STOCKS

News


ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ లాభం రూ.1,044 కోట్లు

Tuesday 16th October 2018
news_main1539665689.png-21189

ముంబై: ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ (ఐబీహెచ్‌ఎఫ్‌ఎల్‌) కంపెనీ నికర లాభం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో క్వార్టర్‌లో 21 శాతం పెరిగింది. గత క్యూ2లో రూ.861 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 1,044 కోట్లకు పెరిగిందని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ తెలిపింది. మొత్తం ఆదాయం రూ.3,452 కోట్ల నుంచి రూ.4,255 కోట్లకు పెరిగిందని కంపెనీ వైస్‌ చైర్మన్‌, ఎమ్‌డీ గగన్‌ బంగా తెలిపారు. ఈ క్యూ2 చివరి నాటికి తమ చేతిలో రూ.21,250 కోట్ల నగదు, నగదు సమానమైన పెట్టుబడులున్నాయని తెలియజేశారు. ఒక్కో షేర్‌కు రూ.10 మధ్యంతర డివిడెండ్‌ను ఇవ్వనున్నామని తెలిపారు. 
తగిన స్థాయిలో నగదు నిల్వలను నిర్వహించడం తమ దీర్ఘకాలికంగా నిర్వహిస్తున్న  నిర్వహణ సూత్రాల్లో ఒకటని ఐబీహెచ్‌ఎఫ్‌ఎల్‌ బంగా తెలిపారు. బ్యాంక్‌ల లిక్విడిటీ నిబంధనలనే తాము పాటిస్తున్నామన్నారు. ఇళ్ల అమ్మకాలు పుంజుకున్నాయని, అందుబాటు ధరల గృహ అమ్మకాలు ఎప్పటికప్పుడు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుతమున్న ప్రతికూల పరిస్థితుల్లోనూ 20 శాతం వృద్ధిని సాధించగలమన్న ధీమాను ఆయన వ్యక్తం చేశారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్‌ఈలో ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ షేర్‌ 1.8 శాతం లాభంతోఎ రూ.949 వద్ద ముగిసింది. 



You may be interested

డేటా స్టోరేజ్‌ నిబంధనలను అనుగుణంగా 80% కంపెనీలు

Tuesday 16th October 2018

న్యూఢిల్లీ: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూపొందించిన డేటా లోకలైజేషన్‌ (భారత్‌లోని సమాచారం ఇక్కడే భద్రపర్చడం) నిబంధనలకు అనుగుణంగా ఇప్పటివరకు 80 శాతం కంపెనీలు ఇక్కడే డేటాను భద్రపరుస్తున్నట్లు ఒక అధికారిక ప్రకటన ద్వారా వెల్లడైంది. ఈ నిబంధనలకు అక్టోబరు 15 (సోమవారం) తుది గడువు కాగా, పలు డెబిట్‌/క్రెడిట్‌ కంపెనీలు మినహాయించి దాదాపు మిగిలిన అన్ని కంపెనీలు భారత్‌లోనే డేటాను భద్రపరుస్తున్నట్లు తేలింది. ఇప్పటికే ఈ సంస్థలు పలు

నెట్‌వర్క్‌ 18 మీడియా నష్టాలు రూ.68 కోట్లు

Tuesday 16th October 2018

న్యూఢిల్లీ:  నెట్‌వర్క్‌ 18 మీడియా అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ కంపెనీకి కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.68 కోట్ల నికర నష్టాలొచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌లో రూ.71 కోట్ల నికర నష్టాలొచ్చాయని కంపెనీ తెలిపింది. అయితే అంతకుముందటి క్వార్టర్లో (ఈ సంవత్సరం క్యూ1లో) రూ.113 కోట్ల నష్టాలు వచ్చాయని, దీంతో పోలిస్తే ఈ క్యూ2లో నష్టాలు తగ్గాయని నెట్‌వర్క్‌ 18 చైర్మన్‌ అదిల్‌

Most from this category