STOCKS

News


దేశీ బ్యాంకుల లాభం.. అంతంతే!

Tuesday 23rd October 2018
news_main1540271156.png-21394

న్యూఢిల్లీ: బ్రిక్స్ కూటమిలోని మిగతా దేశాలతో పోలిస్తే భారతీయ బ్యాంకుల లాభదాయకత తక్కువగా ఉందని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వెల్లడించింది. మూలధనంపరంగా చూసినా దేశీ బ్యాంకులు బలహీనంగా ఉన్నాయని తెలిపింది. అయితే, అసెట్ క్వాలిటీ స్థిరపడే కొద్దీ వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పరిస్థితి మెరుగుపడొచ్చని ఒక నివేదికలో పేర్కొంది. "కీలకమైన ప్రభుత్వ రంగ బ్యాంకుల‍్లో ఒత్తిళ్ల కారణంగా భారత బ్యాంకింగ్ వ్యవస్థలో అసెట్ క్వాలిటీ బలహీనంగా ఉంది. అయితే, బలహీనంగా ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రభుత్వమిచ్చే అదనపు మూలధనంతో వాటి క్యాపిటల్ నిష్పత్తులు మెరుగుపడగలవు" అని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ వివరించింది. మార్కెట్లో ఆధిపత్యం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణ వ్యయాలు అధికంగా ఉండటం వల్ల మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ లాభదాయకత దెబ్బతింటోందని పేర్కొంది. మరోవైపు, బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా బ్యాంకులు అసెట్స్‌పై అత్యధిక రాబడులు నమోదు చేస్తున్నాయని వివరించింది. బ్రిక్స్ కూటమిలో భారత్ సహా బ్రెజిల్‌, రష్యా, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. 
"చైనా బ్యాంకుల కోవలోనే భారత బ్యాంకులు కూడా ప్రొవిజనింగ్‌కు ముందు లాభదాయకంగా ఉంటున్నప్పటికీ.. వ్యవస్థలో ఆధిపత్యం ఉన్న ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణ వ్యయాలు భారీగా ఉండటం వల్ల మొత్తం బ్యాంకింగ్ వ్యవస్థ అసెట్స్‌పై రాబడులు నెగటివ్‌గా ఉంటున్నాయి. మొండిబాకీలకు భారీ కేటాయింపులు జరపాల్సి వస్తుండటం వల్ల ఈ ఆర్థిక సంవత్సరం మిగతా కాలంలో కూడా లాభదాయకతపై  ఒత్తిళ్లు కొనసాగుతాయి. ఆ తర్వాత అసెట్ క్వాలిటీ స్థిరపడ్డాక వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారతీయ బ్యాంకుల లాభదాయకత మెరుగుపడే అవకాశం ఉంది" అని మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ నివేదిక పేర్కొంది. ఽ
మొండిబాకీల్లో రెండో స్థానం..
మొండిబాకీల విషయంలో బ్రిక్స్ కూటమిలో భారత్ రెండో స్థానంలో ఉన్నట్లు మూడీస్ వెల్లడించింది. 2017 ఆఖరు నాటికి నిరర్ధక రుణాల నిష్పత్తి (ఎన్‌పీఎల్‌) రష్యన్ బ్యాంకులు అగ్రస్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా, చైనా ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి. భారతీయ బ్యాంకుల మొండిబాకీల నిష్పత్తి కూడా 2017 ఆఖరు దాకా రెండంకెల స్థాయిలోనే ఉన్నప్పటికీ, వాటిని గుర్తించే ప్రక్రియ దాదాపు పూర్తయిపోయిందని మూడీస్ వివరించింది. స్థూలఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతుండటం, కార్పొరేట్లు తమ ఖాతాలు మొండిబాకీలుగా మారకుండా ప్రయత్నాలు చేస్తుండటం తదితర అంశాల కారణంగా రాబోయే 12-18 నెలల్లో కొత్త ఎన్‌పీఎల్‌ల సంఖ్య ఒక మోస్తరు స్థాయికి పరిమితం కావొచ్చని పేర్కొంది. అలాగే మొండిపద్దుల పరిష్కార చర్యల ఫలితంగా ఎన్‌పీఎల్ నిష్పత్తి కూడా క్రమంగా తగ్గొచ్చని వివరించింది. 



You may be interested

ఏషియన్‌ పెయింట్స్‌ లాభం రూ.506 కోట్లు

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: ఏషియన్‌ పెయింట్స్‌  ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్‌ క్వార్టర్లో రూ.506 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్‌) సాధించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్లో  రూ.594 కోట్ల నికర లాభం ఆర్జించామని ఏషియన్‌ పెయింట్స్‌ తెలిపింది. నిలిపేసిన కార్యకలాపాల గణాంకాలు కూడా ఉన్నందున గత క్యూ2 నికర లాభాన్నీ, ఈ క్యూ2 నికర లాభాలతో పోల్చకూడదని పేర్కొంది.  మొత్తం ఆదాయం మాత్రం రూ.4,328 కోట్ల నుంచి 9 శాతం

నె‍స్లేకు రూ.100 కోట్ల అక్రమార్జన!

Tuesday 23rd October 2018

న్యూఢిల్లీ: జీఎస్‌టీ రేట్ల తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులకు బదిలీ చేయకుండా అగ్రగామి ఎఫ్‌ఎంసీజీ కంపెనీ నెస్లే ఇండియా రూ.100 కోట్ల మేర అక్రమ లాభార్జనకు పాల్పడింది. ఈ విషయం జీఎస్‌టీ అక్రమార్జన నిరోధక విభాగం (డీజీఏపీ) దర్యాప్తులో తేలింది. దీంతో కంపెనీ స్వచ్ఛందంగా రూ.16.58 కోట్లను వినియోగదారుల సంక్షేమ నిధికి జమ చేసింది. అక్రమార్జన నిరోధక జాతీయ విభాగానికి (ఎన్‌ఏఏ) ఈ మేరకు డీజీసీఏ నివేదిక సమర్పించింది. దీనిపై నెస్లే

Most from this category