STOCKS

News


ఇండియన్‌ బ్యాంక్‌పై మొండిబాకీల బండ..

Friday 9th November 2018
news_main1541758749.png-21828

  • నికర లాభం 67 శాతం డౌన్‌
  • పెరిగిన ఎన్‌పీఏలు
  • షేరు 12 శాతానికిపైగా క్రాష్‌

ఇండియన్‌ బ్యాంక్‌ తాజాగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికపు (క్యూ2, జూలై-సెప్టెంబర్‌) ఆర్థిక ఫలితాలను వెల్లడించింది. బ్యాంక్‌ నికర లాభం 67 శాతంమేర క్షీణించింది. రూ.150 కోట్లుగా నమోదయ్యింది. మొండిబకాయిల పెరుగుదల ప్రతికూల ప్రభావం చూపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్‌ నికర లాభం రూ.451 కోట్లుగా నమోదయ్యింది. బ్యాంక్‌ మొత్తం ఆదాయం రూ.4,874 కోట్ల నుంచి రూ.5,129 కోట్లకు ఎగసింది. రుణ నాణ్యత మరింత దిగజారింది. ఈ క్యూ2లో స్థూల మొండిబకాయిలు 7.16 శాతానికి పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇవి 6.67 శాతంగా ఉన్నాయి. ఈ క్యూ2లో నికర ఎన్‌పీఏలు 4.23 శాతానికి పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో ఇవి 3.41 శాతంగా ఉన్నాయి. మొత్తం కేటాయింపులు వార్షికంగా రూ.744 కోట్ల నుంచి రూ.1,004 కోట్లకు ఎగశాయి. 

ఆర్థిక ఫలితాల వెల్లడి నేపథ్యంలో ఇండియన్‌ బ్యాంక్‌ షేరు ధర ఎన్‌ఎస్‌ఈలో 12 శాతానికిపైగా పతనమై రూ.229కి తగ్గింది. 



You may be interested

స్వల్ప నష్టంతో ముగింపు

Friday 9th November 2018

ట్రేడింగ్‌ ఆద్యంతం లాభనష్టాల మధ్య ఊగిసలాడిన సూచీలు చివరకు స్వల్ప నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 79 పాయింట్లు నష్టంతో 35,158 వద్ద ముగిసింది. నిఫ్టీ 13 పాయింట్ల నష్టంతో 10,585 వద్ద ముగిసింది. ప్రపంచ ప్రతికూలతల నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ సూచీలు లాభాలతో మొదలైనా,  వెంటనే వెనకడుగు వేశాయి. డాలర్‌ మారకంలో రూపాయి క్షీణతతో ఐటీ షేర్లు పతనం, హెవీవెయిట్‌ షేర్లు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐటీసీలు క్షీణించడం నేడు సూచీల నష్టాల ముగింపునకు

50-70 డాలర్ల శ్రేణిలో క్రూడ్‌: మూడీస్‌

Friday 9th November 2018

అంతర్జాతీయ వృద్ధిరేటు నెమ్మదిస్తున్న నేపథ్యంలో ముడిచమురు ధరలు మరింత చతికలపడే అవకాశం ఉందని అంచనా వచ్చే ఏడాది భారత జీడీపీ 7.3 శాతంగా ఉండవచ్చు మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ మేనేజింగ్ డైరెక్టర్ మేరీ డిరోన్ వ్యాఖ్య అభివృద్ధి చెందుతున్న దేశాలతో కలిపి మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నెమ్మదించవచ్చు. గడిచిన రెండు ఏళ్ల నుంచి 3.3 శాతం కొనసాగుతున్న పూర్తి ఆర్థిక వ్యవస్థ ప్రస్తుత వృద్ధిరేటు.. వచ్చే ఏడాదిలో 3 శాతానికి తగ్గిపోయే అవకాశం

Most from this category