STOCKS

News


ఇండియాబుల్స్‌ ‘ఓక్‌నార్త్‌’లో సాఫ్ట్‌బ్యాంకు పెట్టుబడులు

Saturday 9th February 2019
news_main1549697569.png-24104

న్యూఢిల్లీ: ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌కు చెందిన అసోసియేట్‌ కంపెనీ ఓక్‌నార్త్‌లో సాఫ్ట్‌బ్యాంకు రూ.2,800 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఓక్‌నార్త్‌ బ్రిటన్‌లో వాణిజ్య బ్యాంకుగా కార్యకలాపాలు నిర్వహిస్తోంది. బ్రాంచ్‌లు లేకుండా పూర్తి డిజిటల్‌ బ్యాంకుగా ఇది నడుస్తుండడం గమనార్హం. సాఫ్ట్‌బ్యాంకు తాజా పెట్టుబడితో ఓక్‌నార్త్‌ ఈక్విటీ క్యాపిటల్‌ రూ.7,000 కోట్లు అవుతుందని ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ స్టాక్‌ ఎక్సేంజ్‌లకు ఇచ్చిన సమాచారంలో పేర్కొంది. ఓక్‌నార్త్‌ యూరోప్‌లో వేగంగా ఎదుగుతున్న కొత్త బ్యాంకుగా పేర్కొంది. చిన్న, మధ్య స్థాయి వ్యాపార సంస్థలకు రుణాలను వేగంగా, సమర్థంగా జారీ చేసేందుకు టెక్నాలజీ టూల్స్‌ను వినియోగిస్తున్నట్టు తెలిపింది. ఓక్‌నార్త్‌ ప్రస్తుత లోన్‌ బుక్‌ విలువ రూ.21,390 కోట్లు. 2015లో రూ.650 కోట్లతో ఓక్‌నార్త్‌ను ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఏర్పాటు చేసింది. బ్యాంకులో 40 శాతం నియంత్రిత వాటా ఉండగా, గతేడాది తన వాటాలో కొంత మొత్తాన్ని సింగపూర్‌ ప్రభుత్వానికి రూ.900 కోట్లకు విక్రయించింది.



You may be interested

అదానీ ట్రాన్స్‌మిషన్స్‌ చేతికి కేఈసీ బికనీర్‌

Saturday 9th February 2019

ముంబై: కేఈసీ ఇంటర్నేషనల్‌లో భాగమైన విద్యుత్ పంపిణీ సంస్థ కేఈసీ బికనీర్ సికర్ ట్రాన్స్‌మిషన్‌ను (కేబీఎస్‌టీ) కొనుగోలు ప్రక్రియ పూర్తి చేసినట్లు ఆదానీ ట్రాన్స్‌మిషన్ (ఏటీఎల్‌) వెల్లడించింది. 100 శాతం వాటాల కొనుగోలుకు రూ. 227.50 కోట్లు వెచ్చించినట్లు వివరించింది. గతేడాది నవంబర్‌లో ఇందుకు సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఏటీఎల్‌ పేర్కొంది. కేబీఎస్‌టీకి 344 సర్క్యూట్ కి.మీ. మేర లైన్లు ఉన్నాయని, ఈ కొనుగోలుతో తమ నెట్‌వర్క్ మొత్తం 13,450

యానివేషన్‌లో సీఏ చదువులు

Saturday 9th February 2019

– వీడియోలతో ఫైనాన్స్‌ కోర్సుల బోధన – ఇండిగోలెర్న్‌లో 12 సీఏ సబ్జెక్ట్‌లు; 20 వేల మంది విద్యార్థులు – రెండేళ్లలో విదేశీ ఫైనాన్స్, అకౌంటింగ్‌ పాఠ్యాంశాలు కూడా.. – ఏడాదిలో రూ.20 కోట్ల నిధుల సమీకరణ పూర్తి – ‘స్టార్టప్‌ డైరీ’తో కంపెనీ సీఈఓ శ్రీరామ్‌ హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: చార్టెర్డ్‌ అకౌంటెన్సీ (సీఏ) చదువు కాస్త గజిబిజి గందరగోళమే. ఆర్ధికం, బిజినెస్‌ లా, స్టాటిస్టిక్స్‌.. ఇలా ప్రతీ సబ్జెక్ట్‌ క్లిష్టమైందే. అయితే దీన్ని అంత్యంత సులువు

Most from this category