STOCKS

News


వాణిజ్య వివాదాలపై అమెరికాతో చర్చలు: మంత్రి సురేష్‌ ప్రభు

Monday 29th October 2018
Markets_main1540790260.png-21553

న్యూఢిల్లీ: ద్వైపాక్షిక వాణిజ్య సమస్యలను పరిష్కరించుకునే దిశగా భారత్‌, అమెరికా మధ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి సురేష్ ప్రభు చెప్పారు. ఇందుకు సంబంధించి అమెరికా చేసిన ఆఫర్‌కు ప్రతిగా భారత్ మరో ప్రతిపాదన చేసినట్లు ఆయన వివరించారు. భారత్‌ నుంచి దిగుమతయ్యే ఉక్కు, అల్యూమినియం ఉత్పత్తులపై అమెరికా భారీగా సుంకాలు పెంచిన సంగతి తెలిసిందే.  దీంతో ప్రతిగా అమెరికా నుంచి దిగుమతయ్యే పప్పులు, ఉక్కు, ఇనుము వంటి సుమారు 29 ఉత్పత్తులపై సుంకాలను నవంబర్ 2 నుంచి పెంచనున్నట్లు భారత్ ప్రకటించింది. అయితే, తాజాగా ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను వాయిదా వేసిన నేపథ్యంలో మంత్రి వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది.



You may be interested

బైక్‌ కోసం... ఏ ఫండ్‌లో పెట్టుబడి పెట్టాలి..?

Monday 29th October 2018

ప్ర: నేను ఇటీవలే ఉద్యోగంలో చేరాను. మ్యూచువల్‌ ఫండ్స్‌లో 25 ఏళ్లపాటు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటున్నాను. మల్టీక్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా ? స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌నా లేక మిడ్‌క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకోవాలా ? 25 ఏళ్ల కాలంలో మల్టీ క్యాఫ్‌ ఫండ్‌ కంటే స్మాల్‌క్యాప్‌ ఫండ్‌ అధిక రాబడులనిస్తుందా ? ఏ ఫండ్‌ను ఎంచుకోమంటారు ? -ఉమాదేవి, విశాఖ పట్టణం జ: భారత్‌లాంటి దేశాల్లో 25 ఏళ్ల కాలాన్ని పరిగణనలోకి తీసుకుంటే స్మాల్‌ క్యాప్‌

ముకేశ్‌ అంబానీ పైప్‌లైన్‌ వ్యాపార విక్రయానికి ఓకే

Monday 29th October 2018

ఆమోదముద్ర వేసిన పీఎన్‌జీఆర్‌బీ న్యూఢిల్లీ: దేశీ కార్పొరేట్‌ దిగ్గజం ముకేశ్‌ అంబానీకి చెందిన గ్యాస్‌ పైప్‌లైన్‌ వ్యాపార విక్రయానికి లైన్‌ క్లియర్‌ అయింది. నష్టాల్లో ఉన్న ఈస్ట్‌-వెస్ట్‌ పైప్‌లైన్‌ లిమిటెడ్‌(ఈడబ్లూ‍్యపీఎల్‌)ను కెనడాకు చెందిన ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ బ్రూక్‌ఫీల్డ్‌కు విక్రయించే ఒప్పందానికి చమురు-గ్యాస్‌ నియంత్రణ సంస్థ(పీఎన్‌జీఆర్‌బీ) కొద్ది వారాల క్రితం ఆమోదముద్ర వేసింది. ఈ విషయాన్ని పీఎన్‌జీఆర్‌బీ చైర్మన్‌ దినేష్‌ కె షరాప్‌ వెల్లడించారు. గతంలో రిలయన్స్‌ గ్యాస్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌గా

Most from this category