STOCKS

News


ఎన్‌పీఏల సమస్యలను అధిగమించే స్థాయికి బ్యాంకులు

Tuesday 30th October 2018
news_main1540879560.png-21579

- తిరిగి లాభాల్లోకి వస్తున్నాయి
- ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ వ్యాఖ్య

న్యూయార్క్‌: భారత బ్యాంకులు మొండి బకాయిల (ఎన్‌పీఏలు) సమస్యను అధిగమించే స్థాయికి వచ్చేశాయని ఎస్‌బీఐ చైర్మన్‌ రజనీష్‌ కుమార్‌ చెప్పారు. సెప్టెంబర్‌ త్రైమాసికంలో వస్తున్న ఫలితాలను బట్టి బ్యాంకులు తిరిగి లాభాల్లోకి వస్తున్నట్టు అర్థమవుతోందన్నారు. గతేడాది బ్యాంకులు భారీ స్థాయిలో ఎన్‌పీఏల పెరుగుదల సమస్యను ఎదుర్కొన్నట్టు చెప్పారు. ఎక్కువగా స్టీల్‌, విద్యుత్‌ రంగాలకు ఇచ్చిన రుణాల రూపంలో ఇది ఉందని, అయితే, ఎక్కువ శాతం ప్రభావం ముగిసిందని చెప్పారాయన. ‘‘ప్రభుత్వరంగ బ్యాంకులు, కొన్ని ప్రైవేటు బ్యాంకులు ఆస్తుల నాణ్యత సవాలును ఎదుర్కొంటున్నాయి. గత మూడు సంవత్సరాలుగా ఇది కొనసాగింది. కానీ, ఈ సమస్య విషయంలో చివరి దశలో ఉన్నాం’’ అని కుమార్‌ తెలిపారు. విద్యుత్‌ రంగానికి సంబంధించి ఎన్‌పీఏలను బ్యాంకులు ఇప్పటికీ పరిష్కరించుకునే స్థితిలో లేవన్నారు. అయితే, దివాలా బ్యాంక్రప్టసీ కోడ్‌ (ఐబీసీ) బ్యాంకులకు మేలు చేస్తున్నదని, ప్రస్తుతం ఓ పరిష్కారం అనేది అందుబాటులో ఉందని చెప్పారాయన. బ్యాంకులకు, రుణదాతలకు ఐబీసీ అన్నది మంచి సాధనంగా పేర్కొన్నారు. చమురు ధరలు స్థిరపడితే, రూపాయి కూడా కుదురుకుంటుందని చెప్పారు. ‘‘దేశీయంగా ఆర్థిక రంగం మంచి పనితీరులో ఉంది. కానీ పెరుగుతున్న చమురు ధరలు అతిపెద్ద అవరోధంగా తయారయ్యాయి. ఎందుకంటే ఇది దేశ కరెంటు ఖాతా లోటుపై పెద్ద ఎత్తున ప్రభావం చూపిస్తుంది. కరెన్సీ మారకం రేటుపైనా ఒత్తిళ్లికు దారితీస్తుంది’’ అని రజనీష్‌ కుమార్‌ వివరించారు.



You may be interested

ఆర్‌బీఐలో కేంద్రం జోక్యం వద్దు

Tuesday 30th October 2018

- దాని స్వయంప్రతిపత్తిని కాపాడాలి - కేంద్రానికి ఆర్‌బీఐ ఉద్యోగుల సంఘం హితవు ముంబై: ఆర్‌బీఐ స్వతంత్రతను కాపాడాలంటూ డిప్యూటీ గవర్నర్‌ విరాళ్‌ ఆచార్య తన గళాన్ని వినిపించిన రెండు రోజులకే.. ఆర్‌బీఐ ఉద్యోగుల సంఘం మద్దుతుగా ముందుకొచ్చింది. ఆర్‌బీఐ స్వతంత్రతను తక్కువ చేసి చూడడమే ఉపద్రవానికి కారణమని ఆల్‌ ఇండియా రిజర్వ్‌ బ్యాంకు అసోసియేషన్‌ పేర్కొంది. ఆర్‌బీఐ స్వయం ప్రతిపత్తిని తగ్గించే ప్రయత్నాలను కేంద్రం మానుకోవాలని ఓ లేఖలో కోరింది. ప్రభుత్వాలు

ఐబీఎం​ చేతికి రెడ్‌ హ్యాట్‌

Tuesday 30th October 2018

రెడ్‌ హ్యాట్‌ను కొనుగోలు చేసిన ఐబీఎమ్‌ డీల్‌ విలువ 3,400 కోట్ల డాలర్లు శాన్‌ఫ్రాన్సి‍స్కో: ఓపెన్‌ సోర్స్‌ సొల్యూషన్స్‌ లీడర్‌ రెడ్‌ హ్యాట్‌ కంపెనీని టెక్నాలజీ దిగ్గజం ఐబీఎమ్‌ కొనుగోలు చేసింది. రెడ్‌ హ్యాట్‌ కొనుగోలుతో లక్ష కోట్ల డాలర్ల హైబ్రిడ్‌ క్లౌడ్‌ మార్కెట్‌లో ఆధిపత్యం కోసం ఐబీఎమ్‌ మరో అడుగు ముందుకేసింది. ఈ డీల్‌ విలువ 3,400 కోట్ల డాలర్లు. ఐబీఎమ్‌ ఇప్పటి వరకూ ఎన్నో కంపెనీలను కొనుగోలు చేసింది. ఈ కొనుగోళ్ల

Most from this category