STOCKS

News


ఆటోమొబైల్‌ ప్లాంట్లు షట్‌డవున్‌

Tuesday 11th June 2019
news_main1560240972.png-26228

  • తగ్గిన వాహన విక్రయాలు 
  • తాత్కాలికంగా ఉత్పత్తిని నిలిపివేయనున్నా తయారి సంస్థలు
  • దేశియ మార్కెట్లలో డిమాండ్‌ లేకపోవడమే కారణం 

సాక్షి: వాహన తయారి సంస్థలు కొన్ని రోజుల పాటు తమ ఉత్పత్తి ప్లాంట్‌లను మూసివేయడానికి సిద్ధమవుతున్నాయి. దేశియ మార్కెట్లలో అమ్మకాలు తగ్గడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని వివరించాయి. రూ.35,000 కోట్ల విలువ గల 5 లక్షలకు పైగా ప్రయాణ వాహనాలు జూన్‌ మొదటి వారానికి  అమ్మకాలు లేక డీలర్స్‌ వద్దనే ఉన్నాయన్నారు.  రూ. 17,500 కోట్ల  విలువ గల ద్విచక్ర వాహనాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని వివరించారు. టాటా మోటర్స్, మహింద్రా, మారుతి సుజుకి వంటి కంపెనీలు మే–జూన్‌ మధ్య తమ ప్లాంట్‌లను మూసివేసే షెడ్యుల్‌ను ఇప్పటికే ప్రకటించాయి. ‘మార్కెట్‌లో డిమాండ్‌ లేనప్పుడు వాహనాలను ఉత్పత్తి చేయడంలో అర్థమేముంది. మే, జూన్‌ నెలలో డిమాండ్‌ను పరిశీలించి మా ఉత్పత్తిని అంచనా వేస్తాం’ అని టాటా మోటర్స్‌ ప్రయాణ వాహనాల విభాగధిపతి మయాంక్‌ పారిక్‌ అన్నారు.  ఈ నిర్ణయంతో మే–జూన్‌ వ్యవదిలో  అన్ని సంస్థలు కలిసి 20–25 మేరకు శాతం ఉత్పత్తిని తగ్గిస్తున్నాయి. దీనితో డీలర్స్‌పై ఉన్న ఒత్తిడి తగ్గనుంంది. ఇప్పటికే అమ్ముడు కాని వాహనాలపై జీఎస్టీలు చెల్లించి నష్టాలలో ఉన్న డీలర్‌లుకు ఇది ఊరటనిచ్చే అంశమే.  హోండా కార్స్‌ ఇండియా, రినాల్ట్‌–నిస్సాన్, స్కోడా వంటి కార్ల తయారి సంస్థలు ప్లాంట్‌లమూసి వేతకు వివిధ రకాల తేదిలను ప్రకటించాయి. మహింద్రా మరియు మహింద్రా 2019–20 ఆర్థిక సంవత్సరం  మొదట్లో 5 నుంచి 13 రోజుల వరకు ఉత్పత్తిని నిలిపివేయనున్నామని ప్రకటించింది.
     మారుతి సుజుకి దేశియ అమ్మకాలు మొత్తం ఏడాది గాను ఏప్రిల్‌ 2019 నాటికి 20 శాతం తగ్గాయి. 2018 ఏప్రిల్‌కు 1,63,434 కార్లను అమ్మగా, ఈ ఏడాది ఏప్రిల్‌లో 1,31,385కు ఈ సంఖ్య పడిపోయింది. స్విఫ్ట్, బాలేనో, సెలారియో, డిజైర్‌ మోడల్స్‌కు డిమాండ్‌ తక్కువగా ఉండడంతో అమ్మకాలు తగ్గాయి. వీటి అమ్మకాలు  14 శాతం మేర తగ్గాయి. ప్రీమియం వాహనాలైన సియాజŒ  అమ్మకాలుæ 45.5 శాతం తగ్గాయి. ఈ కంపెనీ అమ్మకాలలో కేవలం యుటిలిటీ వాహనాలైన జిప్సీ, ఎర్టీగా, ఎస్‌–క్రాస్, విటారా బ్రెజ్జా అమ్మకాలు పెరిగాయి.  అతిపెద్ద యుటిలిటీ వాహనా ఉత్పత్తి దారైనా మహింద్రా అమ్మకాలు కూడా  8శాతం మేర తగ్గాయి. 2018 ఏప్రిల్‌ నాటికి 45,217 వాహనాల అమ్మకాలు జరగగా, 2019 ఏప్రిల్‌ నాటికి ఈ సంఖ్య 41,603కి పడిపోయింది. ఇందులో తగ్గిన ప్యాసింజర్‌ కార్ల అమ్మకాలు కూడా ఉన్నాయి. గత ఏడాది 21,927 యూనిట్లగా ఉన్న అమ్మకాలు ఈ ఏడాది 19,966 యూనిట్లకు పడిపోయాయి. ఇంకో వైపు టాటా మోటర్స్‌ అమ్మకాలు కూడా 26శాతం మేర తగ్గాయి. గత ఏడాది 17,235 యూనిట్లు అమ్ముడవగా, ఈ ఏడాది 12,694 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. 



You may be interested

బ్యాంక్‌ నిఫ్టీ 1శాతం అప్‌

Tuesday 11th June 2019

బ్యాంకింగ్‌ రంగ షేర్ల ర్యాలీతో మంళవారం బ్యాంక్‌ నిఫ్టీ ఇండెక్స్‌ 1శాతానికి పైగా లాభపడింది. ఎన్‌ఎస్‌ఎస్‌ఈలో బ్యాంకింగ్‌ రంగ షేర్లకు ప్రాతనిథ్యం వహించే నిఫ్టీ ఇండెక్స్‌ నేడు 31,172ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. ట్రేడింగ్‌ ప్రారంభం నుంచి ఇన్వెస్టర్లు బ్యాంకింగ్‌ రంగ షేర్ల కొనుగోళ్లకు మొగ్గు చూపడంతో ఇండెక్స్‌ 1.15శాతం(365 పాయింట్లు) పెరిగి 31,399.35ల వద్ద ఇంట్రాడే కనిష్టానికి చేరుకుంది. మధ్యాహ్నం గం.2:45ని.లకు ఇండెక్స్‌ గత ముగింపు(31,034.00)తో పోలిస్తే 1శాతం

జెట్‌ ఎయిర్‌వేస్‌ను వీడని నష్టాలు

Tuesday 11th June 2019

మరో 14శాతం నష్టపోయిన షేర్లు గత కొద్ది రోజులుగా నష్టాల బాటలోనే ప్రయాణిస్తున్న ప్రైవేట్‌ రంగ సంస్థ జెట్‌ ఎయిర్‌వేస్‌ షేర్లు మంగళవారం మరో 14.50శాతం నష్టపోయాయి. హిందూజా, ఎతిహాత్‌ కంపెనీలు జెట్‌ ఎయిర్‌ పునరుర్ధణకు ఎలాంటి ప్రయత్నాలు చేయడం లేదనే వార్తలు ఇందుకు కారణమవుతున్నాయి. నేడు బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు రూ.112.70ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. లండన్‌ ఆధారిత హిందూజా గ్రూప్‌ జెయిట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా కొనుగోలుకు చేపట్టిన చర్చలను

Most from this category