతభత్యాలు చెల్లించకపోవడంతో బకాయిలు రాబట్టుకునేందుకు మారిటైమ్ ప్రొఫెషనల్స్ యూనియన్ నాటిలస్‌.. ఈ నౌకను వేలంలో సీ బ్యూటీ యాటింగ్‌ సంస్థకు విక్రయించింది. తద్వారా సుమారు 35 మిలియన్ యూరోలు వచ్చాయి. ఇందులో సిబ్బంది, రుణదాతల బాకీలు పోగా .. మిగులేదైనా ఉంటే మాల్యా సంస్థలకు రుణాలిచ్చిన దేశీ బ్యాంకులకు కూడా చెల్లింపులు జరిపేలా బ్రిటన్ హైకోర్టు నవంబర్ 28న ఉత్తర్వులిచ్చింది. బ్యాంకులకు మాల్యా దాదాపు రూ. 9,000 కోట్లు బాకీ పడిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బ్రిటన్‌లో ఉంటున్న మాల్యాను భారత్ రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. 



You may be interested

అక్టోబర్‌లో మౌలిక రంగం మందగమనం

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: ఎనిమిది మౌలిక పరిశ్రమల గ్రూప్‌ అక్టోబర్‌లో నిరాశపరిచింది. కేవలం 4.8 శాతం వృద్ధిరేటు నమోదయ్యింది. వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వశాఖ శుక్రవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. అక్టోబర్‌ 2017లో ఈ రంగాల వృద్ధి రేటు 5 శాతం. అయితే నెలవారీగా చూస్తే  సెప్టెంబర్‌కన్నా అక్టోబర్‌లో వృద్ధిరేటు పెరిగింది. సెప్టెంబర్‌లో వృద్ధిరేటు 4.3 శాతం. మొత్తం పారిశ్రామిక ఉత్పత్తి (ఐఐపీ)లో దాదాపు 40 శాతం వాటా ఉన్న ఈ రంగాల

సీపీఎస్‌యూ ఈటీఎఫ్‌కు రూ.27,300 కోట్ల బిడ్‌లు

Saturday 1st December 2018

న్యూఢిల్లీ: సీపీఎస్ఈ ఈటీఎఫ్‌ (ఎక్స్చేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) ఫాలో ఆన్‌ ఆఫర్‌ ద్వారా కేంద్రం రూ.17,000 కోట్లకు పైగా సమీకరించనుంది. దేశీయంగా ఒక ఈటీఎఫ్‌ ద్వారా ఈ స్థాయిలో నిధులు సమీకరించడం ఇదే మొదటిసారి. ఈ నెల 27న ఆరంభమైన ఈ ఆఫర్‌ శుక్రవారం ముగిసింది. దీనికి మొత్తం 1.25 లక్షల దరఖాస్తుల ద్వారా రూ.27,300 కోట్ల విలువైన బిడ్‌లు వచ్చాయి. యాంకర్‌ ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటా 5.5 రెట్లు

Most from this category