STOCKS

News


ఇండియన్ బ్యాంక్ లాభం 44% డౌన్‌

Thursday 9th August 2018
news_main1533792315.png-19076

చెన్నై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ప్రభుత్వ రంగ ఇండియన్ బ్యాంక్ లాభం 44 శాతం క్షీణించి రూ.209 కోట్లకు పరిమితమైంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో సంస్థ లాభం 372 కోట్లు. ఏప్రిల్‌-జూన్ త్రైమాసికంలో బ్యాంకు ఆదాయం రూ. 4,788 కోట్ల నుంచి 5,132 కోట్లకు పెరిగింది. మరోవైపు, స్థూల మొండిబాకీలు (ఎన్‌పీఏ) 7.21 శాతం నుంచి స్వల్పంగా 7.20 శాతానికి తగ్గాయి. నికర ఎన్‌పీఏలు మాత్రం 4.05 శాతం నుంచి 3.79 శాతానికి తగ్గాయి. బుధవారం బీఎస్‌ఈలో ఇండియన్ బ్యాంక్ షేరు 5.2 శాతం క్షీణించి రూ. 354.80 వద్ద క్లోజయ్యింది.



You may be interested

కేంద్రానికి ఆర్‌బీఐ రూ.50,000 కోట్ల డివిడెండ్‌

Thursday 9th August 2018

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) 2018 జూన్‌తో ముగిసిన తన ఆర్థిక సంవత్సరంలో (2017-18) కేంద్రానికి రూ.50,000 కోట్ల డివిడెండ్‌ను చెల్లించనుంది. ఈ మొత్తం బడ్జెట్‌ అంచనాలకు అనుగుణంగానే ఉండడం గమనార్హం. అలాగే కేంద్ర ద్రవ్యలోటు కట్టడికి (ప్రభుత్వానికి వచ్చే ఆదాయం - చేసే వ్యయానికి మధ్య నికర వ్యత్యాసం) కూడా ఈ మొత్తం దోహదపడుతుందని సంబంధిత వర్గాలు విశ్లేషిస్తున్నాయి. జూలై-జూన్‌ కాలాన్ని తన ఆర్థిక సంవత్సరంగా

నిస్సాన్ నుంచి కొత్త మైక్రా

Thursday 9th August 2018

న్యూఢిల్లీ: ఆటోమొబైల్ సంస్థ నిస్సాన్ ఇండియా తాజాగా కాంపాక్ట్ కారు మైక్రాలో అప్‌డేటెడ్ వెర్షన్‌ను భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ. 5.03 లక్షలు (ఢిల్లీ ఎక్స్‌షోరూం). ఇది పెట్రోల్‌, డీజిల్ వేరియంట్స్‌లో లభిస్తుంది. డ్యుయల్ ఎయిర్‌బ్యాగ్స్‌, స్పీడ్ వార్నింగ్ డివైజ్, స్పీడ్ సెన్సింగ్ డోర్‌ లాక్‌, డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్ మొదలైన ఫీచర్స్ ఇందులో ఉన్నాయని నిస్సాన్ మోటర్ ఇండియా డైరెక్టర్ హర్‌దీప్ సింగ్ బ్రార్

Most from this category